Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బ్రాందీతో జలుబు మరియు దగ్గు మటు మాయం..
మీరు ఊహించుకునే వి మీకు మేలు కలుగచేస్తాయాని అంటుంటారు. ఒకవేళ మీరు కనుక అప్పుడప్పుడు బ్రాందీ ని తాగాలి అని ఊహించుకుంటున్నారా?? ఇది మీకు మంచిదే..ఆశ్చర్యం గా ఉందా?? అందరికీ ఇష్టమైన ఈ బ్రాందీ మీకు ఆరోగ్యపరంగా కూడా బాగా మేలు చేస్తుంది.ఎప్పటినుండో ఇది జలుబుకి మందుగా పరిగణింపబడుతోంది. బ్రాందీ తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
బ్రాందీ అంటే ఏమిటి
వైను లేదా పళ్ళ గుజ్జు నుండి శుద్ధి చేసి తీసిన సారాయి(స్పిరిట్).మొదట కొంచం శుద్ధి చేసాకా చెక్కపెట్టెలలో చాలాకాలం పాటు నిల్వ చేస్తారు. దీనివల్ల బ్రాందీ కి ఒక ప్రత్యేక మైన జేగురు రంగు వస్తుంది.16 వ శతాబ్దం లో మొట్టమొదట బ్రాందీ తయారు చేయబడింది. అసలు దీనికి ఆ పేరు డచ్ భాషలో "బర్న్ ట్ వైన్" అన్న అర్ధం కల పదం నుండి వచ్చింది.బహూశా శుద్ధి చేసే పద్ధతిని బట్టి ఆ పేరు వచ్చి ఉండచ్చు.చాలా బ్రాందీలలో 50% ఆల్కాహాలు ఉంటుంది.
మధ్యపానతంతో ఆరోగ్యమే మహాభాగ్యం..!?
ప్రపంచం లో చాలా చోట్ల బ్రాందీ ని తయారు చేస్తారు.కాగ్నాక్ అనే పేరు గల ఫ్రెంచ్ బ్రాందీ బాగా ప్రసిద్ధి.ఇదే కాకుండా గ్రీక్ మెటాక్సియా, లేదా స్పష్టం గా ఉండే గ్రప్పా లాంటివి కూడా చాలా ఉన్నాయి.పండ్ల ఆధారిత బ్రాందీలు కూడా చాలా రకాలు.ఆపిల్ బ్రాందీ,ఆప్రికట్,చెరీ మరియు ప్రసిద్ధి చెందిన బ్లాక్ ప్లం బ్రాందీ స్లివోవిక్ లాంటివి.కొన్ని బ్రాందీలకి తీయని వాసన ఉంటే మరికొన్ని బాగా గాఢమైన వాసన కలిగి ఉంటాయి. మరి బ్రాందీ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం...

జలుబు కి బ్రాందీ
శరీరం లో వేడి కలిగించే గుణం ఉన్న బ్రాందీ తీసుకుంటే జలుబు, ఫ్లూ తదితర వ్యాధుల నుండి కావాల్సిన ఉపశమనం లభిస్తుంది.దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతు వాపు, ఇతర ఇన్ ఫెక్షన్ ల మీద సమర్ధవంతం గా పోరాడతాయి.వేడిగా ఉండే కల్లు ని తేనే నిమ్మకాయ తో కలిపి తీసుకోవడం జలుబు తగ్గడానికి చక్కటి మార్గం.బ్రాందీ, అల్లం తో చేసిన వైన్ సేవిస్తే వల్ల ఈ రెండింటిలో ఉన్న గుణాల వల్ల ఆరోగ్యానికి లాభదాయకం. కొన్ని చుక్కల బ్రాందీ తాగితే గొంతు మంట ని నయం చేస్తుంది.

హృదయ నాళ సంబంధిత సమస్యలు దూరం
మన రక్తం లో ప్లేట్లెట్ల చర్యలని నెమ్మదింపచేసి హృదయ నాళ సంబంధిత వ్యవస్థ సమర్ధవంతంగా పని చేసేటట్లు చేస్తుంది బ్రాందీ.ఆర్మాగ్నాక్(ఓక్ పెట్టెలలో నిల్వ చేసిన ఫ్రెంచ్ బ్రాందీ) మన ప్లేట్లెట్స్ మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని 2007 లో థ్రాంబోసిస్ అధ్యయనం నిరూపించింది.

రోగనిరోధక శక్తి ని పెంచుతుంది
బ్రాందీ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక వ్యవస్థలో ఫ్రీ రాడీకల్స్ ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బ్రాందీ ని శుద్ధి చేసేటప్పుడు ఉపయోగించే రాగి పాత్రల వల్ల బ్రాందీకి ఫ్రీ రాడికల్స్ తో పోరాడే గుణం వచ్చి ఉంటుంది.30 మిల్లీ లీటర్ల బ్రాందీ లో ఉన్న యాంటీ ఆంక్సిడెంట్లు మీరు రోజూ తీసుకోవాలని సిఫారసు చేసిన విటమిన్ సీ లో ఉన్నన్ని ఉంటాయి. నాణ్యత ఎక్కువ ఉన్న బ్రాందీలలో ఇది మరింత ఎక్కువ ఉంటుంది.

కేన్సర్ పై పోరాటం
బ్రాందీ లో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్ ఒవేరియన్ (అండాశయ) కేన్సర్ పై పోరాటం లో ఏమైనా పాత్ర పోషించగలవేమో అని కనుక్కోవడానికి శాస్త్రఙులు పరిశొధిస్తున్నారు.ఈ అధ్యయనం ఇంకా మొదటి మెట్టు మీదే ఉన్నప్పటికీ ఫలితాలు ఆశాజనకం గా ఉన్నాయి.

బ్రాందీ ని ఆస్వాదించడం ఎలా
బ్రాందీ లో ఏమీ కలపకుండా తాగితేనే దానిలోని విలక్షణమైన సువాసన ని ఆస్వాదించగలమని బ్రాందీ నిపుణుల అభిప్రాయం.చాలా మందికి బ్రాందీ ని అలా తాగడమే ఇష్టమున్నా కానీ కొంతమందికి బ్రాందీ ని ఇతర పానీయాలతో కలుపుకుని తాగడం నచ్చుతుంది.సోడాతో కలిసిన బ్రాందీ రాత్రి భోజనం తరువాత తీసుకుంటే ఆహారం జీర్ణమవ్వడం లో తోడ్పడుతుంది.సోడా నే కాకుండా ఎండు అల్లం(సొంఠి) లేదా టానిక్ వాటర్ కూడా కలపచ్చు బ్రాందీలో.

బ్రాందీ కాక్ టెయిల్స్ కూడా ప్రియమైనవే.
మెట్రోపాలిటన్ కాక్ టెయిల్లో బ్రాందీ తో పాటు వెర్మూత్(సుగంధ వాసన కలిగిన హెర్బ్స్ తో చేసిన రెడ్ లేదా వైట్ వైన్) చక్కెర సిరప్ కలుపుతారు.బ్రాందీ అలెగ్జాండర్ లో తాజా క్రీం, క్రీం డా కకావ్(చాక్లెట్ ఫ్లేవర్ కలిగిన చాక్లెట్ లిక్కర్) కలిసి ఉంటాయి.ఇక క్లాసిక్ షాంపేన్ కాక్ టెయిల్ రుచి గా ఉండటమే కాదు అడుగున్న ఉన్న షుగర్ క్యూబ్ నుండి వెలువడే బుడగలతో ఉంటుంది.ఫ్రెంచ్ కాఫీ అంటే బ్రాందీ మరియు క్ష్ పైన క్రీం తేలుతున్న బ్లాక్ కాఫీ. ఈ ఫ్రెంచ్ కాఫీ భోజనం తరువాత తాగడానికి ఒక సమగ్ర పానీయం.



Click it and Unblock the Notifications











