గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే: ఫుడ్ సేఫ్టీ కి హ్యాండ్ హైజీన్ అనేది ఎందుకంత ముఖ్యం?

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే: ఫుడ్ సేఫ్టీ కి హ్యాండ్ హైజీన్ అనేది ఎందుకంత ముఖ్యం?

అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్ వాషింగ్ డే గా పరిగణించారు. ఫుడ్ హైజీన్ ను పాటించడం అలాగే హైజీన్ గా ఉండటం వంటి అంశాలను ఈ హ్యాండ్ వాషింగ్ డే నాడు మరింత గట్టిగా చెప్తారు. హ్యాండ్ వాషింగ్ అనేది ముఖ్యమైన హైజీన్ టెక్నీక్. అనారోగ్యం పాలు కాకుండా ఈ రోజు మనల్ని రక్షిస్తుంది.

సరైన హ్యాండ్ వాషింగ్ టెక్నీక్ కి గల ప్రాధాన్యత ఏంటి?

చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వలన క్రిములు స్ప్రెడ్ అవడం తగ్గుతుంది. తద్వారా, అనారోగ్యానికి గురికావడం తగ్గుతుంది. సోప్ తో హ్యాండ్ వాష్ ని సరిగ్గా చేసుకోకపోతే అనేక ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎదురవుతుంది. చర్మ సమస్యలు కూడా ఎదురవుతాయి. తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం వలన ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన యాక్టివిటీస్ కి ముందు తరువాత హ్యాండ్ వాష్ చేసుకోవడం వలన బాక్టీరియా మరియు వైరస్ ల విస్తరణను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

The Importance of Hand Washing in the Food Industry

చేతులను కడుక్కోకపోతే ఎటువంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది?

వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ - నోరోవైరస్ ల ద్వారా కలిగే ఈ వ్యాధి అనేది చేతులను శుభ్రంగా కడగకపోవడంతో ఎదురవుతుంది. డయేరియా కలుగుతుంది. పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి అలాగే కీళ్ల నొప్పులు ఎదురవుతాయి.

ఎయిర్ బర్న్ ఇల్ నెస్ - సాధారణ జలుబు, ఇంఫ్లూయెంజా, మెనింగిటిస్ వంటి సమస్యలను ఎయిర్ బర్న్ ఇల్ నెస్ అనంటారు. ఈ వ్యాధుల వలన తలనొప్పి, గ్లాండ్స్ వాపు, తుమ్ములు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు అలాగే తుమ్ముల సమయంలో చేతులు తరచూ బాడీ ఫ్లూయిడ్స్ తో కాంటాక్ట్ లో ఉండటం వలన హ్యాండ్స్ ను శుభ్రంగా కడుక్కోకపోతే వ్యాధులను అరికట్టడం కష్టం.

నోసికొమియల్ ఇన్ఫెక్షన్స్ - ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరకమైన స్టాఫ్ బాక్టీరియా ద్వారా వ్యాప్తిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ హాస్పటల్స్ లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. స్టాఫ్ మరియు పేషంట్స్ తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోకపోవటం వలన ఈ ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. ఫీవర్, గాయం నుండి డిశ్చార్జ్ రావడం, యూరినేటింగ్ సమయంలో మంట వంటివి ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు.

హెపటైటిస్ ఏ - ఆహారం ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. వంట వండేవారి వలన ఆహారం అనేది కలుషితమవటం జరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

సరైన హ్యాండ్ వాషింగ్ టెక్నీక్

సరైన హ్యాండ్ వాషింగ్ టెక్నీక్

హ్యాండ్ వాషింగ్ సమయంలో సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వారి ప్రకారం ఆరు స్టెప్స్ ను పాటించి తీరాలి.

1. చేతులను శుభ్రమైన రన్నింగ్ వాటర్ లో కడుక్కోవాలి.

2. తగినంత సోప్ ను అప్లై చేసుకొని హ్యాండ్స్ ను బాగా రుద్దుకోవాలి.

3. చేతుల వెనుకవైపు, వేళ్ళ మధ్యలో, గోర్ల మధ్యలో ప్రాధాన్యతనివ్వాలి.

4. ఇరవై సెకండ్ల పాటు హ్యాండ్స్ ను స్క్రబ్ చేసుకోవాలి.

5. రెండు చేతులను రన్నింగ్ వాటర్ కింద బాగా రిన్స్ చేయాలి.

6. శుభ్రమైన టవల్ లేదా ఎయిర్ డ్రయర్ ని వాడి చేతులను డ్రై చేసుకోవాలి.

ఫుడ్ ప్రిపరేషన్ కి ముందు హ్యాండ్ వాషింగ్ అనేది ఎందుకు ముఖ్యమైనది?

ఫుడ్ ప్రిపరేషన్ కి ముందు హ్యాండ్ వాషింగ్ అనేది ఎందుకు ముఖ్యమైనది?

రెస్టారెంట్స్ లో ఫుడ్ వర్కర్స్ వద్ద నుంచి జెర్మ్స్ వ్యాప్తి అనేది ఫుడ్ బర్న్ ఇల్నెస్ కు ప్రధాన కారణంగా తేలింది. నిజానికి, 89 శాతం ఫుడ్ బర్న్ ఇల్ నెస్ అవుట్ బ్రేక్స్ అనేవి ఫుడ్ వర్కర్స్ చేత కలుషితమైన ఆహారం వలన తలెత్తుతోంది. హ్యాండ్స్ ను సరిగ్గా వాష్ చేసుకోవడం వలన వర్కర్స్ హ్యాండ్స్ కున్న జెర్మ్స్ కొంతవరకు తగ్గుతాయి.

యూఎస్ ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) సూచనల ప్రకారం ఫుడ్ ను తయారుచేసే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఫుడ్ ప్రిపరేషన్ సమయంలో గ్లవుసెస్ ను వాడాలి. అలాగే, తిన్న తరువాత, తాగిన తరువాత, టొబాకోని వదిన తరువాత, రా అనిమల్ ప్రోడక్ట్స్ ను ప్రిపేర్ చేసిన తరువాత, డర్టీ ఎక్విప్మెంట్ ని హ్యాండిల్ చేరిన తరువాత హ్యాండ్స్ ను పరిశుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి.

రెస్టారెంట్ మేనేజ్మెంట్ మరియు ఫుడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ అనేవి కలిసి పనిచేసి హ్యాండ్ వాషింగ్ టెక్నీక్స్ ను ఫుడ్ వర్కర్స్ చేత పాటించబడేలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రా మీట్ ను హ్యాండిల్ చేసిన తరువాత ఫుడ్ వర్కర్స్ హ్యాండ్ వాష్ ను చేసుకోవడం తప్పనిసరి. రా మీట్ లో ఉండే ఈ కోలీ బాక్టీరియా వలన గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు తలెత్తుతాయి.

 1. ఆహారాన్ని సురక్షితంగా తయారుచేయడమెలా?

1. ఆహారాన్ని సురక్షితంగా తయారుచేయడమెలా?

ఫుడ్ ను ప్రిపేర్ చేసే ముందు గోరువెచ్చటి నీటితో అలాగే సోప్ తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రా ఫుడ్ ను టచ్ చేసినప్పుడు అలాగే టాయిలెట్ కి వెళ్ళిన తరువాత, పెట్స్ ని మరియు డస్ట్ బిన్ ను టచ్ చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దీని వలన వంటగదిలో అలాగే ఆహారంపై బాక్టీరియా విస్తరణ అనేది అరికట్టబడుతుంది.

2. వర్క్ టాప్స్ ను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి?

2. వర్క్ టాప్స్ ను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి?

ఆహారాన్ని ప్రిపేర్ చేయడానికి ముందు వర్క్ టాప్స్ ను, కిచెన్ యుటెన్సిల్స్ మరియు చాపింగ్ బోర్డ్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. గుడ్డు, రా మీట్ మరియు పౌల్ట్రీ వాష్ తో అవి కాంటాక్ట్ లోకి వస్తే వాటిని బాగా శుభ్రపరచడం ముఖ్యం. డిష్ క్లోత్స్ ను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఆయా మెటీరియల్స్ పై బాక్టీరియా వృద్ధిని అరికట్టవచ్చు. ఈ యాక్టివిటీస్ అయిపోయాక మీ చేతులను బాగా కడుక్కోండి.

3. రా ఫుడ్ ను రెడీ టు ఈట్ ఫుడ్ నుంచి సెపరేట్ గా ఉంచాలి:

3. రా ఫుడ్ ను రెడీ టు ఈట్ ఫుడ్ నుంచి సెపరేట్ గా ఉంచాలి:

ఫిష్, మీట్ మరియు పౌల్ట్రీలో ఉండే బాక్టీరియా సులభంగా ఇతర ఫుడ్స్ పై, వర్క్ టాప్స్, కత్తులు అలాగే చాపింగ్ బోర్డ్స్ పై స్ప్రెడ్ అవుతుంది. అందువలన, రా ఫుడ్స్ ను రెడీ టు ఈట్ ఫుడ్స్ వద్ద పెట్టకండి. వీటిని సెపరేట్ గా ఉంచండి. అలాగే, రా ఫుడ్స్ ను టచ్ చేసిన వెంటనే హ్యాండ్స్ ను వాష్ చేయడం మరచిపోకండి.

ప్రతి సారి, ఆహారాన్ని తీసుకునే ముందు, తరువాత అలాగే ఆహారాన్ని తయారుచేసే సమయంలో హ్యాండ్స్ ను వాష్ చేసుకోవడం ముఖ్యమని గుర్తించండి.

Desktop Bottom Promotion