Latest Updates
-
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.!
ఒకప్పుడు వృద్ధాప్యం దగ్గరపడుతున్న సమయంలో జుట్టు నెరిసిపోయేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. ప్రస్తుత కాలంలో టీనేజర్లు ఎదుర్కొంటున్న సమస్య ఇది. జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, పోషకాల లోపం జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి దీనికి పరిష్కారాలేంటి.. ఇక్కడ చూద్దాం.

సాధారణంగా మన జుట్టు సహజ రంగు మెలనినన్ అనే వర్ణ ద్రవ్యంపై ఆధారపడి ఉంటుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అయితే శరీరంలో కొన్ని మార్పులు సంభవించినప్పుడు జుట్టు నాణ్యత, రంగు రెండు ప్రభావితమవుతాయని వెల్లడించారు. ఈ క్రమంలో జుట్టును సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు హెయిర్ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదని తెలిసినా.. తరచూ వీటిని వినియోగిస్తుంటారు. అయితే ఏ కారణాల వల్ల జుట్టు నెరసిపోతుంది.. ఎలాంటి సంకేతాలు జుట్టు తెల్లబడటానికి కారణాలవుతాయో మనం అర్థం చేసుకోవాలి.
జుట్టు ఆరోగ్యంలో వీటి లోపం
మన శరీరానికి అతి ముఖ్యమైన కొన్ని విటమిన్లు, ఖనిజాల లోపాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వైద్యులు పేర్కొన్నారు. విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, కాపర్, జింక్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా కీలకం. ఇవి లోపించినట్లయితే జుట్టు రాలడం, ఊడిపోవడం, చిన్న వయసులోనే తెల్లబడటం జరుగుతాయి.
సంకేతాలు ఇవే
అయితే పోషకాహార లోపాలు మాత్రమే కాకుండా జన్యువుల లోపం కూడా జుట్టు నెరిసిపోవడానికి దారితీస్తాయి. ముందు తరాల వారిలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిన చరిత్ర ఉంటే అది ఈ తరం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఖచ్చితమైన కారణాల కోసం సంబంధిత వైద్యుడిని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం, వేగంగా జుట్టు రాలిపోవడం, నీరసం, అలసట, చర్మం, గోళ్లలో మార్పులు, తరచుగా తల తిరగడం, ఏకాగ్రత లేకపోవడం వంటివి పోషకాహార లోపాలకు సంకేతంగా భావించాలి.
జుట్టు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి..
జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజూ సమతుల్యమైన, పోషకాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు, సీడ్స్, మొలకలు, ప్రొటీన్ ఉండే పదార్థాలు ఎక్కువగా తినాలి. ముఖ్యంగా తగినంత నిద్ర చాలా అవసరం. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జుట్టుపై అధికంగా రసాయన ఉత్పత్తులను వాడటం మంచిది కాదు. వీలైనంతగా వాటిని తగ్గించి సహజంగా ఇంట్లో లభ్యమయ్యే పరిష్కారాలను చూడాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
