మీ ఈ చెడు అలవాటు మరిన్ని నల్లులను ఆకర్షిస్తుంది! ఎలానో తెలుసుకోండి మరి

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ ఈ ఒక్క అలవాటు నల్లులని శాశ్వతంగా ఆకర్షిస్తుందని తెలుసా? నల్లులు చాలా చిరాకు తెప్పించే ప్రాణులు. అవి మన చుట్టూ ఉండాలని ఎవరం అనుకోము.

మీ పాడైన లేదా ఉతకని బట్టలు కొండలాగా పేరుకుపోతుంటే గుర్తుంచుకోండి, అవి నల్లులకి ఇల్లుగా మారతాయి.

నల్లుల బెడదను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గాలు

ఒక అధ్యయనంలో, పరిశోధకులు శుభ్రమైన బట్టలన్నిటినీ ఒక సంచీలో పెట్టి దాన్ని నల్లులు నిండివున్న గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ అది పెట్టి, దాని పక్కన ఉతకనిబట్టల సంచీని కూడా ఉంచారు.

what attracts bed bugs

ఐదురోజుల తర్వాత, పరీక్షించినపుడు, నల్లులు ఉతకని బట్టలను ఎంచుకున్నాయని తెలిసింది.

అందుకని మీరు నల్లుల ప్రభావం ఎక్కువ ఉన్న స్థలంలో నివసిస్తున్నప్పుడు మీ ఉతకని బట్టలను మూతలేకుండా ఉంచేయటం వాటిని మరింత ఆకర్షిస్తుంది.

అదేకాక అవి మీ ఇంటికి చెదలాగా పట్టేసి, ఇల్లును గుల్ల చేసేస్తాయి.

మనుషుల వాసన నల్లులను ఎక్కువయ్యేట్లా ప్రేరేపిస్తుంది. వాటికి మనిషి ఆహారంగా దొరకకపోతే,మనిషి వాసన వచ్చేచోట్లకి, వస్తువులవైపు ప్రయాణిస్తాయి.

వారు మరొక ప్రయోగం కూడా చేసారు.ఒక గదిలో కార్బన్ డైఆక్సైడ్ ను నింపేసి, వ్యక్తి శ్వాసను ఏమైనా అది ప్రేరేపిస్తుందా మరియు ఫలితాలను ఏమన్నా ప్రభావితం చేస్తుందా అని చూసారు.

నల్లులు మీ ఆరోగ్యాన్ని ఎంతలా హాని చేస్తాయో తెలుసా ?

ఇది కూడా నల్లుల ఎంపికను మార్చలేదు. కానీ అవి తాము తలదాచుకున్న చోటినుంచి బయటకి వచ్చేట్లా చేసాయి.

ఫలితాల ప్రకారం ఒక గదిలో ఒక వ్యక్తి సంచరించటం నల్లులను కదిలేలా చేస్తుంది. ఒకవేళ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే, అవి తర్వాత మేటివైన మీ ఉతకని బట్టలను పట్టుకుంటాయి.

what attracts bed bugs

కానీ మీరు చింతించకండి. మీరు ప్రయాణాలలో ఉన్నప్పుడు బట్టలను ఉతకక్కర్లేదు. మీరొక ఖాళీ సంచిని అదనంగా తీసుకెళ్లి ఉతకని బట్టలను అందులో వేసి గాలి చొరబడకుండా టైట్ గా బిగించండి

అధ్యయనం ప్రకారం మూసేసిన సంచీలో ఉతకని విడిచేసిన బట్టలను ఉంచటం, అదికూడా హోటల్ లో ఉన్నప్పుడు చేస్తే అందరూ నల్లులను తమ ఇళ్ళకి కొనితీసుకెళ్ళినట్లు అవుతుంది.

ఇది ఎక్కువ అన్నిచోట్లా పాకకుండా సాయపడుతుంది.

ఇక్కడ మీ ఇంటికి నల్లులు రాకుండా ఉపయోగపడే చిట్కాలను పొందుపరిచాం.చూడండి.

మీ ఇంట్లో చెత్తపడేసే చోటుకి దగ్గర్లో లేదా పక్కన వున్న వస్తువులను ఎప్పటికీ వాటిస్థానం మార్చకండి.

రెండవ వాడకంలో కొన్న వస్తువులను జరపకండి.ముఖ్యంగా పరుపులు, పెట్టెలవంటివి. అద్దెకి తీసుకున్న వస్తువులను ఇంట్లోకి తెచ్చేముందు బాగా పరీక్షించండి. బెడ్ రూమ్ కి చెందిన వస్తువులను అద్దెకి తీసుకోవడం మానేయండి.

ఇంటికి తిరిగొచ్చినప్పుడు, మీ సూట్ కేసును బయటే ఉంచేసి, బట్టలను మెషీన్ లో ఉతికేసి,డ్రై క్లీనింగ్ లేదా ఎండలో ఆరబెట్టేయండి. అప్పుడే వాటిని ఇంట్లోకి తీసుకురండి.

what attracts bed bugs

మీ దుప్పట్లు, దిండ్లు, సాఫ్ట్ టాయ్స్ ను హోటల్స్ కి,ఇతర ఇళ్ళకి తీసుకెళ్ళండి.

వారానికోసారి వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేసి, చెత్తను బయట పారేయండి.

పరుపులను, పెట్టెలను నల్లులు బయటకి పాకడానికి వీలుగా ఉండని విధంగా పైన కవరును అమర్చుకోండి. ఒకవేళ ఆ కవరు చిరిగిపోతే, వెంటనే మళ్ళీ ఇంకోటి వేయండి.

మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నల్లులు కేవలం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలోనే కాదు, వేడి,రక్తం, కార్బన్ డై ఆక్సైడ్ ఉన్న ప్రాంతాలకి కూడా ఆకర్షితమవుతాయి.

నల్లుల నియంత్రణ అనేక టెక్నిక్కులతో, వ్యూహాలతో సాగుతుంది. పైగా వాటి నియంత్రణ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. క్రిమిసంహారకాలను వాడటం వ్యూహంలో భాగమైనా, అవే పూర్తిగా నల్లులను తొలగించవు.

English summary

Filthy Habit That Attracts Beg Bugs

This one dirty habit can be inviting a lot of bed bugs to your dwelling! Read to know what attracts bed bugs.
Subscribe Newsletter