Latest Updates
-
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు!
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
చిన్న వయసులోనే జుట్టు సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఎక్కువగా జుట్టు రాలడం, చుండ్రు రావడం వేధిస్తోంది. చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు రాలిపోతుంది. అయితే ఈ రెండూ ఒకేసారి వస్తే ఏం చేయాలి.. జుట్టు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి.. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సలహాలు చూద్దాం..

చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు కూడా అదే పనిగా రాలిపోతుందని అనుకోవద్దు. చుండ్రు కారణంగా తల చర్మం విపరీతంగా దురద పెట్టినప్పుడు పదేపదే గోకుతుంటాం. దీని వల్ల తల చర్మంలో చికాకు, వాపు ఏర్పడుతాయి. దీంతో కుదుళ్లు దెబ్బతిని మరింతగా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. అందుకే ముందుగా జుట్టు రాలిపోవడం సమస్య నుంచి బయటపడాలంటే చుండ్రును నియంత్రించడం చాలా ముఖ్యం. చుండ్రు ఎందుకు వ్యాపిస్తుందో కారణాలు తెలుసుకోవాలి.
తలపై సాధారణ చుండ్రులా కనిపించేది కొన్నిసార్లు సెబోర్హెయిక్ డెర్మటైటిస్ కావచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ఒక చర్మ సమస్య కాగా.. దీనివల్ల తల చర్మం దురదగా, పొలుసులుగా, కొన్నిసార్లు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుంది. స్కాల్ప్ సోరియాసిస్, ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు కూడా చుండ్రులా కనిపించి, జుట్టు రాలడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.

అయితే మీ జుట్టులో చుండ్రు తేలికపాటిదిగా ఉంటే, సెలీనియం లేదా జింక్ వంటి పదార్థాలు కలిగిన చుండ్రు నివారణ షాంపూను ఉపయోగించి సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ కొంతమందికి కీటోకోనజోల్ కలిగిన యాంటీ-ఫంగల్ షాంపూ కూడా అవసరం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చివరిగా చుండ్రు మొండిగా లేదా తీవ్రంగా ఉంటే సరైన కారణం చికిత్స తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచన మేరకు షాంపూను ఉపయోగించి చుండ్రు నివారణ చర్యలు చేపట్టాలి.
ఈ తప్పులు వద్దు
చుండ్రు సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా తలను గోకడం, బలంగా జుట్టును దువ్వడం, పదే పదే లాగడం, బిగుతుగా జుట్టు ముడివేసుకోవడం, గట్టింగా స్టైలింగ్ చేయడం వంటివి చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నుల వల్ల తలపై మరింత చికాకు కలుగుతుంది. జుట్టును దెబ్బతీస్తుంది. చుండ్రు ఉన్నా లేకపోయినా మీ జుట్టు గుత్తులుగా రాలిపోతుంటే, దురద తీవ్రంగా ఉన్న చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి సూచనలు పాటించాలి. సరైన కారణం తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
జుట్టు ఆరోగ్యం కోసం వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా నూనె పెట్టడం వల్ల కురులు ఆరోగ్యంగా పెరుగుతాయి. బయటకు వెళ్లినప్పుడు తలపై స్కార్ఫ్ కట్టుకోవడం ద్వారా ఎండ, దుమ్ము, ధూళి లేదా వాన నుంచి జుట్టును కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
