Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో బరువు పెరగడం అనేది చాలా మందిని వేధిస్తున్న ఒక ప్రధాన సమస్య. ఎన్నో రకాల కఠినమైన డైట్లు, వ్యాయామాలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం లేక నిరాశ చెందుతున్న వారు ఎందరో ఉన్నారు. అయితే మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని, సహజ సిద్ధంగా బరువు తగ్గే అద్భుతమైన మార్గాలు ఉన్నాయి.

మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బరువును సులభంగా నియంత్రించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే 5 సులభమైన, అత్యంత ప్రభావవంతమైన చిట్కాలను ఆయుర్వేద డాక్టర్ అపర్ణ చాపర తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.
భోజనానికి ముందు గోరువెచ్చని నీరు
ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణవ్యవస్థ ఒక అగ్ని లాంటిది. భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. గోరువెచ్చని నీరు శరీరంలోని మలినాలను (టాక్సిన్స్) బయటకు పంపిస్తుంది. అలాగే భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కడుపు కాస్త నిండినట్లు అనిపించి, ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల పరిమితికి మించి అతిగా తినడాన్ని నివారించవచ్చు.
రాత్రి 7 గంటల లోపే భోజనం పూర్తి చేయడం
సూర్యాస్తమయం తర్వాత మన శరీరంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం సాధ్యమైనంత త్వరగా అంటే రాత్రి 7 గంటల లోపు ముగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల మీరు నిద్రపోయే సమయానికి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం, తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆహారం సరిగ్గా అరగక కొవ్వుగా మారి బరువు పెరగడానికి దారితీస్తుంది. పెందలకడే భోజనం చేస్తే ఈ సమస్యే ఉండదు.
భోజనం తర్వాత నడక
ఆయుర్వేద నియమాల ప్రకారం భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చోవడం లేదా పడుకోవడం అస్సలు చేయకూడదు. తిన్న తర్వాత కనీసం 100 నుండి 500 అడుగుల వరకు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా నడవాలి. దీనివల్ల పొట్టలో గ్యాస్ చేరదు, ఆహారం సాఫీగా కదులుతూ జీర్ణమవుతుంది. ముఖ్యంగా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఈ చిన్నపాటి నడక నియంత్రిస్తుంది.
పగటిపూట నిద్రను నివారించడం
చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీసే అలవాటు ఉంటుంది. కానీ పగటిపూట నిద్రపోవడం వల్ల శరీరంలో కఫ దోషం పెరుగుతుందని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. కఫం పెరిగితే శరీరంలో బద్ధకం, నీరసం ఆవహిస్తాయి. దీనివల్ల జీవక్రియ మందగించి శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే పగటి నిద్రకు దూరంగా ఉండి, రాత్రి పూట మాత్రమే 7-8 గంటలు నిద్రపోవాలి.
ఉదయాన్నే తేనె నీరు (హనీ వాటర్)
ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకుని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదంలో తేనెను లేఖన(శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడం లేదా గీరివేయడం) లక్షణాలు కలిగిన పదార్థంగా చెబుతారు. ఇది మీ మెటబాలిజంను వేగవంతం చేస్తుంది.
తేనెను ఎప్పుడూ వేడి నీటిలో లేదా మరుగుతున్న నీటిలో కలపకూడదు. ఆయుర్వేదం ప్రకారం వేడి చేసిన తేనె శరీరంలో విషతుల్యంగా మారుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ తేనెను గోరువెచ్చని నీటిలో మాత్రమే కలపాలని డాక్టర్ అపర్ణ సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
