Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!!
దాల్చిన చెక్కను అద్భుతమైన స్పైస్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఇందులో అనేక హెల్త్, బ్యూటీ బెన్ఫిట్స్ ఉన్నాయి. పాక శాస్త్రంలో చాలా పవర్ ఫుల్ అండ్ ఫేమస్ దినుసు ఇది. స్వీట్స్, ఇతర రకాల ఆహారాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆహారాల్లో అద్భుతమైన రుచిని అందించే దీనిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు అన్నీ ఇన్నీ కావు.
దాల్చిన చెక్కలో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే.. పొందే ఫలితాలు అమోఘమైనవి. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉన్న దాల్చిన చెక్కను, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పాలలో కలిపి తీసుకుంటే.. మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..

జీర్ణక్రియకు
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్
టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మంచి నిద్రకు
కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.

జుట్టు, చర్మానికి
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి.

బలమైన ఎముకలకు
వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

క్యావిటీస్
దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది. క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.

జలుబు, ఫ్లూ
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
