బరువు తగ్గడం వల్ల కలిగే 10 అబ్బురపరిచే భావోద్వేగపరమైన ప్రభావాల గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మన శరీరంలో ఉన్న నీటి శాతాన్ని లేదా కొవ్వు శాతాన్ని ఒక క్రమపద్ధతిలో తగ్గించుకొనే విధానాన్నే బరువు తగ్గించుకోవడం అని అంటారు. ఉదేశ్యపూర్వకంగా లేదా యాదృచ్చికంగా ఎలా అయినా బరువు తగ్గే ఆస్కారం ఉంది. కానీ చాలా సందర్భాల్లో ఎక్కువ మంది వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే బరువు తగ్గుతుంటారు. ఎందుచేతనంటే ప్రతి ఒక్కరు సన్నగా నాజూకుగా కనపడుతూ అందమైన శరీరాకృతిని కలిగి ఉండాలని భావిస్తుంటారు.

కానీ చాలా మంది వ్యక్తిలకు తెలియని విషయం ఏమిటంటే, బరువు తగ్గడం వల్ల అది మన యొక్క శరీరంతో పాటు అతి ముఖ్యంగా మన యొక్క మెదడు పై కూడా బావోద్వేగపరంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిలో ఉన్న వారిని మంచి ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని ఎన్నో రేట్లు పెంపొందించే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో పరిస్థితులని సరైన పద్దితిలో వాటిని మనం నిర్వహించడం ద్వారా వాటి యొక్క ప్రభావాలన్నీ ప్రభావంతంగా ఎదుర్కొని సఫలీకృతం కావచ్చు.

10 Mind-blowing Emotional Effects Of Weight Loss

ప్రతి నాణానికి రెండువైపుల ఉన్నట్లే, బరువు తగ్గడం వల్ల కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలు మన పై పడే అవకాశం ఉంది.

బరువు తగ్గటం వల్ల కలిగే సానుకూల మరియు ప్రతికూల భావోద్వేగప్రభావాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవి ఏమిటంటే...

సానుకూల ప్రభావాలు:

#1 మన శరీర గౌరవం ఎంతగానో పెరుగుతుంది :

#1 మన శరీర గౌరవం ఎంతగానో పెరుగుతుంది :

పేరుకు తగ్గట్టుగానే ఏ వ్యక్తులైతే బరువు తగ్గుతారో అటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ గౌరవం ఎన్నో రేట్లు పెరుగుతుంది. వాళ్లకు కావాల్సిన శరీరాకృతిని సాధించినప్పుడు వారిలో ఎంతో ఆత్మ విశ్వాసం ఉంటుంది, పెరుగుతుంది మరియు దీనికి తోడు ఆత్మ గౌరవం కూడా దానితో పాటు ఎంతో వృద్ధి చెందుతుంది. కొన్ని రకాల ప్రత్యేకమైన దుస్తులను ఎంతో ఆత్మ విశ్వాసంతో ఇటువంటి సమయంలో వేసుకోగలరు మరియు వారు ఏమిచేయదలుచుకున్నారు, ఏమి చెప్పదలచుకున్నారు లేదా ఏమి కోరుకుంటున్నారు అనే విషయాలకు సంబంధించి ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా చేతనమైన స్థితిలో బాహాటంగా భయం లేకుండా చెప్పగలరు.

#2 ఆత్మ గౌరవం ఎంతగానో పెరుగుతుంది :

#2 ఆత్మ గౌరవం ఎంతగానో పెరుగుతుంది :

మనం ముందే చెప్పుకున్నట్లుగా ఏ వ్యక్తులైతే బరువు తగ్గుతారో ఆ వ్యక్తుల్లో ఆత్మ గౌరవం విపరీతంగా పెరుగుతుంది. మన యొక్క జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గితే అటువంటి సందర్భంలో ఆత్మ గౌరవం పెరుగుతుంది గాని, కృత్రిమంగా ఏదైనా చికిత్స ద్వారానో లేదా మాత్రల ద్వారానో బరువు తగ్గితే అప్పుడు ఆత్మ గౌరవం పెరగదు. ఆత్మ గౌరవానికి మరియు బరువు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధం సరళంగా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు.

ప్రతికూల ప్రభావాలు :

ప్రతికూల ప్రభావాలు :

#3 ఒత్తిడి :

ఏ వ్యక్తులైతే బరువు తగ్గాలని భావిస్తారో అటువంటి వ్యక్తులు, వారి యొక్క జీవన శైలి మార్పులో భాగంగా వారు తీసుకొనే ఆహారాన్ని చాలా వరకు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని సార్లు అధికంగా గనుక బరువు కోల్పోతే అటువంటి సమయంలో ఒత్తిడి మరియు ఆత్మగౌరవం దెబ్బ తినే అవకాశం ఉంది. అంతే కాకుండా శరీర గౌరవం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. వారు లావు లేకపోయినా కూడా లావు ఉన్నామేమో అని ఎక్కువగా బాధపడుతుంటారు. ఇందువల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు మరియు వివిధరకాల ఆహార లోపాలు మరియు ఆహారపు అలవాటులో క్రమం తప్పే అవకాశం కూడా ఉంది.

#4 ఎదుటివారి దృష్టి మీకు అస్సలు నచ్చదు :

#4 ఎదుటివారి దృష్టి మీకు అస్సలు నచ్చదు :

చాలా మంది బరువు వెనుక దాక్కోవాలని భావిస్తుంటారు. మీ బరువులో గనుక విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటే, ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని గుర్తిస్తారు మరియు అభినందిస్తారు. ఇటువంటి సందర్భంలో మీ పై వచ్చే పొగడ్తలను మీరు సానుకూలంగా తీసుకోకపోవచ్చు. మీ యొక్క వ్యతిరేక లింగం వారు మీ పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు మరియు మీరు వారిని ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో వ్యవహరించడం కొద్దిగా కష్టతరం అవ్వొచ్చు.

#5 హాని కలిగే అవకాశం ఎక్కుగా ఉందని భావిస్తుంటారు :

#5 హాని కలిగే అవకాశం ఎక్కుగా ఉందని భావిస్తుంటారు :

బరువు ఎక్కువగా ఉండటం వల్ల భావోద్వేగ పరంగా చాలా మంది వ్యక్తులకు కొద్దిగా భావోద్వేగపరంగా మద్దతు ఉంటుంది మరియు సంరక్షించబడుతున్నట్లు భావిస్తుంటుంటారు. కానీ, ఎప్పుడైతే మీరు అధిక కొవ్వుని కరిగిస్తారో అటువంటి సమయంలో మీరు కొద్దిగా సన్నబడతారు మరియు కష్టాలలో మీకు హాని కలిగే అవకాశం ఉందని మీరు భావిస్తారు. మీరు బయట ప్రపంచానికి బహిర్గతం అయిపోయారని మరియు కప్పి ఉంచడానికి మీ దగ్గర ఏమిలేదని కూడా మీరు భావిస్తుంటారు.

#6 స్వీయ ముట్టడి :

#6 స్వీయ ముట్టడి :

ఆత్మ గౌరవం పెరగడం అనేది భావోద్వేగపరంగా సానుకూల అంశం అయి ఉండవచ్చు. కానీ, దీనిని ఎక్కువ దూరం గనుక తీసుకు వెళ్తే మీకు స్వీయ శోషణంగా మారే అవకాశం ఉంది మరియు అహంకార ధోరణి పెరిగే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలంలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. ఏ వ్యక్తులైతే బరువు తగ్గుతారో అటువంటి వ్యక్తుల్లో, వారి యొక్క కొత్త శరీరాకృతి పట్ల విపరీతమైన గర్వం ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క ప్రవర్తన కూడా చాలా మారిపోతుంది.

#7 సంబంధ బాంధవ్యాల విషయంలో ఒత్తిడిలు :

#7 సంబంధ బాంధవ్యాల విషయంలో ఒత్తిడిలు :

మీ కంటే కొద్దిగా ఆరోగ్యవంతమైన భాగస్వామి మీకు గనుక ఉంటే, మీరు వారి పై ఇక అంతగా ఆకర్షణకు లోనవ్వరు. ఎందుచేతనంటే మీరు మీ దగ్గర ఉన్న అధిక కొవ్వుని తగ్గించుకున్నారు మరియు మీకు కావాల్సిన శరీరాకృతిని మీరు సాదించుకోగలిగారు. మరో వైపు మీ యొక్క కొత్త శరీరాకృతిని చూసి మీ యొక్క భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఉంది మరియు మీకు ఎదుటి వ్యక్తుల దగ్గర నుండి వస్తున్న విపరీతమైన దృష్టి కూడా వారిని ఒకింత అభద్రతా భావానికి గురిచేస్తుంది. దీనికి తోడు మీ లాగా మీ భాగస్వామి కూడా అవ్వాలనే ఉద్దేశ్యంతో వారిని ఇలా చెయ్ ఆలా చెయ్ అని సలహాలిస్తూ, బరువు తగ్గమని వారి పై ఒత్తిడి కూడా పెంచుతుంటారు. ఇలా చేయడం ద్వారా మీ యొక్క సంబంధబాంధవ్యాల్లో ఘర్షణ తలెత్తే ఆస్కారం ఉంది.

#8 భయం మరియు అభద్రత :

#8 భయం మరియు అభద్రత :

మీరు గనుల బరువు పెరిగితే విపరీతమైన భయానికి మరియు ఆందోళనకు లోనవుతారు. మీరు అనుకున్న శరీరాకృతిని సాధించడానికి మరియు బరువు తగ్గడానికి ఎంత విపరీతంగా చెమట ఒడ్చారు అనే విషయం మీకు మాత్రమే తెలుసు. బరువు పెరిగితే ఎలా అనే విషయమై మీలో ఎల్లప్పుడూ ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. దీంతో ఎప్పుడూ వ్యాయామం చేయాలి అని ఆలోచించి, అలా చేయడం ద్వారా మీరు మీ శరీరాకృతిని అలానే ఉంచుకోవవచ్చు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు మీలో తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. మీకు ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవాలి అనే నిర్ణయం ఒక్కటి చాలు సాధారణంగానే మీలో విపరీతమైన ఆతురతను పెంచడానికి.

#9 విపరీతమైన కోపానికి లోనవుతారు :

#9 విపరీతమైన కోపానికి లోనవుతారు :

ఇంతక ముందుతో పోల్చి చూసినప్పడు బరువు తగ్గడం వల్ల ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని ఎక్కువగా ఆకర్షించగలరు. దీంతో మీరు విపరీతమైన కోపానికి లోనవుతారు .మీ యొక్క గతమంతా వ్యర్థం అని అనుకుంటారు. అస్తిత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. మీ పై విపరీతంగా పడే దృష్టిని మరియు మీ గురించి వచ్చే ఊహించని విపరీతమైన పొగడ్తలను, మీరు స్వీకరించే స్థితిలో ఉండలేకపోవచ్చు.

#10 తినే ఆహారం క్రమం తప్పుట :

#10 తినే ఆహారం క్రమం తప్పుట :

మనం ముందే చెప్పుకున్నట్లుగా ఏ వ్యక్తులైతే బరువు తగ్గుతారో, ఆ వ్యక్తులు బరువుని ఎప్పటికీ అలానే ఉంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో తీవ్రమైన ఒత్తిడికి మరియు ఆతురతకు లోనవుతుంటారు. దీంతో వారు ఏమి తింటున్నారు అనే విషయం పై వారంతట వారే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారి యొక్క బరువుని తగ్గించుకోవాలని తీవ్రంగా నిమగ్నం అయినప్పుడు, వివిధరకాల ఆహారపు అలవాట్లు క్రమం తప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా బులీమియా (మితాహారం ) మరియు అనొరెక్సియా ( ఆకలి లేకపోవడం ) భారిన పడతారు. ఈ యొక్క లోపాలు మిమ్మల్ని మీరు లావుగా ఉన్నాము అనే భావనను కలిగిస్తాయి. ఈ యొక్క భావనాల వల్ల చాలా మంది వ్యక్తులు పాలిపోయి ఉంటారు మరియు పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. ఇలా సరిగ్గా తినకపోవడం వల్ల వీటితో పాటూ అనేక సమస్యలు తల్లే ప్రమాదం ఉంది. ఇటువంటి వ్యక్తులు విపరీతంగా తింటారు మరియు వాంతి చేసుకుంటారు లేదా అస్సలు తిననే తినరు. ఈ యొక్క ప్రాణాంతక లోపం ఏదైతే ఉందొ దీనికి వెంటనే చికిత్స చేయవలసిన అవసరం కూడా ఉంది.

English summary

10 Mind-blowing Emotional Effects Of Weight Loss

Like there are two sides of a coin, there is a flip side to weight loss as well. Here are some positive as well as negative emotional effects of weight loss. Take a look.