Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
వర్షాకాలంలో ఈ కూరగాయలను కొనుగోలు చేసేముందు ఈ కీలక జాగ్రత్తలు తప్పనిసరి.!
వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ కొన్ని రోజులు వర్షాలు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించినా.. గత కొంత కాలం నుంచి మళ్లీ భానుడి భగభగలు మండుతున్నాయి. ఉక్కపోత కారణంగా మళ్లీ ఫ్యాన్లు, కూలర్లు విపరీతంగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో వర్షాకాలంలో ఆహారం, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొన్ని కూరగాయలను తినేముందు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో గాలిలో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్, క్రిమికీటకులు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవి పంట పొలాల్లో కూరగాయలు, ఆకుకూరలపై చేరుతాయి. వీటిని మనం నిర్లక్ష్యంగా తీసుకోవడం ద్వారా కడుపు ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు దారితీయవచ్చు. ఈ క్రమంలో ఈ కాలంలో కూరగాయలను ఎంచుకునేముందు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా 10 కూరగాయల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి. వీటిని కూరల్లో వాడేముందు శుభ్రంగా, పలు మార్లు కడిగిన తర్వాత వాడుకోవాలి.
పాలకూర, మెంతి కూర
సీజన్‌తో సంబంధం లేకుండా పాలకూరను ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పాలకూర, తోటకూర, గోంగూర వంటి వివిధ రకాల ఆకుకూరల్లో సులభంగా మట్టి, చిన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆకులు కూడా రంగు మారుతుంటాయి. ఇక మెంతి ఆకుల్లో ఎక్కువగా మట్టి, ధూళి, పురుగులు ఎక్కువగా చేరతాయి. అందుకే ఆకుకూరలు కొనుగోలు చేసేముందు అంతా సరిచూసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే వండుకోవాలి.
కాలీఫ్లవర్, క్యాబేజ్
వర్షాల సమయంలో వాతావరణం, భూమిలో తేమ కారణంగా కాలీఫ్లవర్ పొరల మధ్య చిన్న చిన్న పరుగులు, మట్టి విపరీతంగా చేరతాయి. చాలావరకు ఈ పురుగులు మట్టిలో కనిపించవు. అందుకే వర్షాకాలంలో కాలీఫ్లవర్‌ను కొనుగోలు చేసే ముందు నిశితంగా పరిశీలించాలి. తాజా కూరగాయను కొనుగోలు చేయాలి. దీనిని వండే ముందు ఉప్పు నీటిలో నానబెట్టి, శుభ్రంగా కడగాలి. క్యాబేజ్‌ను కొనుగోలు చేసేముందు దెబ్బతిన్న, నల్లబడిన ఆకులు ఉన్న క్యాబేజ్‌ను కొనుగోలు చేయకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

పుట్టగొడుగులు
పుట్టగొడుగులు సహజంగానే తేమ అధికంగా ఉన్న వాతావరణంలో పెరుగుతాయి. అయితే వర్షాకాలంలో అధిక తేమ కారణంగా అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని కొనుగోలు చేసే ముందు జాగ్రత్త వహించాలి. తాజా పుట్టగొడుగులను కొనాలి. తినే ముందు బాగా ఉడికించి వంటలో వాడాలి.
వంకాయలు, పొట్లకాయ
వంకాయలను ఇష్టపడని వారుండరు. అయితే వర్షాకాలంలో తేమ కారణంగా వంకాయలకు పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిపై రంధ్రాలు, నల్లటి మచ్చలు ఉండటం, త్వరగా మెత్తబడటం వంటివి జరుగుతాయి. ఇలాంటి వాటిని కొనుగోలు చేయకూడదు. తాజాగా, గట్టిగా ఉన్న వంకాయలను తీసుకోవాలి. తేమ కారణంగా పొట్లకాయలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ. నాణ్యత లేని వాటిని తినడం ద్వారా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. తాజాగా, శుభ్రంగా ఉన్న పొట్లకాయను వంటల్లో వాడాలి.

క్యాప్సికమ్, చామదుంప, బెండకాయ
వర్షాకాలంలో క్యాప్సికమ్ త్వరగా పాడైపోతుంది. తాజాగా, మెరిసేలా ఉన్న క్యాప్సికమ్‌ను కొనుగోలు చేయాలి. అవి మెత్తగా, కుళ్లిపోయినట్లు కనిపిస్తే తీసుకోకండి. శుభ్రంగా ఉన్న చామదుంపలను కొనుగోలు చేయాలి. వండేముందు బాగా ఉడికించాలి. సరిగ్గా ఉడకని వాటిని తినడం ద్వారా గొంతులో దురద, మంట, అసౌకర్యం కలిగించే ప్రమాదం ఉంది. సాధారణంగానే బెండకాయలు జిగురుగా ఉంటాయి. ఈ కాలంలో తేమ కారణంగా వాటిపై మరింత జిరుగు పెరిగి పాడైపోతాయి. రంగు మారని, తాజాగా ఉన్న బెండకాయలను ఎంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
