Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.!
ఫిట్‌నెస్ అంటే సన్నగా, నాజూగ్గా కనిపించడమేనా.. లావుగా ఉండేవారు ఫిట్‌గా ఉండరా.. కేవలం బరువు తక్కువగా ఉండేవారే ఆరోగ్యంగా ఉంటారా.. అధిక బరువు ఉన్నవారు అనారోగ్యంగా ఉంటారా.. అంటే కాదనే సమాధానం వస్తుందా. సన్నగా ఉండటానికి ఫిట్‌నెస్‌కి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంటి.. దానికి నిర్వచనం ఏంటి.. నిపుణుల సలహాలు చూద్దాం..

సోషల్ మీడియాలో యుగంలో ఫిట్‌నెస్ అంటే సన్నగా కనిపించడమేనని అనుకుంటారు. అందుకే బరువు తగ్గడాన్ని ఆరోగ్యకరంగా భావిస్తారు. ఇందుకోసం ఆహారంలో కొందరు విపరీతమైన డైట్ పాటిస్తే, మరికొందరు మితిమీరిన వ్యాయామం చేస్తుంటారు. కానీ ఫిట్‌నెస్ అంటే బరువు, భోజనంపైన ఆధారపడి ఉండదు. మీరు రోజువారీ పనులు ఎంత యాక్టివ్‌గా చేస్తున్నారనేది మీ ఫిట్‌నెస్ స్థాయిలను నిర్ణయిస్తుంది. నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం, అలసిపోవడం, నాణ్యమైన నిద్ర, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు ఇవన్నీ మీ ఫిట్‌నెస్‌ను నిర్ణయిస్తాయి. మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది ఈ అంశాల ద్వారా నిర్ధారించుకోండి.
రోజువారీ పనులు
నిజమైన ఫిట్‌నెస్ అంటే మీరు రోజువారీ పనులు ఎంత సులభంగా చేయగలుగుతున్నారో చెబుతుంది. మెట్లు ఎక్కడం, నడవడం, బరువులను ఎత్తడం లేదా శారీరక శ్రమల్లో పాల్గొనడం వంటివి మీరు ఎంతవరకు ఫిట్‌గా ఉన్నారో చెబుతుంది. మీరు నడుస్తున్నప్పుడు లేదా పనులు చేసుకుంటున్నప్పుడు ఆయాసం వస్తే మీరు శారీరకంగా తక్కువ దృఢత్వంతో ఉన్నారనేదానికి సంకేతం. రెగ్యులర్‌గా వ్యాయామం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సరిచేసుకోవచ్చు. అయితే ఇదివరటికంటే మీరు తక్కువ పనులు చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ శారీరక దృఢత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయి. సులభంగా వంగలేరు. అయితే మీరు సులభంగా వంగినప్పుడు, శరీరాన్ని అనుకున్న విధంగా తిప్పగలగడం, రోజువారీ పనుల్లో బ్యాలెన్స్‌డ్ ఉండటం వంటివి ఫిట్‌నెస్ సంకేతాలుగా చెప్పవచ్చు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఇందులో మార్పులు చోటుచేసుకుంటాయి. రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడం వల్ల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు.

మీరు నిద్రపోతున్న సమయంలో లేదా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి మీ ఫిట్‌నెస్‌ను తెలుసుకోవచ్చు. వయసు, ఫిట్‌నెస్, మందులు ప్రభావం చూపించినా రెగ్యులర్‌గా వ్యాయామం చేసే వారిలో గుండె కొట్టుకునే వేగం అదుపులో ఉంటుంది. హార్ట్‌బీట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటే గుండె, రక్తనాళాల ఆరోగ్యం సరిగా లేదని అర్థం చేసుకోవాలి.
కొందరు ఆరోగ్యంగా ఉన్నా వారిలో రక్తపోటు అధికంగా ఉండవచ్చు. హై లేదా లో బీపీ ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపిస్తుంది. నిరంతరం ఒత్తిడితో ఉండటం, చిరాకు, విచారం, రోజువారీ పనులపై ఆసక్తి లేకపోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే యోగా, మెడిటేషన్, వ్యాయామం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
