Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అన్నం తింటూ మొబైల్ చూస్తున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
మన పెద్దలు తరచూ ఒక మాట చెబుతుంటారు..అన్నం పరబ్రహ్మ స్వరూపం, తినేటప్పుడు ఆహారాన్ని అమృతంలా ఆస్వాదిస్తూ, ప్రశాంతంగా తినాలి అని. కానీ నేటి బిజీ లైఫ్ లో భోజనం చేసే తీరు పూర్తిగా మారిపోయింది. మన పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్ ఫోన్, కళ్ల ముందు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ వీడియోలు.
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఇంటా ఇదే దినచర్య. ఒకప్పుడు టీవీ చూస్తూ తినడం అలవాటుగా ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని మొబైల్ ఫోన్లు ఆక్రమించాయి. అయితే సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఆహారాన్ని తినే అలవాటు మన ఆరోగ్యంపై ఎంత భయంకరమైన ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా?

మొబైల్ చూస్తూ భోజనం చేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?
ఊబకాయం
భోజనం చేసేటప్పుడు మన దృష్టి మొత్తం స్క్రీన్ పైనే ఉంటే, మనం ఎంత తింటున్నామనే దానిపై మెదడుకు సరైన సిగ్నల్స్ అందవు. పొట్ట నిండినప్పటికీ మన ఫోకస్ వీడియోపై ఉండటం వల్ల మనం ఇంకా తింటూనే ఉంటాం.
ఈ మైండ్ లెస్ ఈటింగ్ వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరిపోతాయి. ఫోన్ చూస్తూ తినేవారు సాధారణం కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారని, తద్వారా ఇది వేగంగా బరువు పెరగడానికి, భయంకరమైన ఊబకాయానికి దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
జీర్ణవ్యవస్థపై తీవ్ర దెబ్బ
ఆహారం తినగానే జీర్ణక్రియ నోటి నుంచే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగినప్పుడే అది లాలాజలంతో కలిసి సులభంగా జీర్ణమవుతుంది.
కానీ మొబైల్ చూస్తూ హడావిడిగా తినే క్రమంలో మనం ఆహారాన్ని సరిగ్గా నమలము, నేరుగా మింగేస్తుంటాము. దీనివల్ల పేగులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా అజీర్తి, కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.
మధుమేహం ముప్పు
టీవీ లేదా మొబైల్ చూస్తూ ఒకేచోట కూర్చుని అతిగా తినడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు బాగా మందగిస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవడం, శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ అలవాటు భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి వాటికి కచ్చితంగా దూరంగా ఉండండి. వాటిని పక్క గదిలో ఉంచడం ఉత్తమం.
-భోజనం చేసేటప్పుడు అనవసరమైన మాటలు, చర్చలు వద్దు. మీ కంచంలోని ఆహారం రంగు, రుచి, వాసనను ఆస్వాదిస్తూ మనస్ఫూర్తిగా తినండి.
-ప్రతి ముద్దను నెమ్మదిగా, నమిలి మింగండి. దీనివల్ల జీర్ణవ్యవస్థకు సగం భారం తగ్గుతుంది, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
-భోజనం చేసిన వెంటనే గటగటా నీళ్లు తాగకండి. ఇది కడుపులోని జీర్ణ రసాలను పలుచగా చేసి జీర్ణక్రియను అడ్డుకుంటుంది. భోజనం చేసిన అరగంట తర్వాతే నీరు తాగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications