Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పీరియడ్స్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా?.. యోగాతో ఇక వాటి అవసరమే ఉండదు.!
రుతుస్రావం సమయంలో మహిళలకు పొత్తి కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు, అలసట, తలనొప్పి, వికారం ఇవన్నీ సహజమే. ఈ క్రమంలో ఆ నొప్పి తట్టుకేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్‌తో ఆ రోజు రిలీఫ్ అనిపించినా వాటి వినియోగం ఎక్కువైతే మున్ముందు వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పెయిన్ కిల్లర్స్‌కి బానిస కాకుండా పీరియడ్స్ సమయంలో నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా దారి చూపిస్తుంది.

ఆధునిక జీవనశైలిలో యోగాను మీ డైలీ రొటీన్‌లో భాగం చేసుకోవడం తప్పనిసరి అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకి సంబంధించి ప్రతి నెలా రుతుచక్రం ఆరోగ్యకరంగా ఉండాలి. అయితే కొందరు మహిళలు క్రమరహిత పీరియడ్స్, ఇంకా రుతుస్రావం సమయంలో తరచూ నొప్పితో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటారు. ఉదయమంతా వారికి భారంగానే గడుస్తుంది. ఈ క్రమంలో ఈ సమస్యల తాత్కాలిక పరిష్కారానికి పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న యోగా టిప్స్‌తో మీ పీరియడ్స్‌ను హెల్తీగా మార్చుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
వాము టీ
పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపు నొప్పి కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో కుదురుగా కూర్చోలేరు. పొట్టంతా నిండినట్లుగా ఉండి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమయంలో టీస్పూన్ వాము తీసుకుని నీళ్లలో బాగా మరిగించి తాగినట్లయితే కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చని యోగా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రుతుచక్రం సక్రమంగా అవుతుంది. తిమ్మిర్లను నియంత్రిస్తుంది.
పీరియడ్స్ క్రాంప్స్
రుతుస్రావం సమయంలో పొట్ట దగ్గర నుంచి కాళ్ల వరకు తిమ్మిర్లు అనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు రెండు మెత్తటి దిండ్లను తీసుకుని వాటిపై తల ఆనించి చైల్డ్ పోజ్‌లో పడుకోవడం ద్వారా పొత్తి కడుపుపై ఒత్తిడి తగ్గి తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చిన్న చిన్న యోగాసనాలు
వెల్లకిలా పడుకుని చిన్న చిన్న యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా కాసేపటికి మైండ్ రిలాక్స్ అవుతుంది. బ్లీడింగ్ వల్ల వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే కోపం, చిరాకు తగ్గుతాయి. అలసటను తగ్గించి చురుగ్గా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తస్రావం కారణంగా కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నొప్పులు అధికమవుతాయి. ఇలాంటి సమయంలో వీలైనంతగా విశ్రాంతి అవసరం. విశ్రాంతి తీసుకునే సమయంలో హాట్ ప్యాక్‌ను పొత్తి కడుపుపై కాసేపు అలాగే ఉంచి పడుకోవడం ద్వారా క్రాంప్స్‌ను తగ్గిస్తాయి. కండరాలు ఉత్తేజితమవుతాయి.
పోషకాహారం తీసుకోవాలి
పీరియడ్స్ సమయంలో సాధారణంగా చాలా మంది మహిళలు నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేడెట్‌గా ఉంచుకోవడం ముఖ్యం. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. సమతుల్య పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. నెలసరి రోజుల్లో ఉదయాన్నే నిద్ర లేచి చిన్న చిన్న యోగాసనాలు చేస్తూ సరైన ఆహారం తీసుకోవాలి. ఇలాంటివి పాటించడం ద్వారా పీరియడ్స్ నెలనెలా సక్రమంగా రావడంతో పాటు రక్తస్రావం సమయంలో వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
