కంటి అలసట, ఒత్తిడి తగ్గించుకోవడానికి 10 మార్గాలు

By Super

నేడు కంటి అలసట అన్నది ఒక సాధారణ సమస్య అయిపోయింది. ఇది అనేక కారణాల వలన కలుగుతుంది. కంటి అలసట కలగటానికి కొన్ని సాధారణ కారణాలు నిద్రలేమి, విశ్రాంతి లేకపోవటం, అలెర్జీలు, దృష్టి లోపం, ప్రకాశవంతమైన కాంతికి ఎక్స్పోజర్, తక్కువ కాంతిలో ఎక్కువసేపు చదవడం, దీర్ఘకాలం డిజిటల్ పరికరాల వద్ద గడపటం మరియు కొన్ని రకాల కంటి సమస్యలు.

ఐ స్ట్రెయిన్ చాలా అసౌకర్యానికి కారణమవుతుంది. దీనివల్ల కలిగే లక్షణాలలో కొన్ని: ఎరుపుగా మారటం లేదా కమిలిపోవటం, ఇబ్బందిగా దృష్టి సారించడం, కళ్ళు పొడిబారటం లేదా కళ్ళు నీరు పట్టటం, అస్పష్టంగా లేదా ద్వంద్వ దృష్టి, కాంతిని చూడలేకపోవటం, తలనొప్పి మరియు మెడ, భుజాలు లేదా వెనుకభాగం నొప్పి.

READ MORE: మంచి కంటి చూపు కోసం 20 పవర్ ఫుల్ చిట్కాలు

సాధారణంగా ఈ లక్షణాలు ఉదయంపూట కలగవు, కానీ మీరు దృష్టి పెట్టి కళ్ళతో ఏదో ఒకటి చేసినప్పుడు కలుగుతాయి.

కంటి అలసట తగ్గించటానికి సహాయపడే అనేక కంటిలో వేసుకునే డ్రాప్స్ మరియు మందులు ఉన్నా కూడా కంటి అలసట తగ్గించడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి. ఇక్కడ కంటి అలసట తగ్గించడానికి ముఖ్యమైన 0 మార్గాలను ఇస్తున్నాము.

ఐ మసాజ్

ఐ మసాజ్

కంటి అలసట తగ్గించడానికి, రోజువారీ మీ కనురెప్పలు నిదానంగా మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన కళ్ల రక్త ప్రసరణ మెరుగుపడటం మరియు మీ కళ్ళ చుట్టూ ఉన్న కండరాలకు విశ్రాంతి కలగటం వంటివి జరుగుతాయి. అదే సమయంలో, కన్నీటి గ్రంధులను ప్రేరేపించి, కళ్ళను పొడి బారకుండ ఉంచుతుంది.

1. మృదువుగా 20 వరకు 10 సెకన్లపాటు కనుబొమ్మ పైన, మీ కనురెప్పలు మరియు కండరాలను మీ వేళ్లను ఉపయోగించి మసాజ్ చేయండి.

2. మృదువుగా 20 వరకు 10 సెకన్లపాటు మీ క్రింది కనురెప్ప కు, క్రింద ఉన్నఎముకకు వ్యతిరేకంగా మసాజ్ చేయండి.

3. టెంపుల్ మరియు ఎగువ చెంప ఎముకలను కూడా మసాజ్ చేయండి.

4. ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేయండి.

గమనిక: మృదువైన మసాజ్ కోసం ఆలివ్ నూనె లేదా ఐ క్రీమ్, కొన్ని చుక్కలను ఉపయోగించవచ్చు.

పామింగ్

పామింగ్

ఫామింగ్, ఎక్కువగా చదవడం లేదా డెస్క్టాప్, ల్యాప్టాప్ లేదా టెలివిజన్ తెర ముందు చాలా సమయం గడపటం వలన కలిగే కాళ్ళ అలసట దూరం చేసి విశ్రాంతి కలుగాచేయతానికి ఉపయోగపడుతుంది. పామింగ్ యొక్క ప్రధాన లక్ష్యం మీ కళ్ళకు విశ్రాంతి స్థితి కల్పించటం అందువలన మీ కళ్ళకు అలసట అన్నదే లేకుండా ఉండటం.

1. నిటారుగా సుఖవంతంగా కూర్చోండి.

2. మీ అరచేతులిని దగ్గరచేర్చి వేగంగా రుద్ది వెచ్చగా చేసుకోండి.

3. మీ కళ్ళను మూసుకుని, కనురెప్పలకు ఒత్తిడి కలిగించకుండా, కళ్ళ మీద మీ వెచ్చని అరచేతులు ఉంచండి.

4. 30 సెకన్లపాటు అలానే రిలాక్స్ అవండి మరియు చీకటిని ఆనందించండి.

5. నెమ్మదిగా మీ కళ్ళు తెరిచి చుట్టూ చూడండి.

6. అదే స్థితిలో ఈ ప్రక్రియ 3 నుండి 5 సార్లు రిపీట్ చేయండి.

7. రోజు మొత్తం తరచుగా ఈ టెక్నిక్ పాటిస్తూ ఉండండి.

సన్నింగ్

సన్నింగ్

సన్నింగ్: ఒత్తిడి మరియు అలసటతో ఉన్న కళ్ళకు విశ్రాంతి కలిగించే మరొక ఉపయోగకరమైన టెక్నిక్. కీలక జీవన శక్తి ఉన్న సూర్యకాంతి మీ కళ్ళకు చాలా మంచిది. మీ మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ ద మీ శరీరంలో ఉత్పత్తి కావటానికి ఈ సన్నింగ్ సహాయపడుతుంది. చర్మం కమలిపోకుండా నివారించేందుకు 8a.m. మరియు 10a.m. మధ్య సమయంలో ఈ సన్నింగ్ చేయండి.

1. ఉదయాన్నే ఎండ తగిలే ప్రదేశంలో నిలుచోండి.

2. కళ్ళు మూసుకుని సూర్యకాంతి మీ కనురెప్పలపైన పడేట్లుగా చూసుకోండి. 3. మీ కళ్ళకు వేడి తగిలిన భావన కలగగానే, నెమ్మదిగా పైకి క్రిందికి మీ కళ్ళను ఎడమవైపుకు మరియు కుడివైపుకు మరియు అపసవ్యంగా కదపండి.

4. మొత్తం ఈ ప్రక్రియను 5 నిమిషాలపాటు రిపీట్ చేయండి.

5. పామింగ్ తోపాటు దీనిని అనుసరించండి.

6. రోజులో ఒకసారి ఈ ప్రక్రియను చేయండి.

గమనిక: సన్నింగ్ సమయంలో, కళ్లద్దాలను లేదా కాంటాక్ట్ లెన్స్ వాడవొద్దు. గరిష్ట ప్రయోజనం పొందటానికి సన్నింగ్ తర్వాత పామింగ్ చేయటం అవసరం.

ఐ ఎక్సెర్సైజ్

ఐ ఎక్సెర్సైజ్

సాధారణంగా కంటి వ్యాయామాలు కళ్ళ ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వ్యాయామంవలన కళ్ళ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది,కంటి కండరములు అనువుగా తయారవుతాయి మరియు దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపడేట్లు చేస్తుంది.

మీ భుజం పొడవు ఉన్న ఒక పెన్ లేదా పెన్సిల్ గాని పట్టుకోండి మరియు దానిపై దృష్టి పెట్టనది. నెమ్మదిగా మీ కళ్ళకు దగ్గరగా వస్తువు మీ దృష్టికి దగ్గరగా తీసుకు రండి. తరువాత మీ దృష్టి నుండి దూరంగా వస్తువును కదపండి. ఇలా 10 15 సార్లు రిపీట్ చేయండి.

కొన్ని సెకన్లపాటు సవ్యంగా మరియు అపసవ్య దిశలలో మీ కళ్ళను త్రిప్పండి. మధ్యలో విరామం తీసుకోండి మరియు మీ కళ్ళను మూసి,తెరుస్తూ ఉండండి. వరుసగా 4 లేదా 5 సార్లు రిపీట్ చేయండి. ఈ వ్యాయామం కొన్ని గంటలకొకసారి చేయండి.

కంటి అలసట నిరోధించడానికి మరియు మంచి కంటి చూపు ఆస్వాదించడానికి ఈ కంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయండి.

కోల్డ్ వాటర్

కోల్డ్ వాటర్

చల్లటి నీరు, కొద్దిపాటి కంటి ఒత్తిడిని నివారించతంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, అలసటతో ఉన్న కళ్ళ చుట్టూ కండరాలకు విశ్రాంతి కలగటానికి మరియు కంటి వాపు మరియు ఉబ్బులను తగ్గిస్తుంది.

కళ్ళు మూసుకుని మీ ముఖంమీద చల్లని నీరు చిలకరించుకోవటం వలన మీ కళ్ళ ఒత్తిడి మరియు అలసట తగ్గుతుంది. ఇది మీ కళ్ళ అలసటను త్వరగా తగ్గించే ప్రభావం కలిగి ఉంటుంది.

ఎక్కువగా ఫలితం ఉండాలంటే చల్లని నీటిలో ఒక మృదువైన గుడ్డను ముంఛి మరియు అదనపు నీటిని బయటకు పిండేసి, 1 నిమిషంపాటు మీ మూసిన కనురెప్పల మీద ఆ చల్లని గుడ్డను ఉంచండి. ఇలా మీ కళ్ళ అలసట తగ్గేవరకు రిపీట్ చేయండి.

మీరు కళ్ళ అలసటతోపాటు ఉబ్బులు కూడా కలిగి ఉంటే, ఒక చల్లని గుద్దముద్దను ఉపయోగించండి. ఒక శుభ్రమైన గుడ్డలో కొన్ని మంచు క్యుబ్స్ వేసి మూట కట్టి, ఆ మూటను మీ మూసిన కనురెప్పలపైన ఉంచండి. ఇలా చేసిన 5 నుండి 10 నిమిషాల తర్వాత మీ కళ్ళ ఉబ్బులు తగ్గుతాయి.

వెచ్చని కంప్రెస్

వెచ్చని కంప్రెస్

ఒక వెచ్చని కంప్రెస్: ఇది కంటి అలసట తగ్గించడానికి మరొక మార్గం. ఇది మీ కళ్ళ చుట్టూ ఉన్న కండరాల అలసట తగ్గింఛి విశ్రాంతి కలగటానికి మరియు కళ్ళు పొడిబారటాన్ని నివారిస్తుంది. ఇది కన్ను సెగ నొప్పి వాపు తగ్గించడం కోసం కూడా సమర్థవంతంగా పని చేస్తుంది.

1. వెచ్చని నీటిలో ఒక మృదువైన వస్త్రం ముంచండి మరియు అధికంగా ఉన్న నీటిని బయటకు పిందండి. 2. మీ కళ్ళు మూసుకుని హాయిగా పడుకోండి, మీ కనురెప్పలు పైన ఈ వెచ్చని టవల్ ఉంచండి.

3. రిలాక్స్ అవండి మరియు 1 నిమిషంపాటు నెమ్మదిగా ఊపిరి తీయండి.

4. గుడ్డను మార్చండి మరియు ఈ ప్రక్రియ 3 లేదా 4 సార్లు పునరావృతం చేయండి.

5. రోజులో ఈ ప్రక్రియను 1 లేదా 2 సార్లు చేయండి.

చమోమిలే టీ

చమోమిలే టీ

కంటి అలసట తగ్గించే మరో శీఘ్ర చికిత్స చమోమిలే టీ. మెత్తగా ఉన్న ప్రకృతి యొక్క ఈ చమోమిలే టీ త్వరగా మీ కళ్ళకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ కళ్ళ చుట్టూ ఉన్న వాపు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

1. ఒక కప్పు వేడి నీటిలో 5 నిమిషాలపాటు నిటారుగా 2 చమోమిలే టీ సంచులు ఉంచండి.

2. టీ సంచులను తీసివేయండి మరియు రిఫ్రిజిరేటర్ లో ఒకదానిని మరియు వంటగది కౌంటర్ లో ఇంకొకటి ఉంచండి.

3. వెచ్చని చికిత్స కోసం వంటగది కౌంటర్ లో ఉన్న టీ బ్యాగ్ 5 నిమిషాలపాటు మీ మూసిన కనురెప్పలపైన ఉంచండి.

4. చల్లని చికిత్స కోసం,ఫ్రిజ్లో ఉంచిన టీ బ్యాగ్ ను మీ కనురెప్పలపైన ఉంచండి.

5. తరచుగా మీరు కావలసినంత మేరకు ఈ చికిత్స రిపీట్ చేయండి.

అలాగే, తలనొప్పి, కంటి ఒత్తిడి వంటి సాధారణ లక్షణాలను తగ్గడానికి 2 3 కప్పుల చమోమిలే టీ త్రాగండి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

ఒత్తిడి మరియు అలసటతో కూడిన కళ్ళ కోసం ఒక సహజసిద్ధ విశ్రాన్తికారకం వంటిది ఈ రోజ్ వాటర్. దీని ప్రభావం చాలా సున్నితంగా ఉంటుంది. ఇది కళ్ళ చుట్టూ ఉన్న చర్మం, అలాగే కంటి క్రింద నల్లటి వలయాలు మరియు కంటి ఉబ్బులిని తగ్గించి తిరిగి చైతన్యం నింపుతుంది. 1. మీ కళ్ళ మీద చల్లని నీటిని చిలకరించుకోండి మరియు ఒక శుభ్రమైన టవల్ తో పొడిగా చేసుకోండి.

2. 2 కాటన్ బాల్స్ ను రోజ్ వాటర్ లో ముంచండి.

3. పడుకొని మీ కళ్ళు రెండూ మూయండి, మీ కళ్ళ మీద ఈ తడి కాటన్ బాల్స్ ను ఉంచండి.

4. రోజుకి రెండుసార్లు ఈ విధంగా చేయండి.

దోసకాయ

దోసకాయ

దోసకాయ ముక్కలు కూడా త్వరగా కంటిఅలసటను వదిలించుకోవటంలో సహాయపడతాయి. రక్తస్రావ నివారణ లక్షణాల వలన,బంగాళాదుంప కూడా మీ కళ్ళ చుట్టూ ఉన్న కండరాల అలసట ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది కూడా మీ కళ్ళ కింద ఉన్న ఉబ్బులు మరియు నల్లటి వలయాలు తగ్గించేందుకు సహాయపడుతుంది.

1. ఒక చిన్న సైజ్ లో ఉన్న దోసకాయను 20 నుండి 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్ లో కూల్ చేయండి.

2. మందపాటి ముక్కలుగా కట్ చేయండి మరియు అలసటతో ఉన్న కళ్ళ మీద వాటిని ఉంచండి.

3. రోజులో ఇలా 1 లేదా 2 సార్లు చేయండి.

ఈ విధంగా బంగాళాదుంపతో కూడా చేయవచ్చు.

హోల్ మిల్క్

హోల్ మిల్క్

హోల్ మిల్క్ కూడా కంటి అలసటను తగ్గించడానికి ఒక మంచి నివారణోపాయం. పాలలో మెత్తగా ఉన్న కొవ్వు కళ్ళ అలసటను సడలిస్తుంది. అదే సమయంలో, పాలు కంటి దురదలను మరియు ఉబ్బులను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

1. చల్లని పాలలో ఒక కాటన్ బాల్ ముంచండి.

2. మీ కళ్ళు చుట్టూ మరియు కొన్ని నిమిషాలపాటు మీ మూసిన కనురెప్పలు పైన దానితో మృదువుగా రుద్దండి..

3. విశ్రాంతిగ ఉండండి మరియు వెంటనే పాలు చల్లదనం యొక్క ట్రిక్ చూడండి.

4. రోజూ లేదా అవసరమైనప్పుడల్లా ఒకసారి ఈ విధంగా చేయండి.

Desktop Bottom Promotion