Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
కొబ్బరి నీళ్లు స్ట్రాతో నేరుగా తాగుతున్నారా? అయితే ఈ ప్రాణాంతక నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
మండుటెండలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా విపరీతమైన దాహంగా అనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది చల్లటి కొబ్బరి నీళ్లు. రోడ్డు పక్కన బండి కనిపించగానే ఆగి, ఆ వ్యాపారి కొబ్బరికాయను కత్తితో కొట్టి, అందులో ఓ స్ట్రా వేసి ఇవ్వగానే మనం ఎంతో ఆత్రంగా తాగేస్తుంటాం. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజసిద్ధమైన పానీయం అమృతంలా అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పచ్చటి కొబ్బరికాయ లోపల మనం స్ట్రా పెట్టి తాగుతున్న ఆ నీరు ఎంత సురక్షితమైనదో? కంటికి కనిపించకుండా, కేవలం స్ట్రాతో గుటగుట తాగేయడం వల్ల దాగి ఉన్న ఓ పెద్ద ప్రమాదాన్ని మనం కొనితెచ్చుకుంటున్నామని మీకు తెలుసా?

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ డాక్టర్ బి.పి.ఎస్. త్యాగి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. కొబ్బరి నీళ్లను నేరుగా కొబ్బరికాయలోంచి స్ట్రాతో తాగడం ఎందుకు ప్రమాదకరమో, దాన్ని సురక్షితంగా ఎలా తాగాలో ఆయన ఆ వీడియోలో స్పష్టంగా వివరించారు. మనం స్ట్రా ఉపయోగించి తాగినప్పుడు, కాయ లోపలి భాగం మనకు కనిపించదు. అదే అసలు సమస్య. కొబ్బరి నీళ్లలో తరచుగా ప్రమాదకరమైన బూజు ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ త్యాగి హెచ్చరించారు.
దీన్ని నిరూపించడానికి ఆయన రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లను చూపించారు. ఒక గ్లాసులోని నీరు ఎంతో స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండగా... మరో గ్లాసులోని నీళ్లలో చిన్నచిన్న తెల్లటి రేణువులు తేలియాడుతూ కనిపించాయి. మీరు కూడా ఎప్పుడైనా గ్లాసులో కొబ్బరి నీళ్లు పోసుకున్నప్పుడు ఇలాంటి తెల్లటి పదార్థాలను గమనించే ఉంటారు. అయితే ఆ రేణువులు ఏంటి? అవి మన శరీరంలోకి వెళితే ఏమవుతుంది? అనే విషయాన్ని మనం ఎప్పుడూ పెద్దగా పట్టించుకోము. కానీ ఆ తెల్లటి రేణువులే మన ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదకరమైన బూజు లేదా ఫంగస్ అని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయమై ప్రముఖ పరిశోధనా వేదిక రిసెర్చ్ గేట్ కూడా ఓ సంచలన అధ్యయనాన్ని ప్రచురించింది. వాస్తవానికి లేత పచ్చి కొబ్బరికాయల నుండి లభించే నీరు ఎంతో అద్భుతమైనది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, తక్కువ కేలరీలు కలిగి ఉండి, కమర్షియల్ స్పోర్ట్స్ డ్రింక్స్ కు ఆరోగ్యకరమైన సహజ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇందులోని అపారమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల వల్లే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇంతటి క్రేజ్ వచ్చింది. అయితే అదే స్థాయిలో ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని ఆ అధ్యయనం తేల్చి చెప్పింది.

ముఖ్యంగా కొబ్బరి నీళ్లను సరిగ్గా నిల్వ చేయకపోయినా, పాడైపోయిన కాయలను ఎంచుకున్నా అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆ రిపోర్ట్ హెచ్చరించింది. కొబ్బరి నీరు చాలా త్వరగా పాడైపోయే స్వభావం ఉన్న ద్రవం. దీనిని సరైన వాతావరణంలో భద్రపరచకపోతే, అందులో ప్రాణాంతక క్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా గది ఉష్ణోగ్రత వద్ద కొబ్బరికాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు, లోపల ఉన్న నీరు బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అత్యంత అనుకూలమైన వాతావరణంగా మారుతుంది.
సరైన రిఫ్రిజిరేషన్ లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా, లేదా కాయలకు చిన్నపాటి రంధ్రాలు పడి గాలి చొరబడినా ఈ ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి. ఇలా కలుషితమైన, పాడైపోయిన కొబ్బరి నీటిని మనం తెలియక స్ట్రాతో గుడ్డిగా తాగేస్తే, అది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాపాయ స్థితికి కూడా తీసుకువెళుతుంది.
మనమేం చేయాలి?
ఇకపై కొబ్బరి నీళ్లు తాగే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్ట్రాతో నేరుగా కాయలోంచి తాగే పద్ధతిని మార్చుకోండి. కొబ్బరి నీళ్లను ముందుగా ఒక పారదర్శకమైన గ్లాసులో పోయించుకుని, నీరు స్వచ్ఛంగా ఉందో లేదో చూడండి. అందులో ఎలాంటి బూజు లేదా తెల్లటి రేణువులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే తాగడం అలవాటు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications