Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
శీతాకాలంలో వేధించే అలర్జీ సమస్యలకు సులభ చిట్కాలు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శీతాకాలంలో ఏదో ఒక అలర్జీ సమస్య వేధిస్తుంది. తుమ్ములూ, దగ్గులే కాదు...ఒక్కోక్క సారి శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. క్రమ క్రమంగా సమస్య తీవ్రమయ్యే కొద్దీ లక్షణాలను బట్టి ఇది మామూలు జలుబు సమస్య కాదని తేలిపోతుంది. అయినా శీతాకాలంలో లర్జీ ఎందుకొస్తుంది, వాటి లక్షణాలేంటి అనేవి గుర్తించాలి. వాటికోసం ఎలాంటి నివారణ పద్థతులను అనుసరించాలో తెలుసుకుంటే శీతాకాలంలో వచ్చే అలర్జీల నుండి ఉపశమనం పొందవచ్చు.
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అసందర్భంగా ప్రతి చర్యను అలర్జీ అంటారు. ఏదైనా ఒక పదార్థానికి శరీరం సాధారణ స్థితి కన్నా ఎక్కువ మొత్తంలో ప్రక్రియను చూపుతుంది, ఆ పదార్థాలను అలర్జెంట్ అని ప్రతిచర్యను అలర్జిక్ రియాక్షన్ అని అంటారు.
వాతావరణ మార్పులు అంటే శీతాకాలంలో సమస్య అధికం కావడం, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, మస్కిటో రిపెల్లెంట్స్, వివిధ రకాల స్ప్రేలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, శీతలపానీయాలు, ఐస్ క్రీములు వంటివి కారణమవుతుంటాయి. చాలా మందిలో అలర్జీవ వంశపారంపర్యంగా కూడా వస్తుంది.
అలర్జీలకు గురైనప్పుడు ముక్కులోని శ్లేష్మపొర వాపుకు గురౌతుంది. దాంతో ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యలు రాకుండా శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలర్జీని నివారించుకోవచ్చు. అదెలాగో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

శరీరంను పూర్తిగా కప్పి ఉంచుకోవాలి:
శీతాకాలంలో శరీరం అతి తక్కువ ఉష్ణోగ్రతకు గురిఅవుతుంది . వివిధ రకాల వైరస్ , ఫంగైలకు ఆహ్వానం పలికినట్లే.. ఇది వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతుంది దాంతో వివిధ రకాల సీజనల్ అలర్జీలకు కారణం అవుతుంది. వీటిని నివారించాలంటే శరీరం మొత్తాన్ని కవర్ అయ్యేలా వెచ్చగా కప్పి ఉంచుకోవాలి.

ఇండోర్ ఎన్విరాన్ మెంట్:
ఇంట్లో వాతావరణం వెచ్చగా ఉంచుకోవాలి. వింటర్లో రూమ్ మీటర్స్, హుమిడిఫైయర్స్ ను ఉపయోగించుకోవాలి.గదులను హాట్ గా, వేడిగా ఉంచుకోవాలి. వైరస్ నుండి రక్షణ పొందడానికి ఇది ఒక గ్రేట్ మార్గం.

హెల్తీ ఫుడ్స్:
హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు . దాంతో వివిధ రకాల వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలర్జీలకు దూరంగా ఉండవచ్చు.

కార్పెట్ మరియు మ్యాట్రన్ ను క్లీన్ గా ఉంచుకోవాలి:
వేసవికాలం కంటే చలికాలంలో బ్యాక్టీరియ, వైరస్ చేరే అవకాశం ఎక్కువ కనుకు మ్యాట్రస్ మరియు కార్పెట్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి . దాంతో మేజర్ గా వచ్చే అలర్జీలనుండి తప్పించుకోవచ్చు.

పెట్ కేర్:
అలర్జీలకు మరో ప్రధాన కారణం పెంపుడు జంతువులు, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా అలర్జీలకు గురిఅవుతుంటారు కాబట్టి పెట్స్ రూమ్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి.



Click it and Unblock the Notifications