Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
నోటి దుర్వాసనను దూరం చేసే 7 అద్భుత చిట్కాలు...
దంత సమస్యలకు సంబంధించినంతవరకు దంతక్షయం, చిగుళ్ల వ్యాధుల తర్వాత నోటి దుర్వాసనే అతి పెద్దదైన, ప్రధానమైన సమస్య. నలుగురిలో నోరు తెరిచి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి... మనస్ఫూర్తిగా నవ్వలేని దుస్థితి... చివరికి.. భాగస్వామి దగ్గర కూడా నోరు తెరవడానికి బిడియపడే విషమ స్థితి... ఇలాంటి పరిస్థితులన్నింటి వెనుక ఉన్న ప్రబలమైన కారణం.. నోటి దుర్వాసన... హాలిటోసిస్.నోరంతా వాసనగా ఉంటోంది..
పగటి వేళల్లో ఆహారం తీసుకోడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడటానికి... ఇలా అనేక కారణాలతో మనం నోటిని అనేకసార్లు తెరుస్తూ ఉంటాం. దాంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే రాత్రివేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. కాబట్టి రాత్రివేళ తగింత ఆక్సిజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి వెలువడే దుర్వాసన మరింత ఎక్కువగా, ఇబ్బందికరంగా ఉంటుంది. దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని, నోటిని నీటితో బాగా పుక్కిలించి కడుక్కున్నప్పుడు ఈ వాసన కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ఆ దుర్వాసన దీర్ఘకాలికమైన సమస్యగా పరిణమిస్తుంటుంది.
కారణాలు: నోటి దుర్వాసనకు కారణాలలో దాదాపు 90 శాతం నోటికి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు వంటివి తినడం, మద్యం, పొగతాగడం, స్థూలకాయం కూడా నోటి దుర్వాసనకు సంబంధించిన కారణాల్లో ఒకటి. ఇవేగాక నోరు మొదలుకొని, ఆహార నాళం వరకు అనేక సమస్యలు నోటిదుర్వాసనకు కారణమవుతుంటాయి.
నోరు: మన నోటిలో సుమారు ఆరు వందల రకాలకు పైగా బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. వీటి ప్రోటీన్స్ - అమైనోయాసిడ్స్‌గా విఛిన్నమయ్యే సమయంలో దుర్వాసన వెలువడుతుంది. నోటిలోని ఇతర భాగాలు కూడా దుర్వాసన వెలువడటానికి కారణమవుతాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, దంతాలు విరిగిపోయి ఉండటం, దంతాల మధ్య సందులు, కట్టుడుపళ్లు మొదలైనవి కూడా దుర్వాసనకు కారణం.
నాలుక: నోటి దుర్వాసనకు కారణాలలో అతి ముఖ్యమైనది నాలుకను శుభ్రం చేసుకోకపోవడం. నాలుకపై ఉండే బ్యాక్టీరియా దుర్వాసనను, కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. నోటి దుర్వాసన కేసుల్లో అత్యధికం ఈ కోవకు చెందినవే. నాలుక కింది భాగంలో చాలా బ్యాక్టీరియా నివాసం ఉంటాయి. నాలుకలోని ఈ భాగం కొంత పొడిగా ఉండటం, నాలుక పైభాగాన్ని శుభ్రం చేసుకున్నంతగా ఈ భాగాన్ని శుభ్రం చేసుకోకపోవడంతో ఇక్కడ ఆవాసం ఉన్న బ్యాక్టీరియా అక్కడ స్థిరంగా ఉండిపోతాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఆహార పదార్థాలు ఈ బ్యాక్టీరియాకు పోషకాలుగా ఉపకరిస్తాయి. దాంతో ఇవి మరింతగా అభివృద్ధి చెందిన నోటి దుర్వాసనకు దోహదం చేస్తాయి. ఫలితంగా నోటి దుర్వాసన మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి నాలుకను టూత్ బ్రష్, మరియు టంగ్ క్లీనర్ తో రుద్ది శుభ్రం చేసుకుంటే దుర్వాసనను చాలామట్టుకు నివారించవచ్చు. అలాగే ఏదైనా తిన్న ప్రతి సారీ లేదా భోజనం తర్వాత మౌత్‌వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి. మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని హోం రెమడీస్ కూడా మీ టంగ్ క్లీనర్ కు చాలా బాగా సహాయపడుతాయి..కాబట్టీ వీటిని మీరు ట్రై చేయండి.
వైట్ టంగ్(నాలుకను)శుభ్రం చేసే హోం రెమడీస్:

టూత్ బ్రష్: ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ చాలా బాగా ఉపయోగపడుతాయి. టూత్ బ్రష్ దంతాలను మరియు నాలుకను శుభ్రం చేయడంతో పాటు దవడలు, చిగుళ్ళను కూడా శుభ్రం చేస్తాయి.

టంగ్ క్లీనర్: బ్రెషింగ్ అండ్ టంగ్ క్లీనర్ తో ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం మంచిది. టంగ్ క్లీనర్ ను ఉపయోగించి నాలుక మీద ఉన్న తెల్లని లేయర్ ను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

ఆహారం: టూత్ ఫ్రెండ్లీ ఫుడ్స్ స్ట్రాబెర్రీ, లెమన్, చీజ్ మరియు ఆపిల్ వంటివి మంచి ఆరోగ్యానికి మాత్రమే కాదు దంతాలను తెల్లగా ఉండేలా చేస్తుంది. నాలుకను శుభ్రం చేయడానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి ఇటువంటి పండ్లు బాగా సహాయపడుతాయి.

లెమన్ మరియు బేకింగ్ సోడా: ఇది ఒక మంచి హోం రెమడీ. నాలుక మీద ఉన్న తెల్లటి పాచిని తొలగించి శుభ్రం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో బేకింగ్ సోడా మిక్స్ చేసి నాలుక మీద రుద్దాలి. తర్వాత దంతాలను బ్రెష్ తో తోమాలి. తర్వాత నీటితో మౌత్ వాష్ చేయాలి.

పుక్కిలించడం: భోజనం, స్వీట్స్ లేదా ఏదైనా తిన్న ప్రతి సారీ నీటితో నోటిని పుక్కిలించాలి. దీంతో పళ్ల మద్య ఇరుకున్న ఆహారపు ముక్కలు తొలగించడమే కాకుండా నాలుకను శుభ్రపరుస్తుంది. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది.

మౌత్ వాష్: యాంటిసెప్టిక్ మౌత్ వాష్ చాలా అద్భుతమైనటువంటి హోం రెమడీ. నాలుక శుభ్రం చేయడానికి బాగా పనిచేస్తుంది.

పెరుగు: నాలుక రంగు మారడానికి కాండిడా ఫంగస్. పెరుగు ప్రో బయోటిక్ ఆహారం. ఇది ఫంగస్ నాశనం చేసి నాలుక మీద పెరగ కుండా కాపాడుతుంది.

పసుపు: యాంటి సెప్టిక్ మరియు యాంటి బ్యాక్టీరియ్ స్పైసీ వస్తువు పసుపు. ఇది నాలుకను శుభ్రం చేస్తుంది. పసుపును నీటిలో వేసి నోటిని పుక్కలించడం కానీ లేదా త్రాగడం కానీ చేయాలి.



Click it and Unblock the Notifications