Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
ఉదయాన్నే చేసే కొన్ని పనులు అనారోగ్యానికి సంకేతాలు
నిద్రలేవగానే మనం చేసే పనులు ఆ రోజుపై ప్రభావం చూపిస్తాయి. మన వ్యక్తిత్వాన్ని.. ఉత్సాహాన్ని.. నింపే పనులు చేయడం వల్ల.. రోజంతా ఆనందంగా గడిపేయచ్చు. కొంతమంది.. అన్నీ సవ్యంగా ఫాలో అయినా.. మరికొందరు పాటించే పద్ధతులు వారి రోజుని.. నిరుత్సాహపరుస్తాయి.
నిద్ర లేవడం కాస్త లేటయిందా.. అంతే సంగతులు. హైరానా పడిపోతూ.. చేయాల్సిన పనులు మానేసి.. పరుగులు పెట్టేస్తారు. ఆఫీసుకి టైం కి చేరుకోవాలని.. కాలకృత్యాలు కూడా ముగించుకోకుండానే పారిపోతుంటారు. దీనివల్ల.. అనారోగ్యంతోపాటు.. చేయాల్సిన పనులు కూడా సక్రమంగా చేయలేకపోతారు.
కాబట్టి ఉదయాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. చేయాల్సిన అన్ని పనులు సక్రమంగా ముగించుకునేలా ప్లాన్ చేసుకోండి. ఉదయాన్ని ఆరోగ్యంగా చేసుకోవడానికి పాటించకూడని పద్ధతులేంటో తెలుసుకోండి.

బెడ్ కాఫీ
మంచం దిగకుండానే కాఫీ తాగేస్తున్నారా ? అయితే మీరు రిస్క్ లో పడ్డట్టే. కనీసం బ్రష్ కూడా చేయకుండానే.. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పొగత్రాగటం
నిద్రలేస్తూనే.. పొగతాగుతున్నారా ? అయితే ఇకపై మానేయండి. లేవగానే పొగతాగడం వల్ల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటారు.

అల్పాహారంలో ఫ్యాట్ ఫుడ్
అల్పాహారం ఎప్పుడు మితంగా ఉండాలి. కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోరాదు. సలాడ్, ధాన్యాలు వంటి వాటిని తీసుకోవడం వల్ల.. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

బ్రేక్ ఫాస్ట్ మానేయడం
ఆఫీస్ కి సమయానికి చేరుకోవాలనే గాబరాలో టిఫిన్ తినడం మానేయకూడదు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడానికి కాస్త టైం కేటాయిస్తే మంచిది.

స్నానం
చాలా మంది స్నానం కూడా చేయకుండా.. ఆఫీసులకు పరుగులు పెట్టేస్తుంటారు. సెంట్ కొట్టేసుకుని.. మ్యానేజ్ చేసేస్తారు. కానీ అది మంచి అలవాటు కాదు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లేటుగా నిద్రలేవడం
లేటుగా నిద్రలేవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్ర సరిపోకపోతే.. రాత్రిపూట త్వరగా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి కానీ.. లేటుగా నిద్రలేవడం.. అనారోగ్య సంకేతం.

పళ్ల సంరక్షణ
పళ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా తీరిక లేదని ఫీలవుతుంటారు కొంతమంది. దీనివల్ల పళ్లు పాడైపోతాయి. కాబట్టి.. పళ్ల సంరక్షణకు కూడా కాస్త టైం కేటాయిస్తే మంచిది.

బట్టలు
బట్టలు ఎప్పుడూ ఉతికినవే వాడుకుంటే మంచిది. ఉతకని బట్టల్లో బ్యాక్టీరియా.. దుర్వాసన ఉంటుంది. అలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి.. శుభ్రంగా ఉన్న బట్టలు వేసుకోవాలి.

నిత్యకృత్యాలు
ఉరుకుల, పరుగుల జీవితంలో నిత్యకృత్యాలు పూర్తి చేసుకోవడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు కొంతమంది ఉద్యోగులు. కానీ.. ఇలాంటి పద్ధతులు ఫాలో అవడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి.. మీ రోజు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి.. ఆరోగ్యంగా.. తీర్చిదిద్దుకోండి.



Click it and Unblock the Notifications
