Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
అందమైన ఇంటి గార్డెన్ కు...సరైన పూలకుండీల ఎంపిక!

మట్టికుండీ లేదా ఇంటిలో వున్న పాత లేదా కొత్త డబ్బాలు మొక్కలకు అనుకూలమైనవే. అయితే, డబ్బాలైతే వాటికి నీరు బయటకు పోవటానికి కొన్ని రంధ్రాలు అడుగున వుండాలి. ఇవి మొక్క ఎదుగుదలకు సహకరిస్తాయి. కంటైనర్ లేదా డబ్బా సైజు ఎంత వుండాలనేది మొక్క ఎదిగే సైజును బట్టి వుంటుంది. కనీసం మొక్కలో మూడవ వంతైనా డబ్బా వుండాలి. మొక్కలు పెద్దవిగా వుంటే అధిక మన్ను, అధిక నీరు వుండాలి కనుక పెద్ద డబ్బా వుండాలి. చిన్న మొక్కలు కప్పులు, సాసర్లలో కూడా పెంచవచ్చు.
టెర్రకోటా కుండీలు: టెర్రకోటా కుండీలు మొక్కలకు చాలా అనుకూలమైనవి. సహజంగా కూడా వుంటాయి. ఈ కుండీలు చాలా కాలం మంచి రంగు కలిగి వుంటాయి. టెర్రకొటా పాట్ లోని క్లే లో మంచి ఐరన్ వుండి మొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది. తేమను పీల్చి చల్లగా వుంచుతుంది. అయితే అవి పగలకుండా జాగ్రత్త పడాలి.
ప్లాస్టిక్ కంటైనర్లు: ప్లాస్టిక్ కంటైనర్లు ఎప్పటికి మంచివే. తేలికైనవి కూడాను. త్వరగా పగలవు తుప్పు పట్టవు మరకలు పడవు. రంగులలో ఆకర్షణీయంగా వుంటాయి. ఖరీదు తక్కువ మెయింటెనెన్స్ తేలిక. ఇవి చాలా లైట్ వెయిట్ కనుక డెకరేషన్ కొరకు వాడవచ్చు.
కాంక్రీట్: సాధారణంగా తోటమాలులు కాంక్రీట్ ఎందుకు ఎంపిక చేస్తారంటే విటిలో పెద్ద మొక్కలు పెంచవచ్చు. సైకాస్, చిన్న తాటి మొదలైన చెట్లకు ఇవి బాగుంటాయి. బరువుగా వుండి పెద్ద తోటలకు సరిపడుతాయి. ఇవి కూరగాయల పెంపకానికి కూడా వాడవచ్చు.
.
చెక్క కుండీలు: చెక్క పెట్టెలు లేదా బుట్టలు బీన్స్, టొమాటో మొదలైనవి పెంచటానికి బాగుంటాయి. నీరు నిలిచి వుంటుంది. తేలికగా వుండి సహజంగా వుంటాయి. త్వరగా పాడుకాని రెడ్ వుడ్ లేదా సెడార్ వంటి కుండీలు చాలాకాలం మన్నుతాయి. ఇతర చెక్క కుండీలకు కూడా మంచి రంగు వేసి మెయిన్టెయిన్ చేయవచ్చు.
కుండీలు ఏ రకం పెట్టాలనేది ఎంపిక చేయాలంటే, ఇంటి పెరడులో మీకు లభ్యంగా వున్న స్ధలాన్ని బట్టి ఎంపిక చేయండి. చిన్న ఇండ్లలో లేదా అపార్ట్ మెంట్స్ లో వుండే వారికి గార్డెన్ కలలు తీరాలంటే కంటైనర్లతో కూడాన ఒక చిన్న ఇండోర్ గార్డెన్ ఏర్పాటు వారి అభిరుచి తీర్చగలదు.



Click it and Unblock the Notifications
