Latest Updates
-
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్!
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.!
నేటి కాలంలో సంతానలేమి సమస్యలు ఎక్కువవుతున్నాయి. చాలా మంది దంపతులు చిన్న వయసులోనే పెళ్లయినా పలు కారణాల వల్ల గర్భదారణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఆడవారిలో గర్భాశయ సమస్యలు ఎక్కువవుతుండగా.. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోయి సంతానంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మగవారి జీవనశైలిలో ఈ చెడు ఆహార అలవాట్ల కారణంగా వారిలో వంధ్యత్వ సమస్యలు ఏర్పడుతున్నాయని గైనకాలజిస్టు నిపుణులు అంటున్నారు.

భార్య గర్భం దాల్చేందుకు భర్తలో వీర్యకణాలు ఆరోగ్యకరంగా ఉండటం తప్పనిసరి. కణాల చురుకైన కదలిక, డీఎన్‌ఏ ఆకృతి, సంఖ్య ఎక్కువగా ఉండాలి. అప్పుడే గర్భం దాల్చే ప్రక్రియ సులభమవుతుంది. కానీ ఈ రోజుల్లో వారి జీవనశైలిలో ప్రతికూల మార్పుల కారణంగా సంతానలేమి సమస్యలు ఏర్పడుతుంది. ఈ పది ఆహారపు అలవాట్లు ఈ సమస్యను ఎక్కువ చేస్తున్నాయని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు.

కాఫీ
కాఫీలో అధిక మొత్తంలో కెఫీన్ ఉన్న కారణంగా దీనిని తరచూ తీసుకుంటే అది స్పెర్మ్(శుక్ర కణాల) డీఎన్‌ఏని డ్యామేజ్ చేస్తుంది. దీని వల్ల వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. వాటి ఆకృతి సరిగా లేని కారణంగా అవి అండాలను చేరుకోలేవు.
ఆల్కహాల్
పురుషులు ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే అది వారి వీర్యకణాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ సైతం ఏర్పడి ఎక్కువ వరకూ కణాలు చనిపోతాయి. ఇవి ఆరోగ్యవంతమైన స్పెర్మ్ పైనా ప్రభావం చూపిస్తాయి.

జంక్ ఫుడ్
పని ఒత్తిడిలో పడి పురుషులు ఎక్కువగా జంక్ ఫుడ్‌ను ఆశ్రయిస్తుంటారు. చిప్స్, బిస్కెట్స్, ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటారు. వీటిలో అధికంగా ఉప్పు, చెడు కొలెస్ట్రాల్ కారణంగా శుక్రకణాల నాణ్యత తగ్గిపోయి కదలిక సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో ఇవి గర్భాశయంలో చురుగ్గా కదలలేవు.
ట్రాన్స్ ఫ్యాట్
నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అది వీర్య కణాల కదలికపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో భార్యాభర్తలు కలిసినప్పుడు అవి అండాన్ని చేరుకోలేవు. దీంతో సంతానం కోసం ప్రయత్నించే వారికి కష్టతరంగా ఉంటుంది.

కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు
కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు బటర్, ఛీజ్, క్రీమ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా వీర్య కణాల కదలిక తగ్గిపోతాయి. ఇవి యాక్టివ్‌గా ఉన్న కణాలకి సైతం అడ్డుగా నిలిచి ముందుకు కదలకుండా అడ్డుకుంటాయి. దీంతో సంతాన ప్రక్రియపై ప్రభావం చూపిస్తుంది.
సోయా ఉత్పత్తులు
అధిక మోతాదులో సోయా ఉత్పత్తులు అంటే సోయా మిల్క్, పనీర్, టోపు తీసుకోవడం ద్వారా అవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీంతో వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది.

కెమికల్స్
రసాయన ఎరువులతో కూడిన కూరగాయలను, పండ్లను సరిగా శుభ్రం చేయకుండా తీసుకోవడం ద్వారా శుక్రకణాల డీఎన్‌ఏ దెబ్బతింటుంది.
ప్లాస్టిక్
ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రల్లో వేడి చేసుకుని తినడం చాలా డేంజర్. ఇలా చేయడం ద్వారా అందులోని బీపీఏ కెమికల్స్ శరీరంలో చేరి హార్మోన్ల అసమతుల్యతకి దారితీస్తుంది.
ప్రాసెస్ చేసిన మాంసాహారం
తాజా నాన్‌వెజ్ కాకుండా, ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవడం ద్వారా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది.
చక్కెర
అధిక మోతాదులో చక్కెర తీసుకోవడం వీర్యకణాల ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెరతో చేసిన పానీయాలు, స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుందని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications