భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు!

భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌ వర్క్‌ లలో ఒకటి. 2024 గణాంకాల ప్రకారం ఏకంగా 68584 కిలోమీటర్ల మేర విస్తరించిన పట్టాలపై ప్రతిరోజూ 13,000కు పైగా ప్యాసింజర్ రైళ్లు నడుస్తూ లక్షలాది మందిని నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే ఒకే ప్రయాణంలో ఏకంగా 12 రాష్ట్రాలను చుట్టేస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కళ్లకు కట్టే భారతదేశపు అతి పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా?

12 రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు

దిబ్రూగఢ్ - కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ ప్రెస్.. అసోంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగే ఈ రైలు ప్రయాణం భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. 4100 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఇది కవర్ చేస్తుంది. ఈ రైలు 12 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ తన గమ్యాన్ని చేరుకోవడానికి సుమారు 75 గంటల సమయం తీసుకుంటుంది.

India s Longest Train Journey Did You Know Which Train Travels 12 Indian States in a Single Trip

వివేకానందుడి స్ఫూర్తితో ఆరంభం

స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని 2011లో ఈ ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించారు. అందుకే ఆయన గౌరవార్థం దీనికి వివేక్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచాలనే ఉన్నత లక్ష్యంతో ఈ మార్గాన్ని రూపొందించారు. కేవలం రవాణా సదుపాయంగానే కాకుండా, దేశంలోని భిన్న ప్రాంతాలను ఏకం చేసే ఒక అద్భుత ప్రతీకాత్మక ప్రయాణంగా ఇది నిలుస్తోంది.

రైలు కిటికీలోంచే మినీ భారత్ దర్శనం

సుమారు మూడు రోజుల పాటు సాగే ఈ ప్రయాణం ప్రయాణికులకు జీవితాంతం మర్చిపోలేని మధుర అనుభూతిని అందిస్తుంది. అసోం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల గుండా ఈ రైలు పరుగులు తీస్తుంది. రైలు దిగాల్సిన అవసరం లేకుండానే కిటికీలోంచి భారతదేశపు భౌగోళిక వైవిధ్యాన్ని కళ్లారా చూడొచ్చు.

సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్‌ లో లేని రహస్య దేశాలు ఇవే!సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్‌ లో లేని రహస్య దేశాలు ఇవే!

ప్రధాన స్టేషన్లు, ప్రత్యేక గుర్తింపు

తన సుదీర్ఘ ప్రయాణంలో వివేక్ ఎక్స్‌ ప్రెస్ 55కు పైగా స్టేషన్లలో ఆగుతుంది. గౌహతి, న్యూ జల్పాయిగురి, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై, మదురై వంటి ప్రధాన స్టేషన్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికులు దీనిని కేవలం గమ్యం చేరే మార్గంగా మాత్రమే కాకుండా, భారతదేశాన్ని పూర్తిగా చూసి ఆస్వాదించే అపురూప అనుభవంగా భావిస్తారు. రైలు ప్రయాణాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ మధురమైన ప్రయాణాన్ని ఆస్వాదించాల్సిందే.

Story first published: Thursday, November 26, 2026, 14:16 [IST]
Desktop Bottom Promotion