Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దంతాల శుభ్రతకు నాలుగు ఆహారాలు!

సెలవులకు బయటకు వెళ్ళినా లేదా ఎక్కికైనా చిన్న టూర్ వేసినా ఒక్కోసారి మీరు టూత్ బ్రష్ మరచిపోతారు. అటువంటపుడు మీ దంతాలను సహజంగానే శుభ్రం చేయటానికి కొన్ని ఆహారాలు తినవచ్చు. అంతేకాదు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఘాటైన వాసన వచ్చే ఆహారాలు తినేసిన తర్వాత నోరు అంతా వాసనగా వుంటుంది. కనుక అటువంటపుడు, కొన్ని సహజ ఆహారాలు తిని మీ దంతాలను, నోటిని శుభ్రం చేసుకోవచ్చు.
మరి దంతాల శుభ్రతకు ఆహారాలు ఏమిటో చూడండి
బెర్రీలు - బెర్రీలు సిట్రస్ జాతి పండ్లు. తేలికగా తినవచ్చు. ఇవి మీ దంతాలను శుభ్రం చేయటమే కాదు, తెల్లపరుస్తాయి. ప్రత్యేకించి స్ట్రాబెర్రీలు సహజ టూత్ పేస్ట్ లా పనిచేస్తాయి. కనుక ఒక స్ట్రాబెర్రీ పండు ముక్క చేసి దానిని మీ దంతాలపై 5 నిమిషాలు రుద్దండి. దంతాలు తెల్లబడాలంటే, స్ట్రా బెర్రీలు గుజ్జు, బేకింగ్ సోడా కలిపి రుద్దండి. మీ దంతాలు తెల్లగా, మెరిసిపోతూ వుంటాయి.
ఆపిల్ - సాధారణంగా మనం కర కరలాడే, కేరట్లు, బ్రక్కోలి, ఆపిల్, మొదలైనవి దంతాలను, చిగుళ్ళను శుభ్రం చేస్తాయనుకుంటాం. అయితే యాపిల్ పండులో వుండే, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు బాక్టీరియాను చంపేసి, నోరు వాసన రాకుండాను దంతాలను మెరిసేలాను, చేస్తాయి. నోటి శుభ్రత బాగా పాటించాలంటే, ప్రతిరోజూ ఒక యాపిల్ తినేయండి.
నిమ్మ పండు - సిట్రిక్ యాసిడ్ కల నిమ్మకాయ దంతాలను బాగా శుభ్రం చేస్తుంది. నిమ్మ ముక్కను నేరుగా దంతాలపై పెట్టి శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేయటమే కాదు, నిమ్మరసం నోటిలోని బాక్టీరియాను తొలగించి, నోరు దుర్వాసన రాకుండా, దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. నిమ్మ రసాన్ని దంతాల శుభ్రతకు ప్రాచీన కాలంనుండి వాడుతూనే వున్నారు. నిమ్మ రసానికి కొద్దిగా ఉప్పు వేసి దంతాలనను ప్రతిరోజూ రుద్దవచ్చు. నోటిని నీటితో కడిగి ఈ రకంగా అయిదు నిమిషాలు బ్రష్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. దంతాలు బలపడతాయి మరియు తెల్లగా వుంటాయి.
ఛీజ్ - జున్ను ముక్కలు కూడా ఉపయోగించి సహజంగా దంతాలను శుభ్రం చేయవచ్చు. దీనిలో వుండే యాసిడ్లు పళ్ళ సందులలో ఇరుక్కున్న ఆహారాలను సైతం తొలగిస్తాయి. నోటిలోని పి హెచ్ బ్యాలన్స్ నిలుపుతాయి. జున్ను ఎపుడు తిన్నా మీరు నోటిలో కొంత లాలాజలాన్ని ఊరించి తినండి. ఈ లాలాజలం జున్నుకు రుచి కల్పించటమే కాదు, నోటి శుభ్రతకు బాగా ఉపయోగిస్తుంది. దంతాల పై భాగాన్ని శుభ్రం చేస్తుంది. కనుక జున్ను మీకు ఇప్పటిదాకా మంచిది కాదని భావిస్తే, ఇకపై తప్పక తినేయండి. దాని ప్రయోజనం పొందండి.
పైన తెలిపిన సహజ ఆహారాలు తింటూ మీ దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications