Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
నిద్రలో ఒక కాలు దుప్పటి బయట ఎందుకు ఉంటుందో తెలుసా? నిద్రలేమితో భాదపడేవాళ్లకు గుడ్ న్యూస్!
రాత్రి చలిగా ఉందని తలదాకా దుప్పటి కప్పుకుంటాం. కానీ కాసేపటికి మనకు తెలియకుండానే ఒక కాలు దుప్పటిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఉదయం నిద్రలేచే సరికి మన కాలు దుప్పటి బయటే ఉంటుంది. ఇది మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి ఎదురైన అనుభవమే. చాలామందికి ఇదొక విచిత్రమైన అలవాటు అనిపిస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల ఏదో తెలియని హాయి కలుగుతుంది, వెంటనే నిద్ర పట్టేస్తుంది.

అసలు మనకి తెలియకుండానే మనం ఇలా ఎందుకు చేస్తాం? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇది కేవలం ఒక సాధారణ అలవాటు మాత్రమే కాదు మన శరీరం తనను తాను రక్షించుకోవడానికి చేసే ఒక అద్భుతమైన మ్యాజిక్. దీని వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మెదడు వేసే మాస్టర్ ప్లాన్
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం మనిషికి ఎలాంటి అవాంతరాలు లేని గాఢమైన నిద్ర పట్టాలంటే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే కొద్దిగా తక్కువగా ఉండాలి. అంటే శరీరం కాస్త చల్లబడాలి. శరీరం వేడిగా ఉంటే మెదడు చురుకుగా ఉండిపోయి, నిద్ర పట్టదు. పదే పదే మెలకువ రావడం, అర్ధరాత్రి అటూ ఇటూ దొర్లడం జరుగుతుంది. అందుకే నిద్రకు ఉపక్రమించేటప్పుడు శరీరాన్ని చల్లబరిచేందుకు మన మెదడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ లో భాగమే ఈ ఒక కాలు బయట పెట్టడం.
అరికాళ్లలో ఉండే న్యాచురల్ థర్మోస్టాట్
మన శరీర నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి.. మన అరిచేతులు, అరికాళ్లలో ఉండే ఆర్టెరియోవీనస్ అనస్టోమోసెస్ అనే ఒక ప్రత్యేకమైన రక్తనాళాల వ్యవస్థ. ఈ రక్తనాళాలు చర్మం ఉపరితలానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి అచ్చం మన ఇళ్లలో ఉండే ఏసీ లేదా థర్మోస్టాట్ లాగా పనిచేస్తాయి. దుప్పటి కప్పుకున్నప్పుడు శరీరంలో వేడి పెరిగితే ఆ వేడిని వాతావరణంలోకి బయటకు పంపడానికి ఈ అరికాళ్లు ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా ఉపయోగపడతాయి.

అసలు లోపల ఏం జరుగుతుంది?
దుప్పటి కప్పుకున్నప్పుడు శరీరంలో వేడి పెరగగానే, మన మెదడుకు బాడీ హీట్ అవుతోంది, వెంటనే చల్లబరచాలి అనే సిగ్నల్ వెళుతుంది. వెంటనే మన ప్రమేయం లేకుండానే ఒక కాలు దుప్పటిలోంచి బయటకు వస్తుంది. గదిలో ఉన్న చల్లటి గాలి అరికాలికి తగలగానే, అక్కడి రక్తనాళాలు చల్లబడతాయి. ఆ చల్లబడిన రక్తం క్షణాల్లో శరీరం అంతటా ప్రసరిస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అయ్యి ఎంతో రిలీఫ్ దొరుకుతుంది. శరీరం కూల్ అవ్వగానే మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఇంక మనల్ని గాఢమైన నిద్ర ఆవహిస్తుంది.
నిద్రలేమికి ఇది బెస్ట్ మెడిసిన్
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ చిన్న టెక్నిక్ ఒక అద్భుతమైన సహజ నివారణగా పనిచేస్తుందని నిద్ర నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మీకు తొందరగా నిద్ర పట్టకపోతే, ఒత్తిడిగా అనిపిస్తే.. రెండు కాళ్లు లేదా కనీసం ఒక కాలును దుప్పటి బయట పెట్టి చూడండి. ముఖ్యంగా ఎండాకాలంలో లేదా ఉక్కపోతగా ఉండే వాతావరణంలో ఈ టెక్నిక్ మీ నిద్ర నాణ్యతను అమాంతం పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications