For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడదెబ్బను కూడా అబ్బా అనిపించే సబ్జా గింజలు.. వేసవిలో ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించాలి

వేసవి వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జాగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. అందులో కాస్తంత నిమ్మరసాన్ని కలిపి తాగితే చాలు. శరీరాన్ని చల్లబరచడమే కాదు, బరువు తగ్గుతారు.

|

వేసవిలో వడదెబ్బకు చెక్‌ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరం డీ-హైడ్రేట్‌ కాదు. అందుకే సబ్జా గింజలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బాసిల్ గింజలు

బాసిల్ గింజలు

కొందరు బహుశా సబ్జా గింజలు లేదా తుక్మారియా గింజలు పేరు విని వుండరు. కానీ బాసిల్ విత్తనాలు ఈజీగా గుర్తుపడతారు. వీటినే సబ్జా గింజలు అంటారు. బాసిల్ గింజలు చియా విత్తనాల వలె మంచి సారూప్యత కలిగి ఉంటాయి, ఫైబర్ని బాగా కలిగి వుంటాయి. సుమారుగా 350 BC ప్రారంభంలో బాసిల్ ఆసియా, ఆఫ్రికాలో వీటి వాడకం మొదలుపెట్టారు. గ్రీసు యోధుడు అలెగ్జాండర్ ది గ్రేట్ వీటిని ఉపయోగించేవారు.

వడదెబ్బ నుంచి

వడదెబ్బ నుంచి

వేసవి వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జాగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. అందులో కాస్తంత నిమ్మరసాన్ని కలిపి తాగితే చాలు. శరీరాన్ని చల్లబరచడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. ఈ నీటిని రోజుకు మూడు, నాలుగుసార్లు వేసవిలో తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

బరువు తగ్గుతారు

బరువు తగ్గుతారు

అధిక బరువును నియంత్రణలోకి తెచ్చుకునేందుకు చాలా తంటాలు పడుతుంటారు. సబ్జా గింజలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే బరువు తగ్గుతారని వైద్యులు అంటున్నారు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.

టైప్‌ 2 మధుమేహం

టైప్‌ 2 మధుమేహం

ఈ నీరు బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వ్యర్థాలను తొలగించడానికి

వ్యర్థాలను తొలగించడానికి

ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కడుపునిండిన భావన

కడుపునిండిన భావన

సబ్జా గింజల్ని నీటిలో వేయగానే ఉబ్బి, జెల్‌లా మారుతాయి. ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి.. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు.

ఔషధగుణాలు ఎక్కువ

ఔషధగుణాలు ఎక్కువ

సబ్జ గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

రక్తాన్ని శుద్ధి చేయడంలో

రక్తాన్ని శుద్ధి చేయడంలో

తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!

శ్వాస బాగా ఆడుతుంది

శ్వాస బాగా ఆడుతుంది

శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

నానబెట్టి నేరుగా తినేయండి

నానబెట్టి నేరుగా తినేయండి

క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి.గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్నాయా..? ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

బీపీ పెరుగుతోందా

బీపీ పెరుగుతోందా

బీపీ మాటిమాటికీ పెరుగుతోందా..? అయితే సబ్జా గింజల్ని కచ్చితంగా తీసుకోవాల్సిందే.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. వీటిలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

రోజూ రాత్రి పడుకునే ముందు

రోజూ రాత్రి పడుకునే ముందు

బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.

చికెన్ పాక్స్

చికెన్ పాక్స్

ఇక సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

ధనియాల రసంతో ఇస్తే

ధనియాల రసంతో ఇస్తే

అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

కెలొరీలు కూడా చాలా తక్కువ

కెలొరీలు కూడా చాలా తక్కువ

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఆహారం తీసుకునే ముందు గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను వేసుకుని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కెలొరీలు కూడా చాలా తక్కువ.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి

వీటిలో విటమిన్లూ, పోషకాలూ, ఇనుమూ ఎక్కువగా ఉంటాయి. చిన్న కప్పు సబ్జా గింజలను తరచూ తీసుకోవడం వల్ల కావాల్సినంత ఇనుమూ, పోషకాలూ శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి సొంతమవుతుంది.సబ్జా గింజల‌ను రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. వీటిలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

శ్వాస కూడా బాగా ఆడుతుంది

శ్వాస కూడా బాగా ఆడుతుంది

రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

English summary

surprising health benefits of sabja seeds

surprising health benefits of sabja seeds
Story first published:Wednesday, May 2, 2018, 17:59 [IST]
Desktop Bottom Promotion