Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
ఎవర్ గ్రీన్ అంటే... ఎప్పటికి ఇలా....!

స్పిండిల్ ట్రీ, చెర్రీ లారెల్, రోడెండ్రాన్ మొక్కలు సాధారణంగా ఎపుడూ పచ్చగా పెరుగుతూనే వుంటాయి. వీటిని ఎప్పటికపుడు కత్తిరించి ట్రిమ్మింగ్ చేస్తూ వుంటే చాలు. ఇక గార్డెన్ మంచి షేపు లో కూడా వున్నట్లే. ఈ మొక్కలను పెంచాలంటే కొన్ని చిట్కాలు చూడండి.
మొదటి సంవత్సరంలో మొక్కలకు రోజూ నీరు పెట్టండి. గార్డెన్ లోని మట్టి ఎపుడూ తేమగా వుండేలా చేయండి. ఇక రెండవ సంవత్సరంలో వారానికోసారి నీళ్ళు పోస్తే చాలు. మొక్కల చుట్టూ భూమి ఉష్ణోగ్రత నిలపటానికి పురుగులు చేరకుండాను, చెట్ల బెరడు వంటివాటిని ఆర్గానిక్ ఎరువుగా వేయండి.
కొత్త ఆకులు వచ్చే ముందుగా కొమ్మలను కత్తిరించండి. పైన్ వంటి మొక్కలు కత్తిరించాలంటే చలికాలం ముందు మంచిది. కత్తిరిస్తే కొత్త కొమ్మలు, ఆకులు పుట్టుకు వస్తాయి. మొక్క చక్కటి షేపులో వుండాలంటే కత్తిరింపు ప్రధానమైంది.
మొక్కలు బాగా ఎత్తు ఎదగకుండా చిన్నవిగా వున్నపుడే కత్తిరించి ఆకారాన్ని మెయిన్టెయిన్ చేస్తే మంచిది. మొక్క చుట్టూ ఒక వైర్ కట్టడం, వైరు దాటి వచ్చిన కొమ్మలను కత్తిరించేయడం చేస్తే మొక్కకు చక్కని ఆకారం ఏర్పడుతుంది. మొక్కలు బాగా ఎదగాలంటే, ఎప్పటికపుడు వాటిని తగిన ఆకారాలలో మొక్క భాగానికి సూర్యరశ్మి బాగా పడేలా కత్తిరిస్తూ వుండాలి.



Click it and Unblock the Notifications
