Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసే ఆహారపు అలవాట్లు...!

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటు లేకుండా పోయింది. కూర్చున్న చోటు నుండి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయటం మామూలైపోయింది. ఇలా ఎక్కువ సేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయటం వల్ల స్థూలకాయంతో పాటు మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. ప్రధానంగా మోకాళ్ళ జాయింట్ మధ్యలో వున్న మృధులాస్తి, సైనోవియల్ ఫ్లూయిడ్ లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటు చేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధిక బరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉంటాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళు బాగా నొప్పి పెడుతాయి. అదే విధంగా కూర్చొనిపైకి లేచేటప్పుడు మోకాళ్ళు పట్టుకు పోతాయి. ఉదయం పూట వగానే నడిచేందుకు మోకాళ్ళు సహకరించ కుండా వుంటాయి. నడుస్తున్నప్పుడు మోకాళ్ళ వద్ద చిన్న చిన్న శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి లక్షణాలుంటే ఇక అశ్రద్ధ చేయ కూడదు.
పనిచేసేవారు కనీసం గంటకో సారైనా ఓ పది నిముషాలు అలా అటూ ఇటూ నడవడం చేయాలి. ఇక స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ఆహార పదార్ధాల విషయా నికి వస్తే. ఉప్పు, వంటలలో నూనె మోతాదులను తగ్గించు కోవటం మంచిది. మాంసాహారం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లున్న వారు వెంటనే వాటికి దూరంగా వుండాలి. క్యాల్షియం పుష్కలంగా వున్నటువంటి పాలు, గుడ్డు, పెరుగు వంటివి తీసు కోవాలి. మంచి నీళ్ళు సరిపడినన్ని తాగుతుండాలి. కొంతమంది పనిలో పడితే గొంతు పిడచకట్టుకు పోతున్నా తలతిప్పరు. ఆ అలవాటును మానుకుని ఆరోగ్యం పైనా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా లేకపోతే పనిని కూడా సమర్థవంతంగా చేయలేరు. నాణ్యత తగ్గుతుంది. ఇక అన్ని జబ్బులకు మంచి మందు వ్యాయామం. నడక వల్ల అధిక బరువు సమస్య దరిచేరదు. తద్వారా మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
