Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
అబ్బా....అపుడే ఆదివారం.... అయిపోయిందా?

1. ఇక్కడ ప్రధాన అంశం మన జీవన విధానంలో మార్పులు. వారంలో పూర్తి బిజీ అయిపోవడం, వారాంతం వచ్చిందంటే బద్ధకించేయటం. ఒక సగటు మనిషి ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తే, రోజంతా బిజీగా వుండి రాత్రి 10 గంటలకు పడక ఎక్కుతాడు. మరుసటిరోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేస్తాడు మరల రాత్రి 12 గంటలకు పడుకుంటాడు. ఈ రకమైన అపసవ్యత బాడీ క్లాక్ ను డిస్టర్బ్ చేస్తుంది. మీ శరీరం ఎల్లపుడూ ఏం చేయాలి అనే సంకేతాల బయాలాజికల్ క్లాక్ కు అలవాటు పడిపోయింది. కనుక మీరు మీ శరీరానికి... 2 రోజులు వినకపోతే అది సోమవారం వచ్చే సరికి మీరు చెప్పేది తిరస్కరిస్తుంది. అందుకే సోమవారంనాడు అంత బద్ధకంగా వుంటుంది.
3. సోమవారంనాడు మీరెప్పుడైనా విపరీతమైన తలనొప్పితో నిద్ర లేచారా? దానికి కారణం మీరు అధికంగా నిద్రించటమే. వారంలో ఉరుకులు పరుగులు పెట్టేటపుడు మీ రెప్పుడూ బద్ధకంగా వుండరు. నిద్ర అధికమైతేనే మీరు నిద్ర వచ్చేస్తున్నట్లు భావిస్తారు. సోమవారం కూడా ఆదివారం నిద్ర అధికమైతేనే బద్దకం ఏర్పడేది.
4. కనుక చిన్నపాటి మార్పు చేసుకొని మీరు వారాంతపు సెలవులలో కూడా కొద్దిగా బిజీగా వుండండి. ఒక గంట మాత్రమే లేటుగా లేవండి. వారంలో మీరు చేయని వ్యాయామాలు చేయండి. దాని తర్వాత మీరు కోరిన సెలవు విశ్రాంతి మీకు ఆ రోజంతా దొరుకుతుంది. మధ్యాహ్నం చిన్న కునుకు మాత్రమే తీయండి. రాత్రికి 8 గంటల నిద్రపొండి.
5. ఒక్కొకపుడు వారంతపు సెలవులలో ప్రయాణాలు చేస్తాము. అవి అలసట కలిగిస్తాయి. శుక్రవారం రాత్రి బయలు దేరటం తిరిగి ఆదివారం ఇల్లు చేరటం చేసి మన ఎనర్జీలన్ని ఖర్చుపెట్టేస్తాము. వారాంతంలో మీలో పోయిన ఎనర్జీలు భర్తీ చేసుకోడానికి విశ్రాంతి తప్పక తీసుకోవాలి. ఈ విశ్రాంతి మరల మీకు వారమంతా శ్రమపడేలా చేస్తుంది.
6. ఒక్కొక్కపుడు సోమవారం ఏవైనా మీటింగులవంటివి వుంటే వాటి ఒత్తిడి కూడా మీకు సోమవారం బద్ధకాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం మానసికంగా అలసిపోవటం. వారమంతా పనిచేశారు. మరోవారం పనిచేయాలంటే కొంత అలసటగా వున్నట్లనిపిస్తుంది.
7. సమస్యకు పరిష్కారంగా, శుక్రవారం పని మానేయండి, లేదా టెన్షన్ పడేటంత పని చేయకండి. శనివారం, ఆదివారం మధ్యాహ్నం పనిచేయండి. శనివారం రాత్రి ఆదివారం ఉదయం లిమిటెడ్ గా ఆనందించండి. ఇలా చేస్తే సోమవారంనాడు బద్ధకమనేది మీ దరి చేరదు.
ఈ మంచి ఆరోగ్య సూచనలు పాటించి సోమవారం ఉదయపు సోమరితనాన్ని వదిలించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications