Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమిడీస్
రాబోయేది చలికాలం. కాబట్టి.. ముందుగానే అలర్ట్ గా ఉండాలి. చలికాలంలో త్వరగా జలుబు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి.. త్వరగా జలుబు చేసే వాళ్లు.. ఎలాంటి రెమిడీస్ తో తక్షణ ఉపశమనం పొందవచ్చో తెలుసుకోవాలి.
వాతావరణంలో మార్పులు, కాలుష్యం, వ్యాధి నిరోధకత కోల్పోవడం వంటి కారణాల వల్ల జలుబు సమస్య వస్తుంది. సాధారణ జలుబు వల్ల ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోవడం జరుగుతుంది. సమస్య చిన్నదిగా కనిపించినా మన దినచర్యకు ఆటకం కలిగిస్తుంది. పనులు సజావుగా జరగనీయవు.

ఇక రాబోయేది చలికాలం. కాబట్టి.. ముందుగానే అలర్ట్ గా ఉండాలి. చలికాలంలో త్వరగా జలుబు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి.. త్వరగా జలుబు చేసే వాళ్లు.. ఎలాంటి రెమిడీస్ తో తక్షణ ఉపశమనం పొందవచ్చో తెలుసుకోవాలి.
జలుబు చేసినప్పుడు రోజుకి మూడు ట్యాబ్లెట్స్ వేసుకుని విసిగిపోయి ఉంటే.. డాక్టర్ ని సంప్రదించడానికి సమయం లేకపోతే.. కొన్ని గ్రాండ్ మా టిప్స్ మీ ఇంట్లోనే ఉన్నాయి. వీటిని పర్ఫెక్ట్ గా పాలో అయితే.. జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

తేనె, అల్లం రసం
తేనె, అల్లం రసం రెండింటినీ సమానంగా తీసుకుని.. ప్రతిరోజూ తాగాలి. దీని టేస్ట్ నచ్చకపోతే.. సగం గ్లాసు వెచ్చటి పాలలో మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొంతు, ముక్కు ద్వారాల్లో చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది.

పసుపు
పాలలో పసుపు కలిపి కాస్త మరిగించాలి. ఈ మిల్క్ ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

ఫ్లాక్స్ సీడ్స్, నిమ్మ, తేనె
ఫ్లాక్స్ సీడ్స్ ని నీటిలో ఉడికించాలి. ఆ మిశ్రమం కాస్త మందంగా తయారైన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. దీన్ని రోజుకి రెండుసార్లు తీసుకుంటే.. జలుబు పరార్ అవుతుంది.

బెల్లం
నీళ్లలో మిరియాలు వేసి ఉడికించాలి. కొన్ని జీలకర్ర కలపాలి. మరికొద్దిసేపు మరిగించాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం మిక్స్ చేయాలి. బెల్లం కరిగిన తర్వాత చల్లార్చి తాగాలి. అంతే జలుబుతో పాటు.. చెస్ట్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి.

మసాలా టీ
జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో మసాలా ఛాయ్ అద్భుతం చేస్తుంది. కొద్దిగా టీ పౌడర్ ని ఉడికించి, లవంగాలు, యాలకులు, అల్లం, మిరియాల పొడి కలపాలి. బాగా ఉడికిన తర్వాత పాలు కలపకుండా.. తీసుకోవాలి. అవసరమైతే తేనె కలిపి తీసుకుంటే.. జలుబు వెంటనే తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications