For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషాంగంపై, యోనిపై పులిపిర్లు వస్తే ఏం చెయ్యాలి?

తొలగించిన పులిపిర్లు తిరిగి రాకుండా ఉండాలంటే పీహెచ్‌ తక్కువ శాతం ఉన్న సబ్బులు వాడాలి. అలాగే యాంటీబయోటిక్‌ క్రీములు రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మచ్చలూ పడవు. ఆ తరవాత సన్‌స్క్రీన్‌ వాడాలి.

|

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పులిపిరికాయల్లాంటివి వచ్చి, మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి పురుషాంగంపై, యోనిపై కూడా పులిపిర్లు వస్తుంటాయి. ఇవి అంత ప్రమాదమేమీ కాకపోయినా, వీటిని తొలగించుకోవడానికి ఎక్కువమంది ప్రయత్నిస్తారు. సైడ్‌ ఎఫెక్ట్‌లు కలిగించే మందులు కాకుండా, సహజ సిద్ధమైన పదార్థాలతో వాటిని ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం.

వెల్లుల్లి రసం రాయడం

వెల్లుల్లి రసం రాయడం

పులిపిర్లు అనేవి ఎక్కువగా చర్మం విడిపోయే చోట వస్తుంటాయి. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య. కొందరికి కళ్ల దగ్గరా, కనురెప్పలపైనా కనిపిస్తాయి. వాటిని పోగొట్టేందుకు టూత్‌పేస్టు అద్దడం, వెల్లుల్లి రసం రాయడం వంటివి చేస్తుంటారు. ఈ చికిత్సలేవీ పనిచేయడం అటుంచితే చర్మం కాలినట్లు అవుతుంది. ఒక్కోసారి రక్తస్రావమై సమస్య పెరుగుతుంది.

చర్మం ఎర్రగా మారడం

చర్మం ఎర్రగా మారడం

వైద్యుల్ని సంప్రదిస్తే ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందుతుంది. పార్లర్లలో చికిత్స చేసి వీటిని తొలగించినప్పుడు ఆ భాగంలో మచ్చలు పడటం, చర్మం ఎర్రగా మారడం, ఒక్కోసారి పుండు పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. అదే చర్మ నిపుణుల పర్యవేక్షణలో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా తీసేస్తారు. కానీ ఆ చికిత్స తరవాత ఎండలోకి వెళ్లకూడదు. మచ్చలు రావచ్చు.

సన్‌స్క్రీన్‌ వాడాలి

సన్‌స్క్రీన్‌ వాడాలి

అలా తొలగించిన పులిపిర్లు తిరిగి రాకుండా ఉండాలంటే పీహెచ్‌ తక్కువ శాతం ఉన్న సబ్బులు వాడాలి. అలాగే యాంటీబయోటిక్‌ క్రీములు రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మచ్చలూ పడవు. ఆ తరవాత సన్‌స్క్రీన్‌ వాడాలి. పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్నవారికి పులిపిర్లు తొలగించాలంటే ఆరు వారాల ముందు నుంచే చర్మాన్ని ఆ చికిత్సకు సిద్ధం చేయాలి.

యాంటీబయోటిక్‌ క్రీం

యాంటీబయోటిక్‌ క్రీం

అంటే ముందు మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌, లైటనింగ్‌ క్రీములు సూచిస్తారు వైద్యులు. ఆ తరవాత చికిత్స చేస్తారు. అదయ్యాక కూడా యాంటీబయోటిక్‌ క్రీంలు వాడితే మచ్చలు పడవు. ఇవేవీ లేకుండా కేవలం పులిపిర్లే సమస్య అయితే గంటముందు క్రీంలు రాసి, ఆ భాగంలో మత్తుమందు ఇచ్చి తొలగిస్తారు.

నొప్పి తక్కువగా ఉంటుంది.

నొప్పి తక్కువగా ఉంటుంది.

నొప్పి తక్కువగా ఉంటుంది. గర్భిణులు మాత్రం ఇలాంటి చికిత్సలేవీ చేయించుకోకూడదు. మీరు ఏ ప్రయోగాలు చేయకుండా చర్మ వైద్యనిపుణులను సంప్రదించండి. మీకున్న పులిపిర్లను బట్టి ఏం చేయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు. వాటిని ఎట్టిపరిస్థితుల్లో గిల్లకూడదు.

ఆముదం

ఆముదం

ఇక పులిపిర్లను తొలగించుకోవడానికి కొన్ని హోం రెమిడీస్ ఉన్నాయి.కొద్దిగా బేకింగ్‌ సోడాను తీసుకుని ఆముదంలో కలపాలి. ఈ మెత్తని పేస్ట్‌ను పులిపిర్లు ఉన్న భాగంపై మాత్రమే కొద్దిగా రాయాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసిన తరువాత సూదితో గుచ్చినట్లు అనిపిస్తుంది. ఆ తీవ్రత ఎక్కువగా ఉంటే పాటించకపోవడమే మంచిది.

నిమ్మరసం

నిమ్మరసం

చర్మ సంరక్షణకు నిమ్మరసం బాగా ఉపయోగ పడుతుంది. చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు నిమ్మలో ఉన్నాయి. కొద్దిగా నిమ్మరసాన్ని పులిపిరులపై రాసి, రాత్రంతా అలాగే వదిలేయాలి. రోజూ ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌

ఓ కాటన్‌ బాల్‌ను తీసుకుని యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై రాయాలి. ఈ పద్ధతిలోనూ కొద్దిగా పిన్‌తో గుచ్చినట్టు అనిపిస్తుంది. కానీ దాని నుంచి వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయల్ని తీసుకుని, గ్లాస్‌ ఉప్పు నీటిలో కొంతసేపు నానబెట్టాలి. అనంతరం ఆ నీటిని చర్మ భాగాలపై రాసి, పరిశుభ్రమైన గుడ్డతో కప్పేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారం పాటు ప్రతిరోజూ రాత్రి ఇలా చేస్తే పులిపిరులు దూరమవుతాయి. ఏదేమైనా ఇలాంటివారికి వైద్యసలహానే ఉత్తమం.

అల్లం ముక్కను సున్నంలో తడిపి

అల్లం ముక్కను సున్నంలో తడిపి

అరటి తొక్కను చిన్న ముక్కగా కట్ చేసి పులిరిపై అతికించాలి. ఆలా అతికించిన అరటి తొక్క పోకుండా దానిపై ప్లాస్టర్ వేసి అతికించాలి. అలా రాత్రంతా ఉంచి పొద్దున్నే తీసివేయాలి.విటమిన్ ‘సీ' కలిగిన ఉసిరి గుజ్జును రాయడం వలన పులిపిరి రాలిపోతుంది.బొప్పాయి పాలు కూడా పులిపిరి నివారణకై వాడవచ్చు.

అలాగే అల్లం ముక్కను సున్నంలో తడిపి పులిపిరిపై పెట్టాలి. కానీ, సున్నం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని నివారించడానికి శరీరాన్ని ఎప్పుడు పొడిగా ఉండనివ్వాలి. స్నానం చేసిన తరువాత శరీరాన్ని చక్కగా తుడుచుకోవాలి. తడిగా ఉన్న సాక్సులను వాడకూడదు. పులిపిర్లను గిచ్చకూడదు. ఆముదాన్ని పులిపిర్లపైనా రాస్తే ఫలితం ఉంటుంది. ఇలా తరచు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి.

తులసి ఆకులు

తులసి ఆకులు

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న తులసి.. పులిపిర్లను శాశ్వతంగా తొలిగిస్తాయి. గుప్పెడు తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. కొన్ని నీళ్లు కలిపి పేస్టులా చేసి పులిపిర్ల మీద పెట్టి, ఇరువై నిమిషాల తర్వాత కడిగేయాలి.

కొన్నాళ్లపాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ పౌడర్ కూడా పులిపిర్ల నివారణకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పవర్‌ఫుల్ బ్యాక్టీరియల్ లక్షణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

చిటికెడు బేకింగ్ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కని పేస్టులా చేయాలి. ఈ పేస్టును పులిపిర్లపై ఐప్లె చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం కనిపిస్తుంది. పులిపిర్లను తొలిగించేందుకు మరో సహజమైన ఔషధం టీట్రీ ఆయిల్. పులిపిర్లకు కారణమయ్యే వైరస్‌ను అరికట్టడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

రెండు, మూడు చుక్కల టీట్రీ ఆయిల్‌ను అర టీస్పూన్ కొబ్బరినూనెలో కలుపాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో ఐప్లె చేసి, కొంత సేపటి తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. ఇటా రోజూ చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. నారింజ పండు తొక్కలో ఉండే విటమిన్ సి కంటెంట్ పులిపిర్లను తొలిగించేందుకు అద్భుతమైన ఔషధం.

English summary

home remedies to get rid of warts on face neck hands fingers

home remedies to get rid of warts on face neck hands fingers
Desktop Bottom Promotion