For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముసలితనం రానివ్వని కరక్కాయ! దీంతో వచ్చే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి

క‌ర‌క్కాయ‌ను సంస్కృతంలో హరిత‌కి అంటారు. కరక్కాయ వాత తత్వంపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది. బలం కలిగిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. కరక్కాయ ప్రయోజనాలు, కరక్కాయ లాభాలు.

|

క‌ర‌క్కాయ‌ను సంస్కృతంలో హరిత‌కి అంటారు. కరక్కాయ వాత తత్వంపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది. బలం కలిగిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, పైల్స్‌, వాంతులు, అసిడిటీ, గ్యాస్‌, నేత్ర స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

మజ్జిగలో ఒక చెంచా కరక్కాయ పొడి కలిపి, రోజూ భోజనానికి ముందు సేవిస్తే స్థూలకాయం తగ్గుతుంది. ఞ భోజనానికి గంట ముందు, 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో అంతే సమానంగా బెల్లం కలిపి, సేవిస్తే రక్తమొలలు తగ్గిపోతాయి. ఞ 5 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని 3 గ్రాముల తేనెతో, రోజూ రెండు పూటలా సేవిస్తూ చప్పిడి ఆహారాన్ని తీసుకుంటే, పచ్చకామెర్లు త్వరగా తగ్గేందుకు దోహదపడుతుంది.

కోరింత దగ్గు తగ్గిపోతుంది

కోరింత దగ్గు తగ్గిపోతుంది

అరస్పూను కరక్కాయ చూర్ణం, అందులో సగం పిప్పలి చూర్ణం కలిపి, ఒక గ్రాము తేనెతో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సేవిస్తే, కోరింత దగ్గు తగ్గిపోతుంది. పసుపు రసాన్ని ఇనుప పాత్రలో వేడి చేస్తూ, అందులో కరక్కాయ పొడి వేసి బాగా కలిపి, లేపనంగా వేస్తే గోరుచుట్టు వ్యాధి తగ్గుతుంది.

ప‌చ్చ కామెర్లు త‌గ్గుతాయి

ప‌చ్చ కామెర్లు త‌గ్గుతాయి

క‌ర‌క్కాయ పొడిని 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనె క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా 10 రోజుల పాటు తీసుకుంటే ప‌చ్చ కామెర్లు త‌గ్గుతాయి. భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ పొడిని కొంచెం బెల్లంతో కలిపి తీసుకుంటే రక్త మొలలు తగ్గిపోతాయి.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరాలు తగ్గుతాయి. కరక్కాయ పొడిని ఆముదంలో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.

ఆయాసం, ఎక్కిళ్లు

ఆయాసం, ఎక్కిళ్లు

ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర టీ స్పూన్‌ చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి.ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయని లేక కరక్కాయ పొడిని వేసి ఉడికించి తీసుకోవాలి.

రెండుపూటలా తీసుకోవాలి

రెండుపూటలా తీసుకోవాలి

ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి.

పూటకు అర టీస్పూన్ మోతాదులో

పూటకు అర టీస్పూన్ మోతాదులో

రక్తహీనతతో బాధపడేవారు కరక్కాయ‌లను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

చప్పరించి నీళ్లు తాగాలి

చప్పరించి నీళ్లు తాగాలి

కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది. కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు, పిప్పళ్లు చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండు పూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది.

వాపు తగ్గుతుంది

వాపు తగ్గుతుంది

కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది. కరక్కాయ పిందెల చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది.

కడుపులో దోషం లేకుండా ఉంటుంది

కడుపులో దోషం లేకుండా ఉంటుంది

సానరాయిమీద కొద్దిగా నీళ్లు చల్లుతూ గంధం మాదిరిగానే కరక్కాయ రసం తీసి, రెండు టీస్పూన్ల రసానికి టీస్పూను తేనె వేసి కలిపి పరగడుపున పసిపిల్లలకు టీస్పూను చొప్పున కాస్త పెద్ద పిల్లలకు రెండు టీస్పూన్ల చొప్పున తాగిస్తే, కడుపులో దోషం లేకుండా ఉంటుంది.

జలుబూ జ్వరాలు రావు

జలుబూ జ్వరాలు రావు

ఒకటి నుంచి ఐదేళ్ల వరకూ క్రమం తప్పక ఇస్తే రోగనిరోధకశక్తి పెరిగి వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటారట. మూడేళ్లలోపు పిల్లలకు చిటికెడు పొడినీ ఆరేళ్లలోపు పిల్లలకు రెండు చిటికెల పొడినీ మరిగించి ఇవ్వాలి. పెద్దవాళ్లయితే అరటీస్పూను పొడి వరకూ రోజూ తీసుకుంటే. జలుబూ జ్వరాలు తరచూ రాకుండా ఉంటాయి.

చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది

చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది

కరక్కాయ పొడిని ఆముదంతో కలిపి తాగితే, ఆర్థ్రయిటిస్‌ నొప్పులు తగ్గుముఖం పడతాయి.కరక్కాయలోని బెబులిన్‌ అనే పదార్థం కడుపునొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. మొటిమలూ చర్మవ్యాధులకీ కూడా ఔషధంలా పనిచేస్తుంది. నాలుక రుచి మొగ్గల్ని కోల్పోయిన సందర్భాల్లో దీని కషాయాన్ని పుక్కిలిపడితే సాధారణ స్థితికి వస్తుంది.

తేన్పుల్నీ నియంత్రిస్తుంది

తేన్పుల్నీ నియంత్రిస్తుంది

కరక్కాయను నమిలి తింటే, ఆకలిని పెంచుతుంది. దీన్ని కొద్దిగా వేయించి తింటే త్రిదోషహరిణిగా పనిచేస్తుంది.ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆమ్లగుణాన్నీ తేన్పుల్నీ నియంత్రించడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ కషాయాన్ని పుక్కిలి పట్టడం వల్ల నోటిపుండ్లూ దంత సమస్యలూ తగ్గుముఖం పడతాయి.

రక్తంలో చక్కెర శాతం పెరగకుండా

రక్తంలో చక్కెర శాతం పెరగకుండా

మధుమేహుల్లో ఇన్సులిన్‌ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చేస్తుందట.అయితే మధుమేహులు దీన్ని దీర్ఘకాలంపాటు వాడకూడదు. ఇది రక్తంలో చక్కెరశాతాన్ని బాగా తగ్గించేయగలదు. కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరి.

వ్యాధులు దరిచేరవు

వ్యాధులు దరిచేరవు

శరీరం, ఆత్మ, బుద్ధిని క్రమబద్ధీకరించడంలో కరక్కాయ భేష్‌గా పనిచేస్తుంది. కరక్కాయను తీసుకుని.. లోపల వుండే గింజలను తీసేసి.. బాగా పొడి కొట్టుకోవాలి. అలా పొడి చేసుకున్న కరక్కాయ పొడిని రోజూ ఓ స్పూన్ రాత్రి ఆహారం తీసుకున్నాక తీసుకుంటే వ్యాధులు దరిచేరవు.

త్రిఫలచూర్ణాన్ని రోజూ సేవించాలి

త్రిఫలచూర్ణాన్ని రోజూ సేవించాలి

అలాగే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని ప్రతి రోజూ సేవించాలి. త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఋతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. ఋతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడడం మంచిది. త్రిఫలా చూర్ణం గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

ముసలితనం త్వరగా రాదు

ముసలితనం త్వరగా రాదు

కళ్ళు, చర్మ ఆరోగ్యానికి మంచిది. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు క్రమం తప్పక తీసుకుంటే, జుట్టు అంత త్వరగా తెల్లగా మారదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీని ప్రభావం వల్ల ముసలితనం త్వరగా రాదు. జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో త్రిఫల చూర్ణం చక్కగా ఉపకరిస్తుంది. ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.

కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి

కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి

పిప్పళ్లు, మోడి, శొంఠి ఈ మూడింటిని సమ భాగాలు విడివిడిగా తీసుకుని.. వేయించుకోవాలి. ఆ తర్వాత మెత్తగా దంచి చూర్ణం చేయాలి. 50 గ్రాముల చూర్ణానికి 400 గ్రాముల పెరుగు, 400 గ్రాముల నువ్వుల నూనె కలపాలి.పెరుగు తడి అంతా ఆరిపోయి, నూనె మాత్రమే మిగిలే దాకా పొయ్యి, మీద మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి. దీన్ని వడగట్టి, భద్రపరుచుకుని నొప్పులు ఉన్న చోట మర్ధన చేసి, ఉప్పు కాపడం పెడితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వాతం నొప్పులు తొలగిపోతాయి

వాతం నొప్పులు తొలగిపోతాయి

అలాగే కరక్కాయ గింజలు తీసివేసి, మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి, 60 గ్రాముల మెత్తని సైందవ లవణాన్ని కలిపి, మజ్జిగతో తీసుకుంటే వాతం నొప్పులు తొలగిపోతాయి. ఒక గ్లాసు చిక్కటి గంజిలో ఒక చెంచా శొంఠిపొడి, కలిపి కొంచెం ఉప్పు వేసుకుని తాగుతూ వుంటే.. కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

త్రికటు చూర్ణం

త్రికటు చూర్ణం

శొంఠి, పిప్పళ్లు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని ''త్రికటు చూర్ణం'' అంటారు. ఒక చెంచా పరిమాణంలో ఈ చూర్ణం తీసుకుని, కొంచెం ఉప్పు కలిపేసుకుని, రోజూ పెరుగుతో కలిపి తింటూ వుంటే మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

English summary

25 amazing health benefits of terminalia chebula or haritaki

25 amazing health benefits of terminalia chebula or haritaki
Story first published:Friday, May 25, 2018, 16:41 [IST]
Desktop Bottom Promotion