Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
గాఢంగా నిద్రపట్టడానికి ఈ ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి
ప్రతి రోజూ ప్రతి వ్యక్తికి నిద్ర చాలా అవసరం. ఒక రోజుకు ప్రతి ఒక్కరికీ కనీసం 8గంటలు అవసరం. నిద్రలేమి వల్ల బరువు పెరగడం, ఆందోళన, అలసట చెందడం, ఏకాగ్రత లేకపోవడం, నిర్జీవం లేని జుట్టు, డార్క్ సర్కిల్స్, శరీరంలోని జీవక్రియలు సరిగా పనిచేయకపోవడం. ముఖ్యంగా కిడ్నీలు మరియు లివర్ చురుకుగా పనిచేయవచ్చు.
నిద్రలేమి సమస్య ప్రస్తుత రోజుల్లో చాలా సాధారణ సమస్య అయ్యింది. నిద్రపట్టడానికి నిద్రమాత్రలు తీసుకుంటుంటారు. కొన్ని రోజుల తర్వాత ఈ మందు అలవాటుగా మారిపోతుంది. తర్వాత రోజుల్లో నిద్రమాత్రలు వేసుకొన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. దాంతో మరింత ఎక్కవు డోస్ తీసుకోవడానికి ప్రారంభించి సమస్యల్లో చిక్కుకుంటాడు.
నిద్రలేమి సమస్యను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించి నిద్రపోయేందుకు బాగా సహాయపడుతాయి. ఈ ఆహారాలు రాత్రుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతాయి.
మరి ఆ ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. పాలు:
గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దలకాలంనుంచీ వస్తున్న ఆనవాయితీ. మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీప్రసారకాలు(న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఒక గ్లాసు పాలు (చక్కెర గాని మరే తీపి పధార్థమైన కాని చేర్చకుండా) రాత్రి బాగా పొద్దుపోయాక తాగినా, లేదా మీ రాత్రి భోజనంలో పనీర్లాటివి తీసుకున్నా మీకు అందవలసినంత ట్రైటొఫాన్ అందుతుంది. పాలతో తయారైన అన్ని పదార్థాల్లోనూ ట్రైటొఫాన్ ఉంటుంది.

2. ఓట్ మీల్స్:
ఓట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. కొన్ని పరిశోధన ప్రకారం ఇందులో కరిగే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. పాలలో కలిపి తినాటి. ఇందులో వుండే పీచు మీ కడుపు బాగా నింపి త్వరగా మరల ఆకలి కాకుండా చేస్తుంది. కనుక వెన్నతీసిన పాలలో ఓట్లు వేసుకొని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఓట్ మీల్ ను తిసుకొంటే సౌండ్ లెస్ స్లీమ్ మీరు పొందవచ్చు.

3. బాదం:
బాదంలో మెగ్నీషియం పుష్కలంగా నిద్రకు బాగా సహాయపడుతాయి. అంతే కాదు మజిల్స్ రిలాక్స్ అయ్యేలా సహకరిస్తాయి. కాబట్టి నిద్రించే ముందు వీటిని ఒక స్పూన్ ఫుల్ గా తిని గాఢ నిద్రను పొందండి.

4. తేనె:
నిద్రించే ముందు తేనె తీసుకుంటే బాగా గాఢమైన నిద్రపడుతుంది . తేనె గ్లోకోజ్ ను అంధిస్తుంది మరియు విశ్రాంతి పరుస్తుంది.

5. బ్రెడ్ :
గోధుమలు, జొన్నలు, సజ్జలు, లాటివాటితో కలపి తీసుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. గోధుమలలో ప్రోటీన్ శాతం ఎక్కువ. గోధుమతో తయారైన ఆహార పదార్థాలలో మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ బి12 ఉంటాయి. ఇవన్నీ నిద్రకు స్నేహితులే. గోధుమలు తేలికగా జీర్ణము కాదు, చలువ చేయును. బలకరము. గోధుమ పిండితో చేసిన రొట్టెలను తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

6. అరటిపండ్లు :
అరటిపండ్లు మెగ్నీషియం, పొటాషియం హెచ్చుమోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అరటి పండు మనం నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా నియం త్రించగలుగుతుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

7. చమోమెలీ టీ :
ఆశ్చర్యం కదా!అంటే డీ కేఫీనెటెడ్ టీ అనగా చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. వీటిలో థైమిన్ అనే మూలకం నిద్రపొందుటకు బాగా సహాయపడుతాయి.

8. స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరంను విశ్రాంతి పరుస్తుంది . మీరు బేక్ చేసిన బంగాళదుపంను బెడ్ టైమ్ స్నాక్ గా తీసుకొంటే బాగా నిద్రపడుతుంది.



Click it and Unblock the Notifications
