Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
పరగడుపుతో చేసే ఈ పనులు వల్ల ఆరోగ్యానికి హాని ఎక్కువ
సహజంగా మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ ఉదయం కొన్ని మంచి పనులు చేస్తుంటాము. నిద్రలేవగానే నీళ్ళు త్రాగడం, లెమన్ వాటర్, హనీ వాటర్ ను కాలీపొట్టతో త్రాగడం....అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తినడం వంటి ఆరోగ్యకరమైన పనులను చేస్తుంటాము . ఇలాంటి పనులు చేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను ప్రత్యేకంగా పొందుతాము. మరి అదే విధంగా కాలి కడుపు లేదా పరగడులతో కూడా కొన్ని పనులు చేయకూడదు. కాలి పొట్టతో చేసే మంచి పనులు కంటే కాలిపొట్టతో చేసే కొన్ని చెడు పనుల వల్ల హాని కలుగుతుంది . నిద్రించే సమయంలో తిన్న ఆహారాలు జీర్ణం అవుతాయి . మరియు మరి నిద్రలేచినప్పుడు పొట్టకు విలువైన ఆహారాలు అవసరం అవుతాయి.
అలా ఉదయం పరగడపును విలువైన ఆహారాలకు బదులుగా అసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోపల అసిడిక్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో కడుపులో మంటకు గురి అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉదయం చేసే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కడుపులో చీకాకును కలిగిస్తుంది.
కాబట్టి, ప్రతి రోజూ మీరు ప్రారంభించే దినచర్య చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. ఇది రోజంతా మిమ్మల్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచగలుగుతాయి . మరియు మీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో మీరు ఉదయం తీసుకొనే ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . అందువల్ల మీరు ఉదయం తీసుకొనే అల్పాహారం కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఉదయం తీసుకొనే ఆహారాలు పొట్టను ప్రశాంతంగా ఉంచడంతో పాటు జీవక్రియలు కావల్సిన శక్తిని అందివ్వడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.
మరి అలా ఉండాలంటే, ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానికి పరగడుపుతో ఎలాంటి పనులు చేయకూడదో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం...

మందులు:
బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకొనే మెడిసిన్స్ ను డాక్టర్లు ప్రిస్ర్కైబ్ చేస్తారు . అవే మెడిసిన్స్ ను ఉదయం పరగడుపుతో వేసుకోవడం వల్ల కడుపులో మంట ఎసిడిటి కలిగి ఇబ్బింది కలిగిస్తుంది.

స్టొమక్ లైనింగ్:
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గీసుకోకుండా కాలీ పొట్టతో సోడా వంటివి త్రాగితే? మీ పొట్టలో యాసిడ్ లెవల్స్ ను అమాంతం పెంచేస్తాయి . మరియు ఇవి వికారం మరియు ఇరిటేషన్ కు దారితీస్తాయి.

స్పైసీ ఫుడ్స్ తినడం:
స్పైసీ ఫుడ్స్ అంటే ఇష్టముండే వారు, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు లేదా బ్రేక్ ఫాస్ట్ ముందు తీసుకొనే ఆహారాల్లో కారం ఎక్కువ అవ్వడం వల్ల స్టొమక్ అల్సర్ కు కారణం అవుతుంది. దీర్ఘకాలంలో ఇవి స్టొమక్ యాసిడ్స్ కు కారణం అవుతుంది.

ఆల్కహాల్ తీసుకోవడం :
కాలీ పొట్టతో పరగడపున ఆల్కహాల్ తీసుకోవడ అంతటి వరెస్ట్ పని మరొక్కటి ఉండదు . ఇవి జీవక్రియలకు అంతరాయం కగించడం మాత్రమే కాదు , శరీంరలో సున్నితమైన అవయవాలన్నింటిని బర్న్ చేసేస్తాయి.

కాఫీ త్రాగడం:
నిద్రలేవగానే ఒక చెడు అలవాటు, కాఫీ త్రాగడం . కాలీ పొట్టతో కాఫీ త్రాగడం వల్ల హార్మోనులు అసమతుల్యతకు కారణం అవుతుంది మరియు స్ట్రెస్ పెరుగుతుంది. అదే విధంగా టీ కూడా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి, నిద్రలేవగానే టీ, కాఫీలకు దూరంగా ఉండండి.

టమోటోలు:
పరగడుపున టమోటోలను తినడం వల్ల పొట్ట చీకాకు గురి అవుతుంది. టమోటోలోని అసిడిక్ ఆమ్లమం. పొట్టలో ఇతర యాసిడ్స్ ఉత్పత్తికి కారణం అవుతుంది .దాంతో స్టొమక్ అల్సర్ కు గురిఅవుతారు.

వర్కౌట్:
మీరు జిమ్ కు వెలుతున్నట్లైతే మీ ట్రైనర్ ప్రీవర్కౌట్ స్నాక్ తినమని సలహాఇస్తుంటారు . కాలీపొట్టతో వర్కౌట్స్ చేయడం వల్ల ఫ్యాట్ కరగడానికి బదులుగా ..కండరాలు వదులవుతాయి.

అరటిపండ్లు తినడం:
ఉదయం పరగడుపున అరటిపండ్లు తినడం వల్ల మన శరీంలో మెగ్నీషియం లెవల్స్ అమాంతంగా పెరుగుతాయి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, ఉదయం పరగడపును అరటిపండ్లను తినకండి..



Click it and Unblock the Notifications
