Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ.. రోజులో ఎన్నిసార్లు తాగాలో తెలుసా.?
కెఫీన్ తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ ఉన్న గ్రీన్ టీకి ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉంది. డైట్ ఫాలో అయ్యేవారు, బరువు తగ్గాలనుకునేవారు సహజసిద్ధంగా లభించే గ్రీన్ టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ తేనీయాన్ని రోజులో ఎప్పుడు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అందుకే వారికి ఆశించిన ఫలితం దక్కడం లేదు. గ్రీన్ టీని ఎప్పుడు, ఎలా తీసుకుంటే ఫలితం ఉంటుందో పోషకాహార నిపుణుల సలహాలు చూద్దాం.
చాలా మంది ఉదయాన్నే పరగడుపునే గ్రీన్ టీ తాగేస్తుంటారు. ఆ తర్వాత పనులు మొదలుపెడుతుంటారు. ఇది చాలా పొరపాటు. ఇలా చేయడం ద్వారా ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తాగినట్లయితే జీవక్రియ మెరుగుపడి రోజుంతా చురుగ్గా ఉంటారు.
ఉదయాన్నే వాకింగ్, ఎక్సర్‌సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేసేవారు వ్యాయామానికి 30 నుంచి 45 నిమిషాల ముందే గ్రీన్ టీ తాగడం మంచిది. ఇందులోని కెఫీన్, క్యాటెకిన్స్ మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు ఫ్యాట్‌ను ఆరోగ్యవంతంగా కరిగేలా చేస్తుంది. కేలరీలు ఎక్కువగా ఖర్చవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.
లంచ్ తర్వాత
ఆఫీసుల్లో లేదా ఇంట్లో లంచ్ తర్వాత చాలా మందికి మగతగా ఉంటుంది. దీంతో మిగతా పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంకా కొందరిలో పొట్ట కూడా హెవీగా ఉంటుంది. ఈ సమయంలో గ్రీన్ టీ తాగినట్లయితే జీర్ణక్రియ మెరుగుపడి తిన్న ఆహారం సులభంగా అరిగిపోతుంది. నిద్ర మత్తు కూడా వదిలి యాక్టివ్‌గా ఉంటారు.
సాయంత్రం చాలా మందికి స్నాక్స్ సమయంలో ఏదో ఒకటి తినాలని ఉంటుంది. డైట్ ఫాలో అయ్యేవారు కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోలేరు. అలాంటప్పుడు గ్రీన్ టీ తాగితే తినాలనే కోరిక తగ్గుతుంది. ఇంకా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలనుకునేవారు గ్రీన్ టీ తాగినట్లయితే త్వరగా ఆకలి వేయదు.
బరువు తగ్గాలనుకునేవారికి సరైన నిద్ర చాలా అవసరం. నిద్ర వేళలు తగ్గితే ఆటోమేటిక్‌గా ఊబకాయం వస్తుంది. అందుకే నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగకూడదు. ఇందులోని కెఫీన్ కారణంగా నిద్రకి ఆటంకం కలిగి విశ్రాంతి తీసుకునే వేళలకు ఆటంకం ఏర్పడుతుంది.

రోజుకి ఎన్నిసార్లు తాగాలి
కొందరు గ్రీన్ టీని రోజులో అదే పనిగా తాగుతుంటారు. అలా చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ రోజుకి 2- 3 కప్పులు మాత్రమే తాగాలి. ఇందులో పంచదార లేదా ఎక్కువ మొత్తంలో తేనె కలిపితే అదనంగా కేలరీలు చేరతాయి. దీంతో బరువు పెరుగుతారు. అందుకే పటిక బెల్లం, బ్రౌన్ షుగర్ లేదా తక్కువ మొత్తంలో తేనె మాత్రమే వేసుకోవాలి.
చివరిగా కేవలం గ్రీన్ టీ మాత్రమే తాగితే బరువు తగ్గుతారని అనుకోవద్దు. సరైన డైట్ సూత్రాలు పాటిస్తూ, రోజూ వ్యాయామాలు చేయాలి. పరిమిత మొత్తంలో మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గుతారు. అధికంగా ఫ్లేవర్స్ కలిపిన, లేదా చక్కెర ఎక్కువగా ఉన్న ఇన్‌స్టంట్ గ్రీన్ టీలు తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. బ్రాండెడ్ గ్రీన్ టీ పౌడర్ లేదా లూస్ టీని ఎంచుకుంటే సత్ఫలితాలను పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
