Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
80 శాతం రోగాలకు మందులు అక్కర్లేదు.. ఈ 4 అలవాట్లు మార్చుకుంటే చాలు!
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పాత సామెత కావచ్చు, కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అది అక్షర సత్యం. ఆరోగ్యం అనేది ఏదో రాత్రికి రాత్రే ఆకాశం నుండి ఊడిపడే అద్భుతం కాదు. అది మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు, తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి నిర్మించుకునే ఒక అందమైన భవనం లాంటిది. షుగర్, బీపీ, గుండె జబ్బులు లాంటివి ఉన్నట్టుండి అటాక్ చేయవు. మనం ఏళ్ల తరబడి మన శరీరాన్ని చేసే నిర్లక్ష్యమే ఆ వ్యాధులకు పునాది.

ప్రఖ్యాత ఎయిమ్స్ లో శిక్షణ పొంది, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథి మన జీవనశైలి గురించి కొన్ని కళ్లు తెరిపించే నిజాలను పంచుకున్నారు. డాక్టర్ సౌరభ్ సేథి ప్రకారం ప్రపంచంలో వచ్చే 80 శాతం దీర్ఘకాలిక వ్యాధులను కేవలం మన అలవాట్లు మార్చుకోవడం ద్వారానే నివారించవచ్చు. ఆరోగ్యం అనే బ్యాంకులో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి డాక్టర్ సేథి సూచించిన ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇక్కడ చూడండి.
నిద్ర..ప్రకృతి ఇచ్చిన ఉచిత మెకానిక్
నిద్ర అనేది కేవలం కళ్లు మూసుకోవడం కాదు, అది మన శరీరాన్ని రిపేర్ చేసే అద్భుతమైన ప్రక్రియ. రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 48శాతం, పక్షవాతం ముప్పు 15 శాతం ఎక్కువని మీకు తెలుసా? నిద్రలేమి వల్ల ఊబకాయం వచ్చే అవకాశం కూడా 55 శాతం పెరుగుతుంది. మీ నిద్రను నిర్లక్ష్యం చేయడం అంటే మీ ఆయుష్షును మీరే తగ్గించుకోవడమే.
ఒత్తిడి.. సైలెంట్ కిల్లర్
మనశ్శాంతి అనేది కేవలం మెదడుకు మాత్రమే కాదు, శరీరంలోని ప్రతి అవయవానికీ అవసరం. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ లెవల్స్ పెరిగిపోయి.. బీపీ, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అమెరికాలో సంభవించే టాప్ 10 మరణాలకు సంబంధించిన కారణాల్లో ఆరు మరణాలకు ఒత్తిడి ప్రధాన కారణం కావడం గమనార్హం.
పేగుల ఆరోగ్యమే.. దేహానికి శ్రీరామరక్ష
ఈ రోజు మీరు ఏ ఆహారం తింటున్నారో.. పదేళ్ల తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో అదే నిర్ణయిస్తుంది అంటారు డాక్టర్ సేథి. మన రోగనిరోధక శక్తి, మూడ్ అంతా మన పేగుల్లోని సూక్ష్మజీవుల చేతుల్లోనే ఉంటుంది. చాలామంది కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను 3 నుండి 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసి ఆ తర్వాతే డాక్టర్ వద్దకు వెళ్తారు. ఈ చిన్న సమస్యలే క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు దారి తీయవచ్చు. పీచు పదార్థాలు, ప్రాసెస్ చేయని ఆహారం తినడం అలవాటు చేసుకోండి.
ఒంటరితనం.. రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదకరం
నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం అనేది ఆరోగ్యానికి రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదకరం అని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల అకాల మరణం ముప్పు 26 శాతం పెరుగుతుంది. డిప్రెషన్, గుండె జబ్బులు చుట్టుముడతాయి. కాబట్టి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయం గడపండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
