డివార్మింగ్ అంటే ఏమి? డివార్మింగ్ అవసరమా?

By: Mallikarjuna
Subscribe to Boldsky

కడుపు నొప్పి వస్తే పెద్దలే తట్టుకోలేరు, అలాంటి పిల్లలకు వస్తే తట్టుకుంటారా? కడుపునొప్పికి వివిధ రకాల కారణాలుండవచ్చు. వాటిలో డివార్మింగ్ కూడా ఒకటి. చాలా మంది పిల్లలకు డివార్మింగ్ అవసరం అనుకుంటారు, కాని పెద్దలకు కూడా డివార్మింగ్ అవసరం. ఈ ఆధునిక యుగంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణం పరిస్థితులు వ్యాధినిరోధకతను బలహీనరపరుస్తోంది.

వ్యాధినిరోతక బలంగా లేనప్పుడు, పొట్టలు నులిపురుగులు, బ్యాక్టీరియా చేరుతాయి. దాంతో శరీర ఆరోగ్యం పాడవుతుంది.

కడుపు నొప్పికి ఉపశనం కలిగించే ఉత్తమ హోం రెమెడీలు

పొట్టలో నులిపురుగులున్నట్లు ఎలా గుర్తించడం? తీపి తినాలనే కోరిక పెరగడం, పొట్ట నొప్పి, ఎప్పుడూ ఆకలిగా ఉండటం, తలనొప్పి, మట్టితినాలనే కోరిక, తలలో పేలు పడటం ఇవన్నీ శరీరంలోపల నులిపురుగులున్నాయనడానికి సంకేతాలు. మరికొన్ని వాస్తవాలు ఈ క్రింది విధంగా..

వాస్తవం # 1

వాస్తవం # 1

పొట్టలోకి నులిపురుగులు ఎలా చేరుతాయి? కలుషిత ప్రాంతాల్లో చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో నడవడం వల్ల కొన్ని రకాల పురుగు గుడ్లు, చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి, తర్వాత జీవక్రియల మీద ప్రభావం చూపుతాయి.

వేసవిలో బాడీ హీట్..పొట్టనొప్పిని తగ్గించే సింపుల్ టిప్స్ ..!

వాస్తవం #2

వాస్తవం #2

కొన్ని సందర్భాల్లో నులిపురుగల యొక్క గుడ్డు మనం తినే ఆహారం ద్వారా పొట్టలోకి చేరుతాయి. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు మీద రౌండ్ వార్మ్ గుడ్డు ఉంటాయి. కాబట్టి, ఇలాంటి ఆహారాల పట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

వాస్తవం #3

వాస్తవం #3

ఇంకా తాగే నీళ్ళు, ఆహారాలు వండటానికి ఉపయోగించే నీరు కలుషితమవ్వడం వల్ల కూడా అంటువ్యాధులకు కారణమవ్వొచ్చు.

వాస్తవం #4

వాస్తవం #4

నులిపురుగల గుడ్లు పెంపుడు జంతువల ద్వారా కూడా మానవశరీరంలోకి చేరవచ్చు. పరిశుభ్రత పాటించకపోవడం, అంటువ్యాధి సోకిన వ్యక్తి మలమూత్రాలతో కలుషితమైన నేల మీద తొక్కడం ద్వారా కూడా నులిపురుగులు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

వాస్తవం # 5

వాస్తవం # 5

బోన్ సూప్ తాగడం వల్ల డివార్మింగ్ చేయచ్చు. నులిపురుగులను నివారించడానికి ఇది ఒక మంచి మార్గం.

వాస్తవం # 6

వాస్తవం # 6

శరీరంలో నులిపురుగుల నివారణకు పులిసిన ఆహారాలు కూడా సహాయపడుతాయి. ఈ విషయం వినడానికి కొంచెం కష్టమైన ఫలితం ఉంటుంది. ఇతర పరాన్నజీవులతో, బ్యాడ్ బ్యాక్టీరియాతో పోరాడటానికి మంచి బ్యాక్టీరియా సహాయపడుతుంది.

వాస్తవం # 7

వాస్తవం # 7

వెల్లుల్లి, ఆకుకూర, ఆపిల్ తో జ్యూస్ తయారుచేయసి తాగాలి. ఉదయం అల్పాహారానికి ముందు ఒక రెండు రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వాస్తవం #8

వాస్తవం #8

ఒక టీస్పూన్ ఆముదం తాగాలి. కొన్ని గంటలు మరే ఇతర ఆహారాలు తీసుకుండా ఉన్నట్లైతే , ప్రేగుల్లో కదలికలు జరిగి నులిపురుగులు బయటకు నెట్టివేయబడుతాయి.

English summary

Is Deworming Necessary?

Is deworming necessary? When your immunity is not so strong, it becomes easy for the worms and bacteria to get into your body and wreck havoc.
Subscribe Newsletter