Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తరగని యవ్వనం - చెరగని శారీరక రూపం!

1. చర్మం ఆరోగ్యంగా వుండాలంటే స్ట్రా బెర్రీలు, టమాటాలు, టోఫు వంటివి తినాలి. వీటిలో విటమిన్ సి అధికంగా వుండి చర్మం పొడి బారకుండా, ముడతలు పడకుండా వుంటుంది. టమాటా చర్మాన్ని మెత్తగా మెరిసేలా వుంచుతుంది. టోఫుచర్మానికి గట్టితనం ఇస్తుంది.
2. ఎప్పటికి యువత వలెనే కనపడాలంటే మరో రహస్యం రోజంతా కొద్ది కొద్దిగా తినాలి. సలాడ్లు, సూప్ లు, బ్రెడ్, పండ్లు వంటివి తేలికగా జీర్ణం అవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలనిస్తాయి. కొవ్వులను దూరంగా వుంచుతాయి. కూరగాయలు, పండ్లలో మరి కొన్ని మసాలాలు, సుగంధాలు వేసి మరింత రుచికరంగా కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా యాంటీ ఏజింగ్ ఆహారాలు తింటే ఇక కాస్మెటిక్స్ అవసరం కూడా వుండదు. మీరు ఎప్పటికి చిన్నవారుగానే ఆకర్షణీయంగా కనపడతారు.
3. మిరియాలు వేడిని కలిగించి మీలోని ఆకలిని తగ్గిస్తాయి. బరువు తక్కువతో మంచి శారీరక రూపం కావాలనుకునేవారు తమ ఆహారాలలో మిరియాలు చేర్చటం మరచిపోకండి.
4. పచ్చని కూరలు - ఆహారంలో పచ్చని కూరలు మిమ్మల్ని అందంగా వుండేలా చేస్తాయి. పాలకూర, ఆరోగ్యాన్నే కాక అందాన్ని కూడా పెంచుతుంది. అందులో వుండే విటమిన్ ఎ చర్మాన్ని సంరక్షిస్తుంది. మీరు తినే శాండ్ విచెస్ వంటి వాటిలో పాలకూర తప్పక చేర్చండి.
5. అన్నిటిని మించి అందంగా వుండాలంటే మీరు అధికంగా ఆధారపడదగినది నీరు. నీరు మీ శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. ఉదయమే గోరు వెచ్చని నీరు త్రాగితే అది శరీరంలోని లోపలి భాగాలు శుభ్రపరచేందుకు సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications