Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
శత్రువుకి తెలియకుండా దెబ్బ కొట్టే చాణక్యుని సీక్రెట్ ఫార్ములా ఇదే!
వేల సంవత్సరాల క్రితం ఆచార్య చాణక్యుడు లోకానికి అందించిన నీతి సూత్రాలు నేటికి కూడా ప్రజలకు ఒక అద్భుతమైన దిక్సూచిలా పనిచేస్తున్నాయి. రాజకీయ చదరంగమైనా, వ్యక్తుల మధ్య సంబంధాలైనా, వృత్తిపరమైన సవాళ్లయినా.. చాణక్యుని వ్యూహాలను పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది. ఆనాడు మౌర్య సామ్రాజ్య స్థాపనకు ఆయన వ్యూహాలు ఎంతలా ఉపయోగపడ్డాయో, నేటి పోటీ ప్రపంచంలో మనం నెగ్గుకురావడానికి కూడా అంతే ఉపయోగపడతాయి.

చాణక్యుని దృష్టిలో ఒక యుద్ధాన్ని కేవలం కత్తి లేదా కండబలంతో మాత్రమే గెలవలేరు. కొన్నిసార్లు శత్రువును దెబ్బతీయడానికి మన బుద్ధిబలం, సహనం, సాధించే విజయాలే బ్రహ్మాస్త్రాలుగా పనిచేస్తాయి. ఆయుధం పట్టకుండానే శత్రువును మట్టికరిపించే ఆచార్య చాణక్యుని అద్భుత వ్యూహాలు ఏంటో ఇక్కడ చూడండి.
విజయమే అతిపెద్ద ప్రతీకారం
ఎవరైనా మీకు హాని చేయాలని చూసినప్పుడు లేదా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు తీవ్రమైన కోపంతో రగిలిపోవడం సహజం. కానీ చాణక్యుని ప్రకారం ప్రతికారేచ్ఛతో రగిలిపోతూ శత్రువుతో ఘర్షణకు దిగడం వివేకం కాదు. శత్రువుకు మీరు ఇచ్చే అతిపెద్ద శిక్ష.. మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవడమే.
వాదనలు, పోరాటాలు లేకుండా ఎదుటి వ్యక్తి తన తప్పును తానే గ్రహించేలా చేయడమే అసలైన గెలుపు. మీరు మానసికంగా దృఢంగా మారి, విజయపథంలో దూసుకుపోతున్నప్పుడు మీ శత్రువుకు అదే అతిపెద్ద ఓటమి అవుతుంది.
అహంకారమే శత్రువు పాలిట శాపం
ప్రతి శత్రువుకూ అహంకారం అనే అతిపెద్ద బలహీనత ఉంటుందని చాణక్యుడు స్పష్టం చేశాడు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు తక్షణమే కోపంతో ప్రతిస్పందించడం వల్ల మీ శక్తే వృథా అవుతుంది. అటువంటి సమయంలో ప్రశాంతంగా ఉండటం వివేకవంతుల లక్షణం.
మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, సరైన సమయం కోసం వేచి చూసేవాడే చరిత్రను తిరగరాయగలడు. మన ప్రశాంతతే శత్రువు అహంకారాన్ని దెబ్బతీస్తుంది.
వ్యూహం రహస్యం - ఆచరణే ఆయుధం
శత్రువును లేదా పోటీదారుడిని ఓడించాలంటే వారి ప్రతి కదలికపైనా ఓ కన్నేసి ఉంచాలి. కానీ మన తదుపరి అడుగు ఏమిటన్నది ఎవరికీ తెలియకూడదు. మన ప్రణాళికలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచాలి. వివేకవంతుడైన వాడు తన మాటలకంటే చేతలకే ఎక్కువ పదును పెడతాడు. అనవసరమైన వాదనల్లో తలదూర్చకుండా, ఏకాగ్రతతో లక్ష్యం వైపు అడుగులు వేస్తే.. శత్రువు దానంతట అదే మీ ముందు మోకరిల్లుతాడు.
నిశ్శబ్దంగా తప్పుకోవడం కూడా ఒక విజయమే
ప్రతి యుద్ధాన్ని పోరాడే తీరాలనే నియమం ఏమీ లేదు. ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తున్నా లేదా అకారణంగా మీకు హాని తలపెట్టాలని చూస్తున్నా వారితో వాదనకు దిగడం వల్ల బురదలో రాయి వేసినట్లే అవుతుంది. అలాంటి ప్రతికూల వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండటమే ఉత్తమమైన మార్గం. అనవసరమైన వ్యక్తులను, వివాదాలను వదిలించుకోవడం కూడా జీవితంలో ఒక గొప్ప విజయమే అని చాణక్యుడు తెలిపాడు.



Click it and Unblock the Notifications
