Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
ఫైబర్, ప్రోటీన్ పుష్కలం..కొవ్వు కరిగించి, కొండలను ఢీకొట్టే బలాన్నిచ్చే జొన్న కిచిడి..ఎలా చేసుకోవాలంటే..
బరువు తగ్గాలని డైట్ చేసే వారికి తరచుగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. రుచికరమైన ఆహారాన్ని మిస్ అవ్వడం. ముఖ్యంగా నోరూరించే సగ్గుబియ్యం కిచిడీని చూస్తే ఎవరికైనా ఇట్టే తినాలనిపిస్తుంది. కానీ అందులోని కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు చూసి డైట్ పాడవుతుందని వెనకడుగు వేస్తుంటారు. అయితే అచ్చం సగ్గుబియ్యం కిచిడీ లాంటి రుచిని, రూపాన్ని ఇస్తూనే.. బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడే ఒక రెసిపీ జొన్న కిచిడీ. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే జొన్న కిచిడీ నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.

జొన్న కిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
జొన్నలు - 1 కప్పు
నానబెట్టడానికి - తగినన్ని వేడి నీళ్లు
తాజా పెరుగు - 4 కప్పులు
కీరదోసకాయలు - 2
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
కచ్చాపచ్చాగా దంచిన పల్లీలు- ముప్పావు కప్పు
పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్- 2 టీస్పూన్లు
తురిమిన పనీర్ - అర కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం -రుచికి సరిపడా
జొన్న కిచిడి తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకుని నీళ్లలో 5 నుంచి 6 సార్లు శుభ్రంగా కడగాలి. జొన్నలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి, వాటిని వేడి నీళ్లలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి.
-జొన్నలు బాగా ఉబ్బి నానిన తర్వాత, కుక్కర్ లో వేసి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. జొన్నలు కాస్త పారదర్శకంగా (ముత్యాల్లాగా) మారిన తర్వాత కుక్కర్ దించేయాలి. అందులో మిగిలిన అదనపు నీటిని వడకట్టి ఉడికిన జొన్నలను పక్కన పెట్టుకోవాలి.
-ఈ కిచిడీకి కాంబినేషన్ గా కీరదోస రైతా అద్భుతంగా ఉంటుంది. ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకుని, అందులో ముందుగా తురిమి పెట్టుకున్న కీరదోసకాయ, కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి చల్లబడనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి-కొత్తిమీర తరుగు, వేయించి క్రష్ చేసుకున్న పల్లీలు, తురిమిన పనీర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద 2 నుంచి 3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-పల్లీలు, పనీర్ మిశ్రమం చక్కగా వేగిన తర్వాత, ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్నలను పాన్ లో వేయాలి. దీనికి మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం జత చేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన జొన్న కిచిడీ రెడీ. పొగలు కక్కే వేడివేడి జొన్న కిచిడీని, ఫ్రిజ్ లో పెట్టుకున్న చల్లని కీరదోస రైతాతో కలిపి తింటే ఆ రుచే వేరు.
-జొన్నల్లో ఉండే అధిక ఫైబర్ వల్ల ఇది తిన్న తర్వాత చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది, ఆకలి వేయదు. పల్లీలు, పనీర్ ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
