Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
వెజ్ గార్డెన్ లో శిలీంధ్రాలను వదిలించుకోవటానికి చిట్కాలు
శిలీంధ్రాలు అనేవి ప్రతి తోటమాలి ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య,కాబట్టి మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోవాలి!! శిలీంధ్రాలు అన్నిచోట్లా ఉంటాయి. అంతేకాక దాని చుట్టూ అనేక సమస్యలు కూడా ఉంటాయి. మీరు దానిని ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవాలి! వాస్తవానికి మొక్క మీద శిలీంధ్రాలు ఉంటే వ్యాధి నిరోధకత తగ్గుతుంది. అందువలన అలంకార మొక్కలు లేదా గులాబీలు లేదా పొదలు వంటి వాటి మీద మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ మొక్కల మీద ఫంగస్ ను కనుగొంటే,అప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది! మీరు ఒక మొక్క మీద ఫంగస్ ను కనుగొంటే,అది తప్పనిసరిగా ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.
మీ కూరగాయల తోటలో మొక్కల మీద శిలీంధ్రాలు ప్రభావితమైతే మీరు కొన్ని విషయాలను చూడవలసిన అవసరం ఉంది. మీరు బూడిద లేదా తెలుపు బూజు మచ్చలను కనుగొని వాటిని వదిలించుకోవటానికి మార్గాలను చూడవలసిన అవసరం ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ తుది దశలో ఉన్నప్పుడు మీరు ఆకులు పసుపు టర్నింగ్ కు మారటం కనుగొనవచ్చు. మీ తోట విషయంలో గార్డెనింగ్ చిట్కాలు పొందాలని అనుకుంటే మీరు కొన్ని అనుసరించాలి. కూరగాయల తోటలను ఇష్టపడే ప్రజలను కొన్ని శిలీంధ్రాలు బాధ కలిగిస్తాయి. కాబట్టి,మీరు ఒక మంచి మార్గంలో మీ మొక్కల పట్ల శ్రద్ధ వహించటం అత్యవసరం. కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోవటం వలన ఇంట్లో ఒక కూరగాయల తోట పెంచటం ముఖ్యం. ఇక్కడ కూరగాయల తోటల్లో శిలీంధ్రాలు వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. క్రిమి సంహారిణులు
మీరు కూరగాయల తోటలలో శిలీంధ్రాలను వదిలించుకోవాలని కోరుకుంటే అప్పుడు పురుగుల మందులు పిచికారీ చేయాలి. శిలీంధ్రాలు కూరగాయల తోటలలో కూరగాయల తాజాదనానికి ముప్పు కలిగిస్తాయి. కాబట్టి క్రిమి సంహారిణులను పిచికారీ చేయటం ముఖ్యం. ఒక గాలన్ నీటిలో ఒక స్పూన్ సబ్బు ద్రవం కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. మీరు అనుసరించటానికి తోటపని చిట్కాలలో ఇది ఒకటి.
2. వెల్లుల్లి మేజిక్
వెల్లుల్లి అనేక ప్రత్యేకతలతో ఉంటుంది. అంతేకాక గార్డెనింగ్ కు చాలా సహాయకారిగా ఉంటుంది. వెల్లుల్లిని ఉపయోగించటం తోటపని చిట్కాలలో ఒకటిగా ఉంది. శిలీంధ్రాలు వదిలించుకోవటం కోసం వెల్లుల్లి గడ్డలను ఉపయోగించండి. వెల్లుల్లి గడ్డలు మరియు నీటిని కలిపి బ్లెండ్ చేసి గుజ్జు బయటకు తీసి శిలీంధ్రాలను హరించడం కొరకు మొక్కలపై స్ప్రే చేయాలి. కూరగాయల తోటలలో శిలీంధ్రాలను ట్రీట్ చేయటానికి ఇది ఉత్తమ మార్గం.
3. బేకింగ్ సోడా
కూరగాయల తోటల నుండి శిలీంధ్రాలను పోగొట్టటానికి బేకింగ్ సోడాను ఖచ్చితంగా ఒక భాగంగా చేయవచ్చు. ఒక గాలన్ నీటిలో డిష్ వాష్ లిక్విడ్ మరియు బేకింగ్ సోడా కలిపి అవసరమైన ద్రావణం తయారుచేసికోవాలి. మీరు ఎల్లప్పుడూ అనుసరించటానికి సులభమైన తోటపని చిట్కాలలో ఒకటిగా ఉంది. మీరు కనీసం వారానికి ఒకసారి కూరగాయల తోటలలో ఉండే శిలీంధ్రాల కొరకు ఈ చికిత్సను ఉపయోగించాలి.
4. గొప్ప కాంబినేషన్
కూరగాయల తోటలలో ఉండే శిలీంధ్రాల చికిత్సకు వెల్లుల్లి మరియు మిరియాల కాంబినేషన్ ఒక గొప్ప కాంబినేషన్ అని చెప్పవచ్చు. వెల్లుల్లి,సబ్బు ద్రవం,ఒక గాలన్ నీరు మరియు మిరియాలు ఈ చికిత్స కోసం అవసరమైన పదార్ధాలు. ఈ పదార్థాలు అన్నింటిని కలిపి కూరగాయల తోటల మీద పిచికారి చేయాలి.
5. సల్ఫర్ సహాయపడుతుంది
సల్ఫర్ ఉత్పత్తులు ఫంగస్ వదిలించుకోవటం కొరకు సహాయపడతాయి. అయితే, నిజానికి లక్షణాలు కనిపించటానికి ముందు మీరు ఈ స్ప్రే మీద శ్రద్ధ వహించాలి. మీరు సల్ఫర్ పిచికారీ చేసినప్పుడు ఉష్ణోగ్రత 90f పైన ఉండకూడదని గమనించండి. సల్ఫర్ వలన మొక్క చాలా దెబ్బతింటుంది. అందువల్ల జాగ్రత్తగా స్ప్రే చేయాలి.
6. ఆయిల్ చికిత్స
ఫంగస్ ను నూనెలు స్ప్రే చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. క్రమం తప్పకుండా మొక్కల మీద పిచికారీ చేయాలి. ఫంగస్ నుండి మీ మొక్కల రక్షణకు వేప నూనె లేదా జోజోబ నూనె సహాయపడతాయి. నూనెలు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పిచికారి చేయకూడదు. సూచనల కోసం శిలీంద్ర సంహారిణి లేబుల్ ను చుడండి.
మీరు తోటపని మరియు మొక్కలను ప్రేమించే ఒక వ్యక్తి అయితే,అప్పుడు మీకు మీ మొక్కల అనారోగ్య మరియు శిలీంధ్రాలు ద్వారా ప్రభావితం గురించి నిజంగా ఆందోళన ఉంటుంది. మీ కూరగాయల తోట చాలా అమూల్యమైనది! మొక్కలకు కూడా జీవం ఉంటుంది. అందువలన మీరు వాటికీ ప్రేమ మరియు రక్షణ ఇవ్వాలి.



Click it and Unblock the Notifications
