కలబంద ఆరోగ్యానికి ఏవిధంగా పనిచేస్తుంది

అలోవెరా, ఒక చిక్కగా జెల్ గా ఉండే ఒక పదార్థం. అలోవెరా (కలబంద)ను కాలినగాయాలకు, తెగిన గాయాలకు మరియు చర్మ ఇన్ఫెక్షన్లకు, సౌందర్య సాధనంగా అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అలోవెరాను సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. కుమారి అంటే ప్రిన్సెస్ అని అర్ధం. ఇది చర్మం ఆరోగ్యంగా మరియు యూత్ ఫుల్ గా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. అలోవెరా జెల్ ల్లో అనేక న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్, మినిరల్స్ ఇవి శరీరానికి ఎంత అవసరం అయిన వాటితో నిండి ఉంది. అలోవెరా జ్యూస్ ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మోనోపాజ్ దశలో శరీరంలో ఏర్పడే హాట్ ఫ్లాషెస్ నుండి మన శరీరానికి ఉపశమనం కలిగించి శరీరంను చల్లగా ఉంచుతుంది.

అలోవెరా జ్యూస్ లో ఉన్న అనేక విటమిన్స్ మన శరీరంలోని డ్యామేజ్ అయిన బాడీ సెల్స్ లేదా టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. ఈ అలోవెరా జెల్ శరీర బాహ్య పరిస్థితులకు స్వీకృతి పెంచడం ద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అలోవెరా జెల్ శరీరానికి పోషకాలను మరియు శరీరానికి అవసరం అయ్యే వాటిని జతచేస్తుంది.

READ MORE: ఇండియన్ స్కిన్ టోన్ కు అలోవెరతో ఫర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్

ఆ అలోవెర జ్యూస్ ను బహుముఖ ప్రయోజనకారి అంటారు. కొన్ని వేల సంవత్సరలా నుండి దీన్ని ఔషదంగా ఉపయోగిస్తున్నారు. కాలిన గాయాలు, హెమరాయిడ్స్ అల్సర్ వంటి అనేక అనారోగ్యాలను చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది. అందుకే ఇది అనేక ఆరోగ్యాప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యే ఆరోగ్యప్రయోజనాలు మీరు తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ద్వారా అందిస్తున్నాము.

అలోవెర, స్ట్రాబెర్రీ మరియు లెమనేడ్ :

అలోవెర, స్ట్రాబెర్రీ మరియు లెమనేడ్ :

అలోవెరాలోని ఆరోగ్యగుణాలు చెప్పలేనన్ని ఉన్నాయి . కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3 మరియు బి6 ఉన్నాయి. కలబంద రసాన్ని నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా కలబంద రసంలో స్ట్రాబెర్రీ జ్యూస్ మిక్స్ చేయాలి. దీనిలో మాపెల్ సిరఫ్ ను మిక్స్ చేసి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి . ఇది మెత్తగా స్మూతీగా అయిన తర్వాత ఒక గ్లాసు లో పోసుకొని తీసుకోవాలి.

 అలోవెర, పైనాపిల్ మరియు బొప్పాయి:

అలోవెర, పైనాపిల్ మరియు బొప్పాయి:

వేసవిలో వేడినుండి మన శరీరంను రక్షించుకోవడానికి తాజా అలోవెర జ్యూస్ కు కొద్దిగా పైనాపిల్ మరియు బొప్పాయి మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మెత్తబడే వరకూ స్మూత్ గా బ్లెడ్ చేసి తర్వాత నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి గ్లాసులో తీసుకొని త్రాగాలి. అవసరం అయితే కొన్ని ఐస్ ముక్కలు కూడా జోడించవచ్చు.

అలోవెర మరియు నిమ్మరసం:

అలోవెర మరియు నిమ్మరసం:

అలోవెర మరియు నిమ్మరసం శరీరంలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది . ఈ జ్యూస్ ను మిక్స్ జార్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు, తేనె, మరియు అలోవెరా జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్త మిశ్రమాన్ని మరో సారి బ్లెడ్ చేసి గ్లాసులో వడగట్టి పోసుకొని అందులో కొన్న పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేసి తీసుకోవాలి.

అలోవెర మరియు క్రాన్ బెర్రీ:

అలోవెర మరియు క్రాన్ బెర్రీ:

మీరు యాంటీ ఆక్సిడెంట్ మరియు బీటా కెరోటిన్ మరియు ఇతర ఎసెన్షియల్ న్యూట్రీషియన్ కోసం చూస్తుంటే కనుకు ఒక గ్లాస్ క్రాన్ బెర్రీ జ్యూస్ లో కొద్దిగా అలోవెరా మిక్స్ చేసి అందులో రెండు గ్రీన్ ఆపిల్ మిక్స్ చేయాలి. తర్వాత క్యారెట్, బేరిపండ్లు కూడా మిక్స్ చేసి ఈ కాంబినేషన్ కు మిక్సీలో గ్రైండ్ చేసుకొని సరిపడా నీళ్ళు పోసి స్మూతీగా తయారయ్యాక, వెంటనే గ్లాసులో వడగట్టి తీసుకోవాలి.

