Latest Updates
-
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!
అతిథులను ఆహ్లాదరపరిచే ముఖద్వారాలు...!

అయితే.. గృహం వెలుపల నుండే కాకుండా.. ఇంటి లోపల కూడా కొన్ని రకాల అడ్డంకులు లేకుండా జాగ్రత్త వహించాలి. ప్రధానగా.. ఇంటికి వచ్చే అతిథులు, చూపరులు గృహం లోపలకి ప్రవేశించగానే చూపరులకు ఆహ్లాదకరంగా ఉండాలి. లోపల ఉన్న వాతావరణం అతిథులనూ ఆకర్షించే విధంగా తయారు చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
ఇందులో భాగంగా.. ప్రధాన ద్వారం ఎదురుగా చీకటి గృహం లేకుండా చూసుకోండి. కొన్ని ఇళ్లలో ప్రధాన ద్వారం తెరువగానే.. ఇంటి మెట్లు లేదా టాయ్‌లెట్ లు దర్శనమిస్తాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాస్తు ప్రకారం వీటిని అమర్చుకోవాలి. మొత్తానికి టాయ్‌లెట్‌లు, మెట్లు ప్రధాన ద్వారానికి నేరుగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే ప్రధాన ద్వారానికి వెలుతురు తగినంత ఉండేలా చర్య తీసుకోవాలి.
అలాగే.. ఇంటిలోపల ప్రధానద్వారానికి అతిదగ్గరగా లేదా ఎదురుగా గాని మరో గోడ లేకుండా చేసుకోవడం మంచిది. ఇది ఇంటిలో నివసించే వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీరు పై విధంగా పేర్కొన్న సమస్యలతో ఇంటిని నిర్మించుకున్నట్టయితే.. కొన్ని సలహాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా.. మెట్లున్నా, టాయ్‌లెట్లు ఉన్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఆ ప్రాంతాన్ని వెలుతురుతో నింపాలి. అలాగే ప్రధాన ద్వారానికి ఎదురుగా పెద్దసైజు అద్దం బిగించడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెపుతున్నారు. దీనివల్ల కొన్ని సమస్యలు దరిచేరవని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంటి వెలుపల ఏవిధంగా తీర్చిదిద్దామో.. లోపలా అదే స్థాయిలో అలంకరించుకోవాలి. బయటి గోడల కంటే ఇంటి లోపలి గోడలపై వాతావరణ మార్పులు అంతగా ప్రభావం చూపలేవు కనుక అంతర్గతంగా గోడలకు వేసే రంగులు వేర్వేరుగా మార్కెట్లో లభ్యమవుతాయి. వీటిలో మనసుకు ఆనందాన్ని కలిగించే రంగులను ఎంచుకోవాలి. అలాగే ఇంట్లోని కిటికీ లకు పరదాలు, గోడలకు పెయింటింగ్‌ల తోపాటు కుటుంబ సభ్యులకు మధుర స్మృ తులను అందించే అల నాటి జ్ఞాపకాలు ఏవై నా ఉంటే అమర్చు కోవడం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరి చినట్లవుతుంది.



Click it and Unblock the Notifications
