Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
మీకు విపరీతమైన కోపం వస్తుందా? కోపాన్ని జయించి, మనసుకు అద్భుతమైన ప్రశాంతతను ఇచ్చే 5 బెస్ట్ యోగాసనాలు..
మారుతున్న జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి, నిద్రలేమి, కుటుంబ బాధ్యతలు అన్నా కలిపి ప్రస్తుతం మనుషుల మనశ్శాంతిని హరిస్తున్నాయి. దీనికి తోడు నిరంతరం ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ గందరగోళంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అర్థం కాని అయోమయ స్థితిలో చాలామంది బతుకుతున్నారు. దీని ఫలితమే.. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు, కోపం. ఒక్కోసారి మన కోపంలో ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో మనకే తెలియని స్థాయికి చేరుకుంటున్నాం.

ఈ మితిమీరిన కోపం కేవలం మన ఆరోగ్యాన్నే కాదు, మనకంతో ఇష్టమైన వారితో ఉన్న అందమైన బంధాలను కూడా నాశనం చేస్తుంది. మరి ఈ అశాంతి అగ్నిపర్వతాన్ని చల్లబరిచేదెలా? కచ్చితంగా యోగాతోనే. మీ రోజును ప్రశాంతమైన మనసుతో ప్రారంభిస్తే.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కోపాన్ని జయించి, మనసుకు అద్భుతమైన ప్రశాంతతను ఇచ్చే 5 అద్భుతమైన యోగాసనాలేంటో ఇక్కడ చూడండి.
బాలాసనం (శిశు భంగిమ)
పేరులోనే ఉన్నట్లుగా ఇది మనల్ని పసిపిల్లాడిగా మార్చే ఆసనం. రోజూ ఉదయం ఇంట్లోనే చాలా సులభంగా వేయగలిగే ఈ బాలాసనం.. మెదడుకు, శరీరానికి అద్భుతమైన విశ్రాంతిని ఇస్తుంది. దీనిని క్రమం తప్పకుండా సాధన చేస్తే నాడీ వ్యవస్థ శాంతించి, మీలోని కోపం, ఆందోళన ఇట్టే మాయమవుతాయి.
అనులోమ్-విలోమ్ ప్రాణాయామం (నాడీ శోధన)
శ్వాస మీద ధ్యాస ఉంచితే సగం రోగాలు దూరమవుతాయి. ప్రతి ఉదయం కనీసం 15 నిమిషాల పాటు అనులోమ్-విలోమ్ (నాడీ శోధన) సాధన చేయాలి. ఇది శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచి, నాడీ వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తుంది. విపరీతమైన కోపం, మానసిక అశాంతితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం లాంటిది. ఇది మీ మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చి, నెగెటివ్ ఆలోచనలను దరిచేరనివ్వదు.
శవాసనం
యోగాసనాలలో అత్యంత సులభమైనది, కానీ అత్యంత ప్రభావవంతమైనది శవాసనం. శారీరక, మానసిక అలసటను పారద్రోలడంలో దీనికి మరేదీ సాటిరాదు. నిత్యం కోపగించుకునే స్వభావం ఉన్నవారు రోజూ శవాసనం వేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరానికి, మెదడులోని ప్రతి నరానికి సంపూర్ణమైన విశ్రాంతి లభిస్తుంది.
భ్రమరి ప్రాణాయామం
మనసులో గందరగోళంగా ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం కోసం భ్రమరి ప్రాణాయామం బెస్ట్ ఛాయిస్. ఈ ఆసనం వేస్తున్నప్పుడు ముక్కు గుండా శ్వాస వదులుతూ తుమ్మెద ఝుంకారం లాంటి శబ్దం చేస్తారు. ఆ శబ్దం వల్ల పుట్టే ప్రకంపనలు మెదడులోని ఒత్తిడి కారకాలను తక్షణమే తగ్గిస్తాయి. ఉదయాన్నే ఇది చేస్తే రోజంతా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.
సుఖాసనం
పేరుకు తగ్గట్టుగానే ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను ఇచ్చే ఆసనం. నేల మీద సుఖాసనంలో కూర్చుని, కళ్లు మూసుకుని ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఇలా చేయడం వల్ల ఎప్పటినుంచో పేరుకుపోయిన కోపం, ఒత్తిడి శాశ్వతంగా దూరమవుతాయి.



Click it and Unblock the Notifications
