సపోటతో సరైన ఆరోగ్యం మీ సొంతం.. సపోటతో లెక్కలేనన్నీ ప్రయోజనాలు

Written By:
Subscribe to Boldsky

స‌పోటా పండ్లు.. చూసేందుకు అవి అంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌వు. కానీ సపోటా పండు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎక్కువ కేలరీలుండే సపోటా పండుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాదాపుగా ఏ పండులోనూ దొర‌కని తియ్య‌నైన రుచి మ‌న‌కు స‌పోటా పండ్ల‌లో ల‌భిస్తుంది.

ముఖ్యంగా ఈ పండ్లు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా దొరుకుతాయి. క‌నుక వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి తేలిగ్గా జీర్ణ‌మ‌వ‌డ‌మే కాదు, శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. యాక్టివ్‌గా ఉంచుతాయి. దీంతోపాటు స‌పోటా పండ్ల‌ను రెగ్యుల‌ర్‌గా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్లు ఎక్కువ

విటమిన్లు ఎక్కువ

స‌పోటా పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. శ‌రీరానికి శ‌క్తినిచ్చి చురుగ్గా ఉంచుతాయి. మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

స‌పోటా పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. స‌పోటాల్లో పీచు పదార్థం ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ప్రోటీన్లు, ఐరన్ శక్తి అధికంగా ఉండే ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. క్రీడాకారులకు, వ్యాయామం చేసే వారికి ఎంతో శక్తి అవసరం ఉంటుంది, క‌నుక వారు స‌పోటా పండ్ల‌ను తింటే శ‌క్తి బాగా ల‌భిస్తుంది.

నోటి క్యాన్సర్ రాదు

నోటి క్యాన్సర్ రాదు

సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు, విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి రక్షణను అందిస్తుంది. ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ స‌పోటాల్లో సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండ్లు ఎముకల దృఢ‌త్వానికి బాగా సహాయపడుతాయి.

పోషకాలు అధికం

పోషకాలు అధికం

పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇవి నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడ‌తాయి.

బ్యాక్టీరియా ప్రవేశించకుండా..

బ్యాక్టీరియా ప్రవేశించకుండా..

సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇవి బాక్టీరియా మనవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. సపోటా పండు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది. ఛాతి పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు ఉన్నప్పుడు, జలుబు తగ్గడానికి స‌పోటా పండ్లు దోహదం చేస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లను తొలగించేందుకు..

మూత్రపిండాల్లో రాళ్లను తొలగించేందుకు..

సపోటాలు మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకాలుగా పనిచేస్తాయి. అలాగే ఇవి మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. సపోటా పండు బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుంది. తద్వారా జీవక్రియను నియంత్రిస్తుంది.

త్వరగా శక్తిని ఇస్తాయి

త్వరగా శక్తిని ఇస్తాయి

గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే సపోటా అతి సులువుగా జీర్ణమవుతుంది. ఇవి శరీరానికి తొందరగా శక్తినందిస్తాయి. సపోటాలో విటమిన్‌-ఎ అధికపాళ్లలో ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. నడివయస్కులు తరచూ సపోట పళ్లు తినడం వల్ల కంటి రుగ్మతలకు గురికాకుండా ఉండవచ్చు.

అధికశాతం కార్బోహైడ్రేట్స్‌

అధికశాతం కార్బోహైడ్రేట్స్‌

సపోటాలో కాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల గట్టిదనానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

సపోటాలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి కాపాడుతుంది. ఇందులో అధికశాతం కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో సపోటాను తీసుకోవటం మంచిది అంటున్నారు నిపుణులు. సపోటాలు తినటం వల్ల వికారం తగ్గుతుంది.

దంతాల ఆరోగ్యానికి

దంతాల ఆరోగ్యానికి

సపోటా ఉడికించిన నీళ్లు డయేరియాను అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతుతున్నారు. సపోటా తినటం వల్ల శ్లేష్మం శరీరం నుంచి బయటకు వస్తుంది. జలుబు, దగ్గు తగ్గిపోతాయి. దీంతో పాటు ఒత్తిడిని తగ్గించే గుణం సపోటాకు ఉంది. కిడ్నీల ఆరోగ్యానికి సపోటా ఉపయోగపడుతుంది. అంతేనా దంతాల ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి.

సపోటా విత్తనాలూ కూడా..

సపోటా విత్తనాలూ కూడా..

క్యాన్సర్‌ కణాల వృద్ధిని అరికట్టడంలోనూ సపోటాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. సపోటా విత్తనాలూ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కీటకాలు కుట్టిన చర్మభాగంపై ఈ విత్తనాల పేస్ట్‌ పట్టిస్తే నొప్పి తగ్గిపోతుంది. సపోటా విత్తనాల నూనె జుట్టు ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది.

సపోట పోషక విలువలుల

సపోట పోషక విలువలుల

నీరు-75 గ్రా., కార్బొహైడ్రేట్లు-22 గ్రా., కాల్షియం-28 గ్రా., పాస్ఫరస్‌-27 మి.గ్రా., కెరోటిన్‌-97 మై.గ్రా., పీచు 3గ్రా., విటమిన్‌ సి-6 మి.గ్రా., శక్తి-98 కేలరీలు లభిస్తాయి. ఇది జీర్ణశక్తికి మలబద్ధక నివారణకు, ఎముకల పటిష్టానికి, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

English summary

15 incredible sapota chiku benefits from boosting energy to bone health

15 incredible sapota chiku benefits from boosting energy to bone health