Latest Updates
-
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.!
ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల బరువు తగ్గుతారా...!?
ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో మనందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు. ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది.
రోజూ తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ద్వారా 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తెలియవచ్చింది. ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆ స్టడీలో తేలింది.
ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది. ఇలా నమలడం వల్ల నోటిలోని లాలాజల గ్రంథులు అధికంగా లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలానికి శరీరంలోని ఆమ్లాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే హడావుడిగా కాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది.

బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో కూడా చర్మం త్వరగా ముడతలు పడకపోవడాన్ని చూస్తుంటాం. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.
ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో నిదానంగా నమిలి తినాలి. హడావిడిగా మింగకూడదు. అలాగని గంటల తరబడి తింటూ కూర్చోకూడదు. గబగబా మింగితే ఆమాశయంలోని యాసిడ్ అన్ననాళికలోకి ఒంగి మంటగా అనిపిస్తుంది. గంటల తరబడి తింటూ ఉంటే ఆహారం సగం జీర్ణం, సగం కాకుండా అజీర్ణం కలుగుతుంది. ఎసిడిటి ఉన్నవారు ప్రతి మూడు గంటలకు ఏదో ఒక ఆహార పదార్థాన్ని తింటూ ఉండటం మంచిది.
ఆహారం నెమ్మదిగా నమిలి, రుచిని అస్వాదిస్తూ తినడం మంచిది. వేగంగా తినే వాళ్లకి ఎంత తిన్నా కడుపు నిండిన భావన ఉండదట. ఎందుకంటే మన కడుపు ఖాళీగా ఉందా లేక ఇంకా తినాలా లేదా కడుపు నిండిందా....వంటి సమాచారాన్ని మన మెదడుకు చేరవేయడానికి మన శరీరంలోనే ఒక 'వ్యవస్థ' ఉంది. ఆ సమాచారం మెదడుకు అందించడానికి ఆ వ్యవస్థకు దాదాపు 20 నిముషాల వ్యవధి కావాలి. కొందరు ఆలోపునే భోజనం ముగిస్తారు. దాంతో గబా గబా తినే వారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. వారికి కడుపు నిండిందా లేదా అన్న విషయం తెలీక ఆకలి తగ్గిందని మెదడుకు సరైన సమాచారం అందక ఇంకా తినేస్తు ఉంటారు. ఫలితంగా కావలసిన దానికన్నా ఎక్కువ తినడం, ఊబకాయం బారిన పడడం తధ్యం. అందుకే ఆహారాన్ని నింపాదిగా నమలడం, మితంగా తినడం పిల్లలకు కూడా నేర్పించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
