Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
ఇండియన్స్ రాగి పాత్రలో నీళ్లు తాగడం వెనక సీక్రెట్ ఏంటి ?
ఆయుర్వేదం ప్రకారం కాపర్ శరీరానికి అత్యంత ముఖ్యమైన మినరల్. రాత్రంతా రాగిపాత్రలో నీటిని ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది ఇప్పటి స్టడీస్ కాదు.. పురాతన కాలం నుంచి మన ఇండియన్స్ పాటిస్తున్న అద్భుతమైన చిట్కా. ఈ సింపుల్ చిట్కాతో.. అనేక అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.
రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచడాన్ని తమ్ర జల్ అని పిలుస్తారు. ఈ నీటిని తీసుకోవడం వల్ల కఫ, వట, పిత్త దోషాలను నివారిస్తుంది. కాపర్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. దీన్నే ప్రాణ శక్తి అని పిలుస్తారు. కనీసం ఎనిమిది గంటలపాటు రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


బ్యాక్టీరియా
కాపర్ నీటిని ప్యూరిఫై చేసి.. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే.. ఆ నీళ్లు సహజంగా శుద్ధి అయినట్టు.

ధైరాయిడ్ పనితీరు
థైరాయిడ్ సంబంధిత సమస్యలకు కాపర్ డెఫిసియెన్సీ ప్రధాన కారణం. కాబట్టి రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల.. థైరాయిడ్ సమస్యలు నివారించవచ్చు.

కీళ్ల నొప్పులు
కాపర్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్స్ నివారించడంలో సహాయపడతాయి.

గాయాలు మాన్పడానికి
కాపర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. అలాగే కొత్త కణాలు ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయి. కాబట్టి.. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల.. ఎలాంటి గాయాలైనా త్వరగా తగ్గిపోతాయి.

మెదడు పనితీరు
మెదడులో అనేక రకాల ఎంజైమ్స్ పనిచేయడానికి కాపర్ చాలా అవసరం. అలాగే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు రాకుండా నివారించి.. చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

జీర్ణశక్తికి
రాగిపాత్రలు ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన కాపర్ అంది.. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. రాగిపాత్రల్లో నీళ్లు తాగితే.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఈ పద్ధతి పాటిస్తారు.

గర్భణీ స్త్రీలు
గర్భధారణ సమయంలో వ్యాధినిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. కాబట్టి రాగిపాత్రలలో నీళ్లు తీసుకోవడం వల్ల.. ఇన్ఫెక్షన్స్, అనారోగ్య సమస్యలు రాకుండా.. హెల్తీగా, యాక్టివ్ గా ఉంటారు.

క్యాన్సర్
శరీరానికి కాపర్ చాలా ముఖ్యమైన, విలువైన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అరికడుతుంది.

ఏజింగ్
చర్మంపై ముడతలు, గీతలు, ప్యాచ్ లను నివారించి.. చర్మం నవ యవ్వనంగా కనిపించడానికి కాపర్ ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడానికి
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి, అల్సర్ నివారణకు సహాయపడుతుంది . అల్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను డైజెస్టివ్ ట్రాక్ నుంచి తొలగిస్తుంది.

యాక్టివ్ గా ఉండటానికి
శరీరంలో ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరంలో అడినోసిన్ ట్రైఫాస్పేట్ ను ఉత్పత్తి అయ్యేలా చేసి శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని శరీరమంతా ప్రసరించేలా చేస్తుంది. దాంతో మీరు లేజిగా లేదా బద్దకంగా లేకుండా చేస్తుంది.

రక్తహీనత
సెల్ ఫార్మేషన్ నుంచి ఐరన్ షోషణ వరకూ కాపర్ చాలా సహాయపడుతుంది. కాపర్ శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరం అయ్యే ముఖ్య ఖనిజం. దీనివల్ల రక్తహీనత నివారించవచ్చు.

రక్తపోటు
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, రాగి రక్తపోటు, హార్ట్ రేట్ నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది. గుండెకు రక్తం సజావుగా అందడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications