Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఏ అనారోగ్య సమస్యకు ఎలాంటి ఫుడ్ మెడిసిన్ లా పనిచేస్తుంది ?
ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మందులు వాడటం అందరికీ అలవాటుగా మారింది. తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి చిన్న చిన్న సమస్యలే అయినా.. హోం రెమిడీస్ పై ఫోకస్ చేయకుండా ఈజీగా అందుబాటులో ఉండే మందులనే వాడుతుంటాం. అలా కాకుండా.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంటే.. ముందుగానే సమస్యను అరికట్టవచ్చు.
READ MORE: బరువు పెరగడానికి కారణమయ్యే హెల్తీ ఫుడ్స్ గురించి తెలుసా ?
రెగ్యులర్ డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కాదు.. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఏ పదార్థాలు ఏ అనారోగ్య సమస్యతో పోరాడతాయో తెలుసుకుంటే.. మరింత కేర్ తీసుకోవచ్చు. కాబట్టి ఫుడ్స్ మెడిసిన్స్ గా ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఏ ఫుడ్ ఏ అనారోగ్య సమస్యను అరికడుతుందో చెక్ చేద్దాం.. ఫాలో అయిపోదాం..

తలనొప్పి - ఫిష్ తినండి
పుష్కలంగా చేపలు తినడం వల్ల ఇందులో ఉండే ఆయిల్ తలనొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి డైట్ చార్ట్ లో చేపలను చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.

జ్వరం - పెరుగు
పెరుగును ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సహజ సిద్ధంగా లభించే తేనెను కూడా తీసుకుంటూ ఉండటం వల్ల జ్వరం తగ్గుతుంది. రాకుండా అరికట్టవచ్చు.

స్ర్టోక్ నిరోధించడానికి - టీ
స్ర్టోక్ నిరోధించాలంటే రెగ్యులర్ గా టీ తీసుకుంటూ ఉండాలి. శరీరంలో ఫ్యాట్ చేరుకోకుండా టీ అరికడుతుంది. అలాగే గ్రీన్ అయితే రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా సహాయపడుతుంది.

నిద్రలేమి - తేనె
నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్లు తేనెను తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల ప్రశాంతత పెరగడమే కాదు.. ఎలాంటి బాధ నుంచైనా ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమా - ఉల్లిపాయలు
ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఆస్తమాను నివారించవచ్చు. అలాగే ఉల్లిపాయలను వేడి చేసి ఒక క్లాత్ లో చుట్టి చెస్ట్ పై పెట్టడం వల్ల శ్వాససంబంధ సమస్యలు తగ్గిపోతాయి. శ్వాస ఈజీగా సాగడానికి సహాయపడుతుంది.

కీళ్ల వాపు ఆర్థరైటిస్ - చేపలు
కీళ్లవాపు సమస్యలతో బాధపడుతున్నా.. ఆర్థరైటిస్ సమస్యకు దూరంగా ఉండాలన్నా.. చేపలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. సాల్మన్, ట్యూనా, మక్కెరల్, సార్డీన్స్ వంటి చేపల రకాలు ఆర్థరైటిస్ రాకుండా నిరోధిస్తాయి. చేపల్లో ఓమేగా ఆయిల్స్, ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక వ్యవస్థకు కూడా మంచి చేస్తాయి.

స్టమక్ అప్ సెట్ - అరటిపండ్లు, అల్లం
కడుపులో మంట లేదా అజీర్తి వంటి సమస్యలు వేధించకుండా అరటిపండ్లు సహాయపడతాయి. అలాగే మార్నింగ్ సిక్ నెస్, వికారం వంటి సమస్యలకు అల్లం చక్కటి పరిష్కారం.

మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ - క్రాన్ బెర్రీ జ్యూస్
యాసిడ్స్ పుష్కలంగా ఉండే క్రాన్ బెర్రీ జ్యూస్ హానికర బ్యాక్టీరియాని తొలగిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగడం వల్ల మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఈజీగా బయటపడవచ్చు.

ఎముకల సమస్యలు - పైనాపిల్
బోన్ ఫ్యాక్చర్, బోలు ఎముకల వ్యాధిని నిరోధించడానికి పైనాపిల్ బాగా సహాయపడుతుంది. పైనాపిల్ లో ఉండే మాంగనీస్ ఎముకల బలానికి సహాయపడుతుంది.

రుతుక్రమంలో వచ్చే ఇబ్బందులు - కార్న్ ఫ్లేక్స్
రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి కార్న్ ఫ్లేక్స్ తీసుకుంటూ ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, అలసటను తగ్గిస్తాయి.

జ్ఞాపకశక్తి సమస్యలు - నట్స్
జింక్ పుష్కలంగా ఉండే చేపలు, నట్స్, గుమ్మడి విత్తనాలు, రెడ్ మీట్ తీసుకోవడం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. జ్ఞాపకశక్తిని, ఆలోచనాశక్తిని పెంచడంలో జింక్ కీలకపాత్ర పోషిస్తుంది.

జలుబు - వెల్లుల్లి
జలుబు, తుమ్ములు వంటి సమస్యలను తగ్గించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇది కొలెస్ర్టాల్ తగ్గించడంలోనూ సహకరిస్తుంది.

దగ్గు - కారం
దగ్గు వచ్చినప్పుడు ఎన్ని రోజులైనా తగ్గదు. ఎన్ని రకాల మందులు, దగ్గు సిరప్స్ వాడినా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు కారం పొడిని రెగ్యులర్ గా వంటల్లో వాడుకోవడం వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుంది. అయితే సరైన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో సమస్యలు వచ్చే అవకాశముంది.

బ్రెస్ట్ క్యాన్సర్ - క్యాబేజ్, వీట్
ప్రస్తుతం అందరినీ హడలెస్తున్న వ్యాధి క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్ ను నిరోధించాలంటే రెగ్యులర్ డైట్ లో క్యాబేజ్, గోధుమలు, బ్రాన్ తీసుకుంటూ ఉండాలి. ఇవి ఈస్ర్టోజెన్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ - గ్రీన్ అండ్ ఆరంజ్ కూరగాయలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే విటమిన్ ఏ, బెటా కెరోటిన్ పుష్కలంగా ఉండే ఆకుపచ్చ, నారింజ పండు రంగు కూరగాయలు తీసుకుంటూ ఉండాలి.

అల్సర్ - క్యాబేజ్
క్యాబేజ్ లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి గ్యాస్ర్టిక్ సమస్యలు, అల్సర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

డయేరియా - ఆపిల్స్
యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డయేరియా లేదా నీళ్ల విరేచనాల నుంచి ఉపశమనం కలగడానికి ఆపిల్స్ బాగా సహాయపడతాయి.

కొలెస్ర్టాల్ - అవకాడో
అవకాడోలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ర్టాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది.

బీపీ - ఆలివ్ ఆయిల్, సెలరీ
రక్తపోటు సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్, సెలరీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి. ఒకవేళ బీపీతో బాధపడుతున్న వాళ్లు కూడా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే సెలరీలో ఉండే కెమికల్స్ రక్తపోటు తగ్గించడానికి సహాయపడతాయి.

రక్తంలో షుగర్ లెవెల్స్ - బ్రొకోలి, పీనట్స్
రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి అదుపుచేయడానికి బ్రొకోలి, పీనట్స్ తీసుకోవాలి. బ్రొకోలిలో క్రోమియం ఉంటుంది. పీనట్స్ ఇన్సులిన్ ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడతాయి.



Click it and Unblock the Notifications