For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాగి అంబలి తాగితే.. మగవారికి వీర్యం వద్దన్నా పెరిగిపోతూ ఉంటుంది.. రాగి అంబలితో వంద రకాల ప్రయోజనాలు

రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. యువకులు, పెళ్లి చేసుకున్న వారు రోజూ రాగి అంబలి తాగితే వీర్యం బాగా పెరిగిపోతుంది. సెక్స్ లో బాగా పాల్గొని త్వరగా పిల్లల్ని కనొచ్చు.

|

మిల్లెట్ లేదా రాగులు అని సాధారణంగా రెగ్యులర్‌గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు.

పుష్టికరమైన ధాన్యం

పుష్టికరమైన ధాన్యం

రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం. రాగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ద్రవ యాసిడ్‌ను పెరుగుతుంది. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్ళు (మూత్రమార్గంలో రాళ్ళు )ఉన్నవారికి వీటిని తినమని సలహా ఇవ్వడం లేదు.

ఎన్నో పోషక పదార్థాలు

ఎన్నో పోషక పదార్థాలు

రాగులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటమే. రాగలి సంగటి ఆరగించడం లేదా రాగి అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రాగితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. రాగులతో తయారు చేసే అంబలి వల్ల కలిగే మేలు పరిశీలిద్ధాం.

బరువును నియంత్రణ

బరువును నియంత్రణ

రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

ఎముకల పటుత్వానికి

ఎముకల పటుత్వానికి

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

చక్కని ఔషధంగా

చక్కని ఔషధంగా

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి

కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.

రక్తహీనత తగ్గిస్తుంది

రక్తహీనత తగ్గిస్తుంది

రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

వృద్ధాప్యం దూరం

వృద్ధాప్యం దూరం

మిల్లెట్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు, వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

టానిక్ వంటిది

టానిక్ వంటిది

హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి. రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం,అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్ వంటిది.

కాలేయవ్యాధులు

కాలేయవ్యాధులు

కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.అలాగే రాగుల్లో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. అవి మ‌న శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

రాగి అంబలి

రాగి అంబలి

రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు

యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు

ప్ర‌తి రోజూ ఉద‌యం చేసే సాధార‌ణ అల్పాహారానికి బ‌దులుగా రాగి అంబ‌లి తాగితే దాంతో మ‌నం రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. శారీర‌క దృఢ‌త్వం చేకూరుతుంది. బీపీ, షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ర‌క్త‌స్రావం జ‌రుగుతున్న వారికి రాగి అంబ‌లి తాగిస్తే స్రావం ఆగిపోతుంది.

వీర్యం వృద్ధి

వీర్యం వృద్ధి

రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. యువకులు, పెళ్లి చేసుకున్న వారు రోజూ రాగి అంబలి తాగితే వీర్యం బాగా పెరిగిపోతుంది. సెక్స్ లో కూడా బాగా పాల్గొని త్వరగా పిల్లల్ని కనొచ్చు. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. చ‌దువుల్లో బాగా ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తారు. మెద‌డు చురుగ్గా ఉంటుంది. రోజూ రాగి జావ తీసుకుంటే పిల్లలు పుష్టిగా పెరుగుతారు. వారి ఎముకలు బలంగా మారుతాయి.

టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి

టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి

రాగి అంబలిలతో అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్, ఫైబర్ వుండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది.

తీపి రాగి జావ

తీపి రాగి జావ

28 రోజులు నిండిన పిల్లలకు రాగి జావను పెడుతుంటారు. ఈ జావలో పిల్లలకు పోషకాలు అందటం ద్వారా ఆరోగ్యంగా వుంటారు. ఐతే మోతాదుకు మించి రాగి జావను ఇవ్వరాదు.

తీపి రాగి జావను ఎలా తయారు చేయాలి

తీపి రాగి జావను ఎలా తయారు చేయాలి

కావలసినవి:

రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు - రెండున్నర కప్పులు, పంచదార- రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి- రెండు టీ స్పూన్లు, యాలకల పొడి, శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమపువ్వు చిటికెడు, నెయ్యి లేదా వెన్న ఓ టీ స్పూన్.

తయారు చేయడం

తయారు చేయడం

సాస్ పాన్లో నెయ్యి వేడి చేసిన తర్వాత రాగి పిండి వేసి ఓ మాదిరి మంటపై వేగించాలి. పిండి రంగు మారి వేగించిన వాసన రాగానే మంట తగ్గించి అందులో నీళ్లు పోయాలి. పిండి వుండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ వుండాలి.

రాగి జావను వడగట్టి తాగేయాలి

రాగి జావను వడగట్టి తాగేయాలి

రాగి పిండి మిశ్రమం చిక్కపడేవరకూ రెండుమూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పాలు పోసి గరిటెతో తిప్పుతూ వుండలు కట్టకుండా తిప్పుతూ వుండాలి. పంచదార, యాలకల పొడి, కుంకుమ పువ్వు, బాదం పొడి వేసి ఓ మాదిరి మంట మీద మిశ్రమం మరికాస్త చిక్కబడేవరకూ ఉడికించాలి.ఈ తీపి రాగి జావను వడగట్టి తాగేయాలి.

రాగి అంబలి

రాగి అంబలి

ఇక రాగికి చలువ చేసే లక్షణం ఉండటంతో దీంతో తయారు చేసుకున్న పదార్థం ఏదైనా మంచిదే. రాగి అంబలి వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రాగి అంబలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

రాగి పిండి అరకప్పు, ఉల్లి తరుగు అరకప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, జీలకర్ర పొడి ఒక చెంచా, కరివేపాకు ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర 2 చెంచాలు, మజ్జిగ రెండు కప్పులు, ఉప్పు తగినంత.

తయారు చేయు విధానం

తయారు చేయు విధానం

ఒక గిన్నెలో అర లీటరు నీటిని తీసుకుని మరిగించాలి. అంతలోపు ఒక కప్పు నీళ్లలో అర కప్పు రాగి పిండిని లూజ్‌గా కలుపుని మరిగే నీటిలో పోసి బాగా కలుపాలి. 6 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. ఉడుకుతున్నంత సేపు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. తరువాత కిందకు దింపి పూర్తిగా చల్లార్చాలి.

చాలా సులభం

చాలా సులభం

ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర పొడి, మజ్జిగ, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకును ఒక మిశ్రమంగా చేసి చల్లారిన రాగి అంబలిలో కలుపాలి. అంతే రాగి అంబలి రెడీ. ఒక మట్టి కుండాలో పెట్టుకుని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తయారు చేయ‌డం కూడా చాలా సులభం. ఇంకేం.. మీరు ట్రై చేయండి.

English summary

29 amazing benefits of millets for skin and health

29 amazing benefits of millets for skin and health
Story first published:Tuesday, May 1, 2018, 11:53 [IST]
Desktop Bottom Promotion