గ్రీన్ అలోవెర స్మూతీ:

గ్రీన్ అలోవెర స్మూతీ:

మీరు ఫ్రెష్ గా ఫీలవ్వాలన్నా , లేదా ఎనర్జిటిక్ గా ఉండాలన్నా హెల్తీ గ్రీన్ అలోవెరా స్మూతీని తీసుకోవాలి. ొక గ్లాస్ కోకన్ వాటర్ లో కొద్దిగా కాలే వేసి మిక్స్ చేసి , అందులోనే ఒక కప్పు పైనాపిల్ ముక్కలు మరియు కీరదోస ముక్కలు కొద్దిగా వేసి బ్లెడ్ చేయాలి. తర్వాత అందులో రెండు చెంచాలా అలోవెరా జ్యూస్, మామిడిపండు ముక్కలు మిక్స్ చేసి మిక్సీలో బ్లెండ్ చేసి, గ్లాసులో పోసుకొని త్రాగాలి.

ఆపిల్ అండ్ కీరదోస:

ఆపిల్ అండ్ కీరదోస:

ఒక కప్పు కీరదోస జ్యూస్ మరియు ఒక కప్పు ఆపిల్ జ్యూస్ తీసుొకని అందులో 2 చెంచాలా అలోవెరా జ్యూస్ లేదా పల్స్ వేసి బాగా మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెడ్ చేయాలి. ఈ స్మూతీకి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి గ్లాసులో పోసుకొని త్రాగాలి.

ఆపిల్ అండ్ కీరదోస:

ఆపిల్ అండ్ కీరదోస:

ఒక కప్పు కీరదోస జ్యూస్ మరియు ఒక కప్పు ఆపిల్ జ్యూస్ తీసుొకని అందులో 2 చెంచాలా అలోవెరా జ్యూస్ లేదా పల్స్ వేసి బాగా మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెడ్ చేయాలి. ఈ స్మూతీకి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి గ్లాసులో పోసుకొని త్రాగాలి.

అల్లం మరియు ఆరెంజ్:

అల్లం మరియు ఆరెంజ్:

వేసవి వేడిని ఎదుర్కోవడానికి ఐస్ అలోవెరా లెమనేడ్ మరియుఅ ల్లం మరియు ఆరెంజ్ ను మిక్సీలో వేసి అందులో అరకప్పు అలోవెర జ్యూస్ మిక్స్ చేసి, అరకప్పు ఐస్ క్యూబ్, నిమ్మరసం మిక్స్ చేయాలి. అందులోనే మీకు నచ్చిన స్వీట్నర్ ను కూడా మిక్స్ చేసి తీసుకోవాలి.

క్యారెట్ మరియు పైనాపిల్:

క్యారెట్ మరియు పైనాపిల్:

అరకప్పు తాజా పైన్ ఆపిల్, ఒక క్యారెట్, ఒక గ్రీన్ ఆపిల్, ఒక చెంచా అలోవెర గుజ్జు వేసి బాగా మిక్స్ చేసి అందులో ఒక చెంచా కొబ్బరి పాలు మిక్స్ చేసి బ్లెండ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని డ్రింకింగ్ గ్లాసులో పోసి తీసుకోవాలి.

స్ట్రాబెర్రీ మరియు కలబంద:

స్ట్రాబెర్రీ మరియు కలబంద:

కలబంద మరియు స్ట్రాబెర్రీ ఆరోగ్యకరమైనది. ఇందులో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి . ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పులస్కలంగా ఉంపటుంది . ఒక బౌల్లో ఆరెంజ్, నిమ్మరరంస మరియు స్ట్రాబెర్రీ మరియు అలోవెరా జ్యూస్ మిక్స్ చేసి మిక్సీలోవేసి బ్లెండ్ చేయాలి. తర్వాత తీసుకోవాలి.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో హెల్తీ న్యూట్రీషియన్స్ విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాలో ఆక్సిడేషన్ ను నివారించడంలో సహాయపడుతాయి. అలోవెరా మరియు అవొకాడో తీసుకోవడం వల్ల వయస్సు మీదపడకుండా చేసే యాంటీఆక్సిడెంట్స్ కెరోటినాయిడ్స్ కు సహాయపడుతుంది . ఒక కప్పు కొబ్బరి నీళ్ళు, అరకప్పు అలోవెర జ్యూస్, అరకప్పు కీరదోస కాయ జ్యూస్, కాల్ కప్పు అవొకాడో మరియు 2కప్పులు ఆర్గానిక్ బెర్రీస్ ఒక పెద్ద బౌల్లో తీసుకొని బ్లెండ్ చేసి తీసుకోవాలి.

Desktop Bottom Promotion