Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
నోటితో సంభోగం చేస్తున్నారా? ఎయిడ్స్ తో పాటు ఈ ప్రమాదకరమైన వ్యాధులు!
శృంగారంలో తృప్తి పొందేందుకు అనేక రకాల మార్గాలు ఉంటాయి. కొంతమంది శృంగారంలో ముందు ఫోర్ ప్లే ని ఆస్వాదిస్తారు, మరికొందరు శృంగార సమయంలో భావప్రాప్తికి చేరుకున్న తర్వాత మాత్రమే సంతృప్తి చెందుతారు. కొంతమంది నోటి సంపర్కం ఇష్టపడతారు. దీనిని ఇంగ్లీషులో ఓరల్ సెక్స్ అని అంటారు. చాలామందికి ఇది సురక్షితమైన శృంగారంలాగా అనిపించినా..నిజానికి నోటి సంపర్కం వల్ల స్త్రీ,పురుషులు ఇద్దరూ తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని మీకు తెలుసా?
నోటి సంపర్కంలో యోనిని నాకడం జరుగుతుంది. దీంతో యోని ద్రవాలు,మలంతో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధుల(STI) ప్రమాదం పెరుగుతుందట. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) లేదా జననేంద్రియ మొటిమలు కూడా సాధారణంగా కనిపిస్తాయి. HPV అనేది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే వైరస్. ఇది జననేంద్రియ లేదా నోటి సంపర్కం ద్వారా సంక్రమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోటి సంపర్కం ద్వారా ఎదుర్కొనే ప్రమాదాలు ఇవే
మహిళలకు ఇన్ఫెక్షన్
సాధారణంగా లాలాజలం యోని ద్రవాలతో చర్య జరిపినప్పుడు అందులో బ్యాక్టీరియా ఉండటం వల్ల అది యోని బయోమ్‌తో గందరగోళం చెందుతుంది. ఇది చివరికి మీ ఆనందాన్ని బాధగా మార్చవచ్చు ఎందుకంటే మహిళలకు అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓరల్ సంభోగం వల్ల యోనిపై STIలు, మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. అనేక రకాల నోరు, శ్వాసకోశ, జననేంద్రియ సంబంధిత సమస్యలు వస్తాయి.
హెచ్ఐవి లేదా ఎయిడ్స్
నోటి సంపర్కం ద్వారా HIV బారిన పడవచ్చు. నోటి సంపర్కం ద్వారా HIV,ఎయిడ్స్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
గోనేరియా
ఇది నీస్సేరియా గోనోరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది, చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ మూత్ర నాళం, గొంతు, యోని, మలద్వారం ద్వారా సంక్రమించవచ్చు. నోటి ద్వారా సంభోగం చేయడం వల్ల గోనేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులు లేదా స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నవారికి గనేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మెడ క్యాన్సర్
ఒక అధ్యయనం ప్రకారం నోటి ద్వారా సంభోగం చేసుకోవడం వల్ల తల, మెడ క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఏడు రెట్లు పెరుగుతుంది. నోటి ద్వారా సంభోగం చేయడం వల్ల హ్యూమన్ పాపిల్లోమా వైరస్-16 లేదా HPV సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ వైరస్ గర్భాశయ క్యాన్సర్, అనేక ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులకు కారణమవుతుంది. HPV సోకిన వ్యక్తులు పొరపాటున కూడా నోటి సంభోగంలో పాల్గొనకూడదు.
సిఫిలిస్
సిఫిలిస్ అనేది లైంగికంగా సంక్రమించే వ్యాధి. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. నోటి సంభోగం నుండి ఎక్కువ ప్రమాదం ఉంది . సిఫిలిస్ వ్యాధి ట్రెపోనెమా పాలిడమ్ అనే బాక్టీరియం వల్ల వస్తుంది. మీరు సిఫిలిస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం లేదా నోటి ద్వారా సంభోగం చేస్తే మీరు 10 రోజుల్లోపు ఈ వ్యాధితో బాధపడవచ్చు.
నోటి సంభోగం సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి
-మీరు నోటి ద్వారా సంభోగాన్ని ఎక్కువగా ఇష్టపడితే కండోమ్ ఉపయోగించండి.
-మీ వీర్యం, యోని స్రావాలను మీ భాగస్వామి నోటిలో పెట్టకండి.
-యోని చుట్టూ ఏవైనా అలెర్జీలు లేదా బొబ్బలు ఉంటే ఓరల్ సంభోగానికి దూరంగా ఉండండి ఎందుకంటే అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
-ఓరల్ సంభోగం తర్వాత నోటి శుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి.
-నోటి లోపల బొబ్బలు, పెదవులపై బొబ్బలు లేదా గాయాలు, లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం ఉంటే అప్పుడు అస్సలు నోటి సంభోగంలో పాల్గొనవద్దు.
-క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications