Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
Copper Water: రాగి నీటిని ఇలా తాగుతున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.!
Copper Water Tips: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ముప్పై ఏళ్లకే ఎముకలు పటుత్వం కోల్పోయి మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. పూర్వకాలంలో బలవర్ధకమైన ఆహారం కారణంగా 90 ఏళ్లు దాటినా వారిలో మెటబాలిజం పటిష్టంగా ఉండేది. కానీ.. ఇప్పుడు అలా కాదు. అందుకే మళ్లీ పాతకాలపు ఆహారపు అలవాట్లను మెల్లగా అలవాటు చేసుకుంటున్నాం. వాటిలో ముఖ్యమైనది రాగి(Copper).

రాగి చెంబులు, బిందెల్లో(Copper Water) నీరు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా రాగి గ్లాస్ అయినా ఉంటుంది. కానీ చాలా మందికి కాపర్ వాటర్ ఎలా తీసుకోవాలి అనే దానిపై సరిగా అవగాహన ఉండదు. తద్వారా లేనిపోని చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. రాగి వస్తువుల్లో నీటిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో న్యూట్రిషనిస్టులు చెబుతున్న సలహాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
కొందరు రోజంతా రాగి గ్లాసుల్లో అప్పటికప్పుడు నీళ్లు నింపుకొని తాగుతుంటారు. మరికొందరు రాత్రంతా నీటిని నిల్వ ఉంచి, ఉదయాన్నే పరగడుపున తాగడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.. రోగనిరోధక శక్తి బలపడి, శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయని భావిస్తారు. కానీ ఈ విధానంలో మీరు చేసే కొన్ని పొరపాట్లు మీ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ఇలా చేయకండి..
కానీ, రాగి గ్లాసు, బాటిల్ లేదా బిందెల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం, లేదా రాగి నీటిని పరిమితికి మించి తీసుకుంటే మీ ఆరోగ్యం చిక్కుల్లో పడినట్లే. ఇలా చేస్తే శరీరంలో రాగి పరిమాణాన్ని పెంచి, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాగి నీటిని రాత్రిపూట నిల్వ ఉంచుకుని.. ఆ తర్వాత రోజు 250 నుంచి 500 మిల్లీలీటర్ల నీటిని తీసుకుంటే శరీరానికి సరిపోతుందని సూచిస్తున్నారు. చింతపండు పేస్ట్, ఉప్పు మిశ్రమంతో తరచుగా రాగి వస్తువులను శుభ్రం చేసుకోవాలి. స్క్రబర్స్ లాంటి వాటిని ఉపయోగించడం ద్వారా వాటిపై గీతలు పడి త్వరగా పాడవుతాయని గుర్తుంచుకోవాలి.

దీనిని కలపొద్దు
మరికొంతమంది రాగి గ్లాసులో నిల్వ ఉంచిన నీటిలో నిమ్మరసం(Copper Acidic Mix) కలుపుకుని తాగుతుంటారు. అయితే ఇది చాలా పెద్ద పొరపాటు. నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చర్య జరుపుతుంది. ఈ నీటిని తీసుకుంటే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. రాగి గ్లాసులో ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలు, జ్యూస్‌లు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి వేటినీ కలపకూడదని గమనించాలి.
సరైన ఉష్ణోగ్రత
రాగి సీసాల్లో నీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలని గుర్తుంచుకోవాలి. అతి వేడిగా ఉన్న నీటిని గానీ, అతి చల్లగా ఉన్న నీటిని గానీ రాగి సీసాలలో నిల్వ చేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పులు రాగి గుణాలను ప్రభావితం చేసి మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది.
ఇక, మనం రాగి నీరు తీసుకునే సీజన్ కూడా ఇక్కడ ప్రధానం. వర్షాకాలంలో తాగు నీరు కల్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి.. ఈ సీజన్‌లో రాగి నీరు తీసుకోవడం బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరకుండా నిరోధిస్తుంది. చలికాలంలోనూ రాగి నీటిని తరచూ తీసుకోవచ్చు. ఇక వేసవిలో రాగి నీటి కంటే రాగి జావకి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మీ ఆహారపు అలవాట్లలో రాగి నీటిని సరైన మోతాదులో చేర్చుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
