Latest Updates
-
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ!
మధ్యాహ్నమైందంటే ఎందుకని అలసిపోతాము?

మధ్యాహ్న అలసట మనలను ఎపుడూ పరుగులు పెట్టించే ఆధునికజీవనవిధానాల ఫలితం. ఉదయంవేళ హాయిగా కూర్చొని కాస్త విశ్రాంతిగా అల్పాహారం కూడా తీసుకోనివ్వదు. ఇక విధులలో, సహచరులు కప్పుల కొద్ది కాఫీలు, టీలు తాగి నిద్రను వదిలించుకోవడం లేదా పనీ పాటా లేని సంభాషణలతో సమయం గడుపుతూ బోర్ లేకుండా చేసుకోటం చూస్తాం. కాని ఒక పక్క పెండింగ్ పని అంత వుంటే, మధ్యాహా్నానికికి ఎందుకు ఆపేయాలనిపిస్తుంది. దానికిగాను కొంత చదవండి.
మధ్యాహ్నమయ్యే సరికి మనలోని ఎనర్జీ స్ధాయిలు తగ్గిపోవటానికి నిపుణులు ఏమంటున్నారంటే?
రాత్రులందు సరైన నిద్ర లేకపోవటం. కొంతమంది ఆఫీస్ పని ఇంటికి తేవటం, సెల్ ఫోన్ సంభాషణలు మితిమీరి కొనసాగించటం. అది అలసిన మన శరీరానికి రాత్రులందు విశ్రాంతిలేకుండా చేయటం. లేటుగా పడుకుంటూ త్వరగా లేవటం పనికి పరుగుపెట్టటం అనేది అలవాటుపడిపోవటం వంటివి రోజులో మీరు త్వరగా అలసిపోయేలా చేస్తాయి. కనీసం 7 నుండి 8 గంటలు గాఢ నిద్రపోతే, మీకు మధ్యాహ్నానికి ఈ పరిస్ధితిరాదు. ప్రత్యేకించి నిద్రించే సమయంలో మీ సెల్ ఫోన్ కు సెలవివ్వండి.
ఆటలకు సమయం లేదా? కనీసం కొన్ని వ్యాయామాలైనా చేయండి. వేగంగా నడవటం, జాగింగ్ స్కిప్పింగ్, పరుగు వంటివి సాయంకాలం వేళ చేస్తే రాత్రులందు మీకు మంచి నిద్ర నిస్తాయి. అవి మీలో హేపీ హార్మోన్లను రిలీజ్ చేస్తాయి.
ఎపుడూ ఆందోళనా?
ఎపుడూ ఆందోళనలో వుంటే రక్తపోటు రావటమే కాక మీ ఏకాగ్రత పోతుంది. కనుక సంతోషంగావుంటూ ఆందోళన తగ్గించుకోండి. మీ పని అంటే గర్వపడండి, మీ కుటుంబం అంటే, మీ ఇల్లు అంటే, లేదా మీ పరిసరాలంటే ఇష్టపడండి. అది మీకు మంచి హాయినిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ చేయకుంటే....
మధ్యాహ్నానికి అలసిపోయేవారిలో చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని వారై వుంటారు. సరైన వేళ అల్పాహారంతీసుకోనకపోతే అది మిమ్మల్ని సోమరిగా చేసి, ఆందోళన కలిగిస్తుంది. హార్మోన్లు మార్పు చెందుతాయి. అంతేకాక ఆకలి పెరిగి లంచ్ అధికంగా తింటారు.
మధ్యాహ్న అలసటకు జవాబుగా.....కొన్నిచిట్కాలు
- బ్రేక్ ఫాస్ట్ చేయండి. సమయంలేకుంటే, పండ్లు, లేదా కొన్ని గింజలవంటివి మార్గంలోనే తినండి.
- లంచ్ కు ముందుగా అధికంగా కాఫీ, టీ తాగవద్దు. అవి ఆకలిని చంపటమే కాక, శరీరంలో కేఫైన్ చేర్చి ఆందోళన కలిగిస్తాయి.
- లంచ్ సమయంలో మితంగా భుజించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే రైస్ వంటివి కాక ప్రొటీన్లు, కొవ్వు వుండే సంతులిత ఆహారంచపాతీలు, పప్పు ఆకు కూరలు వంటివి తినండి.
- రాత్రులు తగినంత నిద్ర పొండి
- వ్యాయామలు తప్పకచేయండి
- రోజులో తగినంత నీటిని తాగండి.
- బ్రేక్ ఫాస్ట్ , లంచ్ మధ్య చిరుతిండ్లు తినకండి. తాజా పండ్ల వంటివి సాయంత్రాలు తినండి.
- వేపుడు చిప్స్ వంటివాటికి బదులుగా మొలకెత్తిన విత్తనాలు తినండి. వాటిని మీరు బాక్స్ లో తీసుకుని వెళ్ళవచ్చు. స్నాక్స్ వంటివి తినాలనిపించినపుడు వాటిని తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











