Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్‌ఫుల్.!
ఆధునిక జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా కనబడుతోంది. ముఖ్యంగా పురుషుల్లో ఈ మార్పులను ఎక్కువగా చూడవచ్చు. ఐటీ, మార్కెటింగ్, హాస్పిటాలిటీ, ఫార్మా ఇలా రంగం ఏదైనా శారీరక శ్రమ తగ్గి బలం కోల్పోతున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, బైక్‌పై సుదూర ప్రయాణాలు, రసాయనాలు, వేడికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం ఇలా పలు కారణాల వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఎనర్జీ కోసం వివిధ మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు.

ఎలాంటి కెమికల్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆయుర్వేద, సహజ వైద్య పద్ధతిలో పురుషుల్లో సహజంగా శక్తిని పెంచి, ఉత్సాహాన్ని అందించే అద్భుత ఔషధం శిలాజిత్. ఇది హిమాలయాలు, ఆల్ఫ్ వంటి పర్వత ప్రాంతాల్లో శిలల నుంచి దొరుకుతుంది. కానీ ఆ శిలాజిత్ కంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం మరొకటి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే 'లుకుమ’ ఫలం. ఈ పండు ప్రయోజనాలేంటి.? ఇక్కడ చూద్దాం.
పోషకాల ఫలం
చాలా అరుదుగా దొరికే పండు 'లుకుమ’ను సూపర్ ఫుడ్‌గా ఆరోగ్య నిపుణులు పిలుస్తున్నారు. ఇది పురుషుల్లో ఆరోగ్యం, బలం, శక్తిని పెంచడానికి శిలాజిత్‌కు ఎంతో ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ పండు దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో లభిస్తుంది. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ బి3, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు తెలిపారు. ఈ పండు తినడం ద్వారా శరీరానికి సహజమైన శక్తి అందడంతో పాటు, నీరసాన్ని సైతం తగ్గిస్తుంది.
పెరుగుతున్న ఆదరణ
అందుకే మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఈ కాలంలో ఈ పండుకు ప్రజాదరణ పెరిగింది. ముఖ్యంగా ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం రెగ్యులర్ జిమ్‌కి వెళ్లేవారు లుకుమా పండ్లను సప్లిమెంట్స్‌ను తీసుకుంటారు. ఈ పండు దక్షిణ అమెరికాలో పండటం ద్వారా.. ఇక్కడ సప్లిమెంట్స్ రూపంలో ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. స్మూతీలు, పౌడర్లు, ఆరోగ్యకరమైన డెజర్ట్‌ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం ద్వారా మెటబాలిజం మెరుగుపడటంతో పాటు ఎక్కువసేవు ఎనర్జీగా ఉండటానికి దోహదపడుతుంది.
అదుపులో మధుమేహం
అంతేకాకుండా లుకుమా పండ్లు సహజంగా తీపిగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరానికి హాని చేసే చక్కెర బదులుగా వీటిని తీసుకోవడం ద్వారా జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది. అయితే లుకుమా పండ్లను తీసుకునే ముందు వైద్యుడి సలహా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. శిలాజిత్, లుకుమా వంటి పండ్లను తీసుకునేముందు ముందుగా ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